దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు నమో.

 *దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు నమో


!*


*సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం మోదీ!*


*అన్నామలైని గెలిపిస్తే కోయంబత్తూరు గొంతుకై పోరాడతారు*


*కోయంబత్తూరు ఎన్నికల ప్రచారసభలో యువనేత నారా లోకేష్*


కోయంబత్తూరు  (ప్రజా అమరావతి ):- : సంక్షేమం, అభివృదద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్రమోడీ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు.  కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యాన నిర్వహించిన బహిరంగ సభలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మోదీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకత్వం. అందుకే మోదీని మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది. ప్రధాన మంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికే మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. పదేళ్లలో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికనేత నరేంద్ర మోదీ.  ఒకపక్క సంక్షేమ పథకాలను అందిస్తూనే.....దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతి శక్తి, భారత్ మాల వంటి అభివృద్ది కార్యక్రమాలు తెచ్చి సంపద సృష్టించారు. డీమానెటైజేషన్, జిఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశారు. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దేశ ప్రజల్లో నమ్మకాన్ని నింపారు. మోదీ నేతృత్వంలో కోవిడ్ సంక్షోభాన్ని మన దేశం అధిగమించిన తీరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను మోదీజీ ప్రపంచానికి చాటి చెప్పారు.

*అమెరికా, చైనాలకు ధీటుగా భారత్ ఆర్థిక వ్యవస్థ!* 

ప్రపంచంలో 11 వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 స్థానానికి తెచ్చిన సమర్థనేత నరేంద్ర మోదీ. రాబోయే 5 ఏళ్లలో అమెరికా, చైనాలతో పోటీ పడుతూ ధీటైన ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు ఆయన పనిచేస్తున్నారు. తమిళ భాష , సంస్కృతి, సంప్రదాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంత గానో గౌరవిస్తారు. 74 వ యూఎన్ జనరల్ అసెంబ్లీ లో ప్రధాని తమిళంలో మాట్లాడారు.  తమిళ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది.  తమిళనాడు అభివృద్ధి కోసం సుమారుగా 2. 31 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. రైల్వేస్, రోడ్లు, ఆయుష్మాన్ భారత్ , బీమా యోజనా, పరిశ్రమలకు రాయితీలు, తాగు, సాగునీటి ప్రాజక్టులు,స్మార్ట్ సిటీస్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కేంద్రప్రభుత్వం అమలు చేసింది.

*తమిళ ప్రజల పట్టుదల అంటే నాకు ఇష్టం!*

దేశంలోనే అపార అభివృద్ధికి అవకాశాలున్న నేల కోయంబత్తూరు. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరొందిన కోయంబత్తూర్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోయంబత్తూర్ వచ్చాను. అనేకమంది పారిశ్రామికవేత్తలను, తెలుగు వారిని కలిసాను. ఎన్నికల ప్రచారానికి తమిళనాడు రావడం మాత్రం ఇదే మొదటి సారి... ఇదొక డిఫరెంట్ ఎక్సపీరియన్స్. తమిళ ప్రజల పట్టుదల నాకు ఇష్టం. తమిళ ప్రజలు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ఎంతగానో ప్రేమిస్తారు.  తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటారు. నేను ఇక్కడికి ఎందుకో వచ్చానో చెబుతాను దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రజలకి సేవ చెయ్యడానికి మీరు ఉద్యోగం వదులుకుంటారా? మీరు ఐఏఎస్, ఐపిఎస్ లేదా ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని ప్రజలకి సేవ చెయ్యడానికి ముందుకు వస్తారా? అలాంటిది చిన్న వయస్సులో ఐపీఎస్ వదులుకొని ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చిన సింగం అన్నామలై. 

*దమ్మున్న నాయకుడు అన్నామలైని గెలిపించండి!*

కర్ణాటకలో ఆయన సింగం ... ఐపీఎస్. తమిళనాడులో ఆయన టిపిఎస్. టిపిఎస్ అంటే తమిళ్ పీపుల్ సర్వీస్. నేను అన్నామలై ఫ్యాన్ ని , అన్నామలై నాకు మంచి మిత్రుడు.  అన్నామలై ఒక దమ్మున్న నాయకుడు. కోయంబత్తూరు సర్వతో ముఖాభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోండి. నేను కొన్ని ఆర్టికల్స్ చూసాను... అన్నామలై కాంట్రావర్సీ కామెంట్స్ చేసారు అని. ఆయన కాంట్రావర్సీ తో ఎదిగిన నాయకుడు కాదు క్యాలిబర్ తో ఎదిగిన వ్యక్తి. అన్నామలై కి ఒక విజన్ ఉంది, తమిళనాడు దశ, దిశా మార్చే మాస్టర్ ప్లాన్ అన్నామలై దగ్గర ఉంది. నా మిత్రుడు అన్నామలై తరపున ప్రచారం చెయ్యడానికి ఇక్కడికి వచ్చాను. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఐపీఎస్ సాధించారు. సామాన్యుడి బాధలు చూసి నాయకుడిగా మారాడు. ఎన్ మన్ , ఎన్ మక్కల్ పాదయాత్ర ఒక చరిత్ర... అన్నామలై తమిళ ప్రజల మనస్సు గెలుచుకున్నారు. అన్నామలై కి రైతు కష్టం తెలుసు, ఉద్యోగాలు లేక యువత పడుతున్న బాధలు తెలుసు, మహిళల సమస్యలు తెలుసు, పారిశ్రామిక వేత్తలు పడుతున్న ఇబ్బందులు తెలుసు. అన్నామలై మార్పు కోసం పోరాడుతున్నారు. ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు ప్రజలు అన్నామలైని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

*అన్నామలై కల – వికసిత్ కోయంబత్తూరు*

అన్నామలై కల వికసిత్ తమిళనాడు - వికసిత్ కోయంబత్తూరు. ఆయనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మీ సమస్యలు తీరుస్తారు. గతంలో సిపి రాధాకృష్ణన్ గారి లాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఎంపీగా పనిచేసారు. ఇప్పుడు యువకుడు అన్నామలై కి అవకాశం ఇవ్వండి. కోయంబత్తూరు ఓట్ ఫర్ అన్నామలై. ప్రస్తుతం కోయంబత్తూరు పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. కోయంబత్తూరు సిటీ కూడా ఒక స్టేజ్ వరకూ అభివృద్ధి చెంది ఆగిపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, తాగునీటి సమస్య, రోడ్లు , మౌలిక సదుపాయాలు కల్పించాలి.  ఇక్కడ ఉన్న ఫౌండరీలు ఎదుర్కుంటున్న సమస్యలు, పవర్ లూమ్, హ్యాండ్ లూమ్స్ సమస్యలు, ఆటోమొబైల్ ఆన్సిలరి పరిశ్రమల సమస్యలు, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అన్నీ అన్నామలై కి తెలుసు. కోయంబత్తూరులో అన్నామలైని మీకు ప్రశ్నించే హక్కు వస్తుంది. 

*అన్నామలైని గెలిపిస్తే పోరాడి నిధులు తెస్తారు!*

కోయంబత్తూరు అభివృద్ధి, ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చడానికి అన్నామలై కి ఒక విజన్ ఉంది. ఒక్క కంపెనీ, ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఇక్కడ ఫౌండరీలు లేటెస్ట్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చెయ్యాలి. పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులను , పరిశ్రమను ఆదుకోవాలి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి కి స్పెషల్ జోన్స్ ఏర్పాటు చెయ్యాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చెయ్యాలి. స్టార్ట్ అప్ కంపెనీలు అభివృద్ధి చెయ్యడానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలి. డిఫెన్స్ కారిడార్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, దానిని అభివృద్ధి చెయ్యాలి. తాగునీటి సమస్య, రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలి. కోయంబత్తూరు పార్లమెంట్ కి ఏం కావాలో అన్నామలైకి తెలుసు. పంచాయతీ ప్రెసిడెంట్ నుండి పార్లమెంట్ వరకూ ఒకే పార్టీ ఉంటే ప్రశ్నించే వారు ఉండరు, అన్నామలైని గెలిపిస్తే ఇక్కడి సమస్యలపై పోరాడతారు. కేంద్రంనుంచి నిధులు తెచ్చి పెద్దఎత్తున అభివృద్ధి చేస్తారని యువనేత లోకేష్ పేర్కొన్నారు.

Comments