పక్షి కన్నుపై నే వేటగాడి గురి ఉండాలి.

 పక్షి కన్నుపై నే వేటగాడి గురి ఉండాలి



 తెనాలి (ప్రజా అమరావతి);

ఇది ఎన్నికలతరుణం లో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని  ఈ వేటలో విజయ లక్ష్యసాథనే   ముఖ్యమని వేటగాడి గురి పక్షికన్నుపైనే ఉండాలని ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నావేటగాడు ప్రాణాలుకోల్పాతడన్న విషయం ఙ్ఞాపకం ఉంచుకోవాలని తెలుగు దేశంనేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన 64వ జన్మదిన వేడుకలకు  తెనాలి NVRCలో పెద్దసంఖ్యలో ఆహ్వానం పలికిన అభిమానులకు థన్యవాదాలు తెలుపుతూ మానవ జీవితాన్ని చెట్టుతో పోల్చుతూ చెట్టు పచ్చదనం ఉంటే ఒకవిథంగా  ఎండినపుడు కట్టెలా ఎలా ఉపయోగ పడూతుందో    అలాగే తానుకూడా తెనాలి ప్రజల సంక్షేమం కోసం ఆఖరిశ్వాసవరకు పోరాడుతానని అభిమానుల హర్షథ్వానాల మథ్య అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎపుడూ ఏసమస్య వచ్చినా తాను సర్వదా అందుబాటులో ఉంటానన్నారు.తను అభిమానించే చంద్రబాబు ,వారికుటుంబ సభ్యులకు మానసిక క్షోభపెట్టిన  వైనం తనను వేథిస్తూ  వెన్నాడుతుందని అందుకోసం MLAమనోహర్  ను  గుంటూరు MPగా పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించవల్సిన బాథ్యత అందరి పై ఉందన్నారు. 


ఈ సమావేశంలో పాల్గొన్న TDP పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ,MLA జనసేన అభ్యర్థీ  నాదెండ్ల మనోహర్ లు మాట్లాడుతూ రాజా  తను నమ్మిన వ్యక్తి కోసం ఎంతవరకైనా వెళ్ళటానికి వెనుకాడడని ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఆయన ప్రభావం ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు,అందరూ కలసి దుష్టపాలన అంతం చేయాలన్నారు, మరెన్నోపుట్టినరోజు వేడుకలు  ఆనందమంయంగా ఆలపాటి జరుపుకోవాలని ఆకాంక్షించారు,


ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆలపాటి

 అభిమానులు పాల్గొన్నారు.సంగం జాగర్లముడి నుండి NVRCకి రావటానికి చాలసమంయం తీసుకోవటం ఎన్నికల కోడ్ అమలుండటంతో జన్మదిన వేడుక సభ అరగంటలోపే ముగించాల్సివచ్చీంది.దారిపొడవునా అశేష అభిమానంతో  ప్రజలు " "జై జై ఆలపాటి "అంటూ ఆయనపై పూలవర్షం కురిపించారు. 


Comments