అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి.

 *అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి*


.. 


*విజ్ఞప్తి చేసిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి* ..


*ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి తో కలిసి 26,25వ వార్డులో క్రిష్ణారెడ్డి ప్రచారం*.. 


*వేమిరెడ్డి,బీద,కావ్య,వంటేరు కలయిక అద్భుతమన్న ప్రజలు* 


*అపూర్వ స్వాగతం పలికిన వార్డు ప్రజలు* 


*విజయం తధ్యమంటున్న కావలి ప్రజలు* 


కావలి  (ప్రజా అమరావతి );నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపుతానని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) ప్రజలను విజ్ఞప్తి చేశారు. బుధవారం కావలి పట్టణం లోని 26,25వ వార్డులోఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, జనసేన కావలి ఇంచార్జి అలహరి సుధాకర్, బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,బీద రవిచంద్ర, కావ్య క్రిష్ణారెడ్డి,వంటేరు వేణుగోపాల్ రెడ్డి ల కలయిక అద్భుతమని, నిజాయితీ గల నాయకులని ప్రజలు కొనియాడారు. గడప గడప లో వారికి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నవరాత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు అంతమోందించడానికి టీడీపీ కి ఓటు వేయాలన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ రెడ్డి ఏమి చేశారో ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, అరాచక పాలనకు ముగింపు పలకడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడపడానికి చంద్రబాబు ముఖ్యమంత్రి గా రావలసిన అవసరం ఉందన్నారు. వైసీపీ కి ఓటేసి మరోసారి మోసపోవద్దని కోరారు. సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4000 ఇవ్వడం జరుగుతుందని, స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15000 అందజేయడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, 18 ఏళ్ళు నిండిన ఆడ బిడ్డలకు నెలకు 1500 ఇవ్వడం, రైతులకు సంవత్సరానికి రూ.20000 అందజేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు...

Comments