కూటమి మ్యానిఫెస్టో కళకళలాడుతోంది.*జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే..మీ భూమి మీది కాదు*


*గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు*


*కూటమి మ్యానిఫెస్టో కళకళలాడుతోంది


*


*గన్నవరం ప్రజలు వీరోచితంగా పోరాడారు*


*పోలవరం కాలువల్లో మట్టి దొంగతనం చేసిన నీచులు వైసీపీ నాయకులు.*


*జగన్ రెడ్డి అవినీతి సొమ్మును తిరస్కరించిన ఉద్యోగుల చైతన్యం బ్రహ్మాండం*

-గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు


గన్నవరం (ప్రజా అమరావతి): మే నెలలో సైతం వరుణ దేవుడు మనల్ని కరుణించాడు. అనుమానం లేదు. గెలుపు మనదే.  తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు వర్షాన్ని, ఎండలను లెక్క చేయకుండా కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వరుణ దేవుడు మీ సంకల్పం చూసి భయపడుతున్నాడు. గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. 

*గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు*

చివరి గడియకు వచ్చాం. మూడు రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పెద్ద సైకో ఉన్నాడు. గన్నవరంలో ఒక పిల్లసైకో ఉన్నాడు. ఈ పిల్ల సైకో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. కబడ్ధార్ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తాం. యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి. రాజకీయాలను ఆసరా చేసుకోలేదు. తెలివితేటలతో అమెరికా వెళ్లి సంపద సృష్టించిన వ్యక్తి. ఇక్కడ పిల్లసైకో రౌడీయిజం, భూకబ్జాలతో డబ్బులు సంపాదించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేను ప్రజల గెలవాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్రం నిలబడాలి. మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి. ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం. ఎక్కడకు వెళ్లిన ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. చరిత్రలో మీరు చూడని విధంగా పిల్ల సైకో ఓడిపోబోతున్నాడు. ఎగిరెగిరిపడ్డావ్...నా దగ్గర తోక జాడిస్తే..తోక కత్తిరిస్తాం..కాని ఎవరిని వదిలిపెట్టం.

*కూటమి మ్యానిఫెస్టో కళకళలాడుతోంది*

నవరత్నాలుతో ప్రజలను నవమోసాలు చేశాడు జగన్ రెడ్డి.  అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం. మన ఎన్నికల మ్యానిఫెస్టో ముందు జగన్ రెడ్డి మ్యానిఫెస్టో వెలవెలబోయింది. మనది కళకళలాడింది. కూటమి మ్యానిఫెస్టో హామీలను తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది. ఆడబిడ్డలు సైతం వర్షాన్ని లెక్కచేయకుండా మీటింగ్ కు వచ్చారు. ఇది నేను ఎన్నడూ మరిచిపోలేను. నా గెండెల్లో పెట్టుకుంటాను. గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ 9 సార్లకు గాను 8 సార్లు గెలిచింది తెలుగుదేశమే. యార్లగడ్డ గెలుపు రాసుకోండి. 

*గన్నవరం ప్రజలు వీరోచితంగా పోరాడారు*

తెలుగుదేశం పార్టీ ఆపీసుకు నుప్పు పెట్టినప్పుడు, నన్ను జైల్లో పెట్టినప్పుడు మీరు వీరోచితంగా పోరాడారు. త్యాగాలు చేశారు. ఒక  క్రమశిక్షణ కలిగిన సైన్యం మాదిరి ముందుకు పోతున్నారు. కూటమి మ్యానిఫెస్టోను ఇంటింటి తీసుకెళ్లండి. ఆడబిడ్డలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం. ప్రతీ ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజీల్, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. ఎన్నికల ముందు గుద్దులు..తర్వాత గుద్దులు గుద్దిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఆడబిడ్డలు ఆనందం లేరు. అందుకే మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డలు గన్నవరం నుంచి ఎక్కడికీ వెళ్లాలన్నా, మీ పుట్టిళ్లకు పోవాలన్నా..ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లండి. బేషజాలు లేకుండా వెళ్లండి..సురక్షితంగా తిరిగి మీ ఇళ్లకు చేర్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ ది. దోపిడీ రాజ్యం నడుస్తోంది. మద్యం, ఇసుకలో దోచేశారు. పోలవరం కాలువల్లో మట్టి దొంగతనం చేసిన నీచులు వైసీపీ నాయకులు. కొండల్ని తవ్వేసిన అనకొండలు వారు. భూ కబ్జాలు పెరిగాయి. 

*జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే..మీ భూమి మీది కాదు*

మీ పట్టాదారు పాస్ పుస్తకాలపై కూడా జగన్ ఫోటో వేసుకున్నాడు. భూమి మీదా? జగన్ రెడ్డిదా? మీ భూమిపై ఆయన ఫోటో ఎందుకు? మీ తాతలు, తండ్రలు ఇచ్చిన భూమి పత్రాలపై జగన్ రెడ్డి బొమ్మలున్న ఈ పాస్ పుస్తకాలను ఏం చేయాలి. చించి చెత్తబుట్టలో వేయాలా వద్దా? జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ భూమి మీకు కాకుండా పోతుంది. ఒరినల్ పత్రాలు జగన్ రెడ్డి వద్ద పెట్టుకుని మీకు జెరాక్సు కాపీలు ఇస్తానంటున్నాడు. అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. సాక్షికి గుమస్తా..రాష్ట్రానికి సలహాదారుడైన సజ్జల ఏదైనా చేస్తానంటున్నాడు. మీ భూమి పత్రాలపై ఒక గుమస్తాను పెత్తనం ఏంటి?. ఆ గుమస్తా మీ పత్రాలకు భద్రత కల్పిస్తాడంట. గుమస్తాలు సలహాదారులైతే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారు. మన ఆస్తిపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటి? ఆస్తులు కొట్టేయడానికి ఇదో కొత్తమార్గం. ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ను జగన్ రెడ్డే నామినేట్ చేస్తాడు. ఆయన చెప్పిందే ఫైనల్. మీ భూములపై న్యాయం చెప్పేందుకు కోర్టులకు కూడా హక్కు లేదంట. దీనిపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు. నేడు మీ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు, 10/1 అండంగల్, ఈసీలు ఉన్న జగన్ రెడ్డి సైకోలు భూములను కొట్టేస్తున్నారు. ఇవన్నీ లేకపోతే రేపు మీరేమవుతారు. 

*మీరు ఓటు వేయకపోతే..మీ ఇంటికి గొడ్డలి వస్తుంది*

ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో ప్యాన్ తిరిగితే మీ మెడకు ఉరే. మీరు ప్యాన్ కు ఉరి వేస్తేనే మీ ఆస్తులకు రక్షణ. అందుకే,  నేను వస్తానే..లాండ్ టెటిలింగ్ యాక్టును రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రవేసి మరలా మీకు పాస్ పుస్తకాలు ఇస్తా. రేపు మధ్యాహ్నం ప్రజలందరూ అన్ని బూతులకు వచ్చి జగన్ రెడ్డి ఇచ్చిన జెరాక్స్ కాపీని చింపి చెత్తబుట్టలో వేయండి. మీ ఆస్తులకు భద్రత కావాలంటే ఉదయం 7 గంటలకే మీరు పోలింగ్ బూతులకు వెళ్లాలి. మీరు ఓటు వేయకపోతే..మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. మీకు గొడ్డలి కావాలా? 

*జగన్ రెడ్డి అవినీతి సొమ్మును తిరస్కరించిన ఉద్యోగుల చైతన్యం బ్రహ్మండం*

జగన్ రెడ్డి టీచర్లను వేధించారు. మద్యం షాపుల వద్ద డ్యూటీకి పెట్టారు, టాయ్‌లెట్ల పోటోలు తీయించారు. అందుకే నిన్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగుల్లో టీచర్లందరూ జగన్ రెడ్డిని వ్యతిరేకించారు. పోలీసులు బ్రహ్మాండంగా ఓటువేశారు. ఉద్యోగస్తుల్లో నూటికి తొంభై శాతం మంది మనకే ఓటేశారు. ఇది రాష్ట్రంలోని ట్రెండ్ కు నిదర్శనం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఊర్లకు ఊర్లు ఒకటి అవుతాయి. జగన్ రెడ్డి వద్ద డబ్బులుంటే మా దగ్గర నీతి ఉందని ఉద్యోగస్తులు నిరూపించారు. జగన్ రెడ్డి డబ్బులను తిరస్కరించారు. నువ్విచ్చే అవినీతి డబ్బులు మాకొద్దంటూ..మన దగ్గరకు వచ్చి రూ.5, రూ.10 వేలు ఇచ్చి ఎన్నికల ఖర్చులకు ఉంచమని చెప్పారు. ఉద్యోగులలో ఉన్న చైతన్యం బ్రహ్మాండం. వారిని అభినందిస్తున్నా. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం.

యార్లగడ్డ వెంకట్రావు వీరోచితంగా పోరాడుతున్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధిస్తున్నా. పిల్లసైకో అక్రమ కేసులు పెట్టినా కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగి వీరోచితంగా పోరాడాడు. వెంకట్రావు పోరాటాన్ని నేను గుర్తించాను. భవిష్యత్తులో ఆయనకు సముచితమైన గౌరవం ఇస్తాం. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పిల్ల సైకోను శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. 

బాలశౌరి ఒక మంచి నాయకుడు. జగన్ రెడ్డి నన్ను, పవన్ కళ్యాణ్ లను తిట్టమంటే...తిట్టే సంస్కృతి తనది కాదని అభివృద్ధి చేయడమే తెలుసని బయటకొచ్చిన నాయకుడు బాలశౌరి. జగన్ రెడ్డి ఎంపీ ఇస్తానంటే వద్దని జనసేనలో చేరారు. మంచి మెజారిటీతో గెలిపించండి. పొత్తు ధర్మంలో భాగంగా నారాయణరావుకు సీటు కేటాయించలేక పోయినా అభ్యర్ధులకు పూర్తిగా సహకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. జగన్ రెడ్డితో విసిగిపోయి వారు మన వద్దకు వస్తున్నారు. వారికి కూడా న్యాయం చేస్తాం.


Comments