విద్యార్థులను సమాజ సేవకులుగా తీర్చిదిద్దాలి.అమరావతి (ప్రజా అమరావతి);

* విద్యార్థులను సమాజ సేవకులుగా తీర్చిదిద్దాలి*


తాడికొండలోని భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఆంధ్రప్రదేశ్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ను పర్యవేక్షించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్,  స్టేట్ చీఫ్ కమిషనర్ భారత్ స్కౌట్స్ &  గైడ్స్  ఎస్.సురేష్ కుమార్ .


జాతీయ సమైక్యత కోసం సేవా భావంతో దేశానికి, రాష్ట్రానికి సేవ చేయటానికి మానవత్వం  పెంపొందించుకోవడానికి,  సమగ్రాభివృద్ధికి స్కౌట్స్ కృషి చేయాలని భారత్ స్కౌట్స్ &  గైడ్స్  స్టేట్ చీఫ్ కమిషనర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్  ఎస్.సురేష్ కుమార్  అన్నారు.

భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఆంధ్రప్రదేశ్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ (తాడికొండ, గుంటూరు జిల్లా)లో జరుగుతున్న ‘రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంపు’ స్కౌట్స్ రెసిడెన్షియల్ క్యాంపును పాఠశాల విద్యాశాఖ కమిషనర్,  స్టేట్ చీఫ్ కమిషనర్ భారత్ స్కౌట్స్ &  గైడ్స్  ఎస్.సురేష్ కుమార్  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నివాసం ఉండేందుకు కర్రలతో తయారుచేసిన టెంట్లు, గాడ్జెట్లు, ఫస్ట్ఎయిడ్ లో బ్యాండైజ్ కట్టులు కట్టడం, స్ట్రక్చర్ నిర్మాణం, తాళ్లతో వేసే ముడులు (నాట్స్),  మ్యాపింగ్, స్టార్గేజింగ్, ఎస్టిమేషన్, సిగ్నలింగ్ ప్రాక్టికల్ చేయడం వంటి విషయాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కమిషనర్    ఎస్.సురేష్ కుమార్  మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో స్కౌట్ యూనిట్ మొదలు పెట్టాలని, విద్యార్థులు లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలని, క్రమశిక్షణతో పాటు విద్యార్థి దశ నుండే ప్రజలకు సమాజసేవ సేవ చేయాలనే దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా మన రాష్ట్రాన్ని ప్రత్యేకమైన స్థానం నిలబెట్టడానికి స్కౌట్ మాస్టర్లు విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చి సమాజ సేవకులుగా తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్రంలోని క్యాంపు సైట్లను, తాడికొండ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. 

ఈ నెల 24 నుంచి జరుగుతున్న ఈ క్యాంప్ ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. ఈ క్యాంపునకు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఎన్.టి.ఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి 138  విద్యార్థులు, 7 స్కౌట్ ఎగ్జామినర్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్కౌట్ ట్రైనింగ్,  ఫస్ట్ ఎయిడ్,  మ్యాపింగ్, స్టార్ గేజింగ్ మొదలైన సబ్జెక్టులను శిక్షణ ఇచ్చి పరీక్షల నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రధానం చేయనున్నారు. 

ఈ కార్యక్రములో  డైరెక్టర్ కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ & కమిషనర్ రేంజర్ భారత్ స్కౌట్స్ &  గైడ్స్ శ్రీమతి పయ్యావుల  పార్వతి ,   జిల్లా విద్యాశాఖాధికారి & జిల్లా చీఫ్ కమిషనర్ భారత్ స్కౌట్స్ &  గైడ్స్ గుంటూరు శ్రీమతి పి.శైలజ ,  స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ (యస్.ఓ.సి)  పి.శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఏఎస్ఓసి షేక్ నజీర్,  జిల్లా కార్యదర్శి ఎం.ఏడుకొండలు, క్యాంప్ ఆఫీసర్ దారం ప్రసాద్,  స్కౌట్ మాస్టర్లు తదితరుల పాల్గొన్నారు. 


Comments