సరైన నాయకున్ని ఎంచుకునే ఆయుధం ఓటు.

 *రాష్ట్రాన్ని కాపాడే నాయకుడు చంద్రబాబు :* *సినీ హీరో నారా రోహిత్*


*ముగిసిన నారా రోహిత్ ఎన్నికల ప్రచారం* 


*సరైన నాయకున్ని ఎంచుకునే ఆయుధం ఓటు*


*కాణిపాకం దేవాలయం సందర్శించిన సినీ హీరో నారా రోహిత్*

కాణిపాకం (ప్రజా అమరావతి);


నేటితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది.. గత నెల రోజులుగా అన్ని పార్టీలు పాట పోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అన్ని పార్టీల నాయకులు ప్రచారం తో  ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

తెలుగుదేశం పార్టీ తరపున పలాస నుండి చిత్తూర్ జిల్లా వరకు పది రోజులు పాటు మనకోసం మన నారా రోహిత్ కార్యక్రమంతో రోడ్ షో లు, యువత, కార్మికులు, నిరుద్యోగులతో ఆత్మీయ సమావేశాలు  నిర్వహించారు.. పది రోజుల రోడ్ షోలలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ని  ప్రతి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది..నియోజకవర్గంలో వివరించటం జరిగింది. రోహిత్ గారి రోడ్ షోలకు కార్యకర్తలు ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

 చివరి రోజు చిత్తూర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్రావును గెలిపించాలని ప్రజలను కోరారు.. అనంతరం మాట్లాడుతూ.. రాక్షస పాలనను అంతం చేయడానికి మీరందరూ ఎదురు చూస్తున్న మే 13 కి  ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.( ఓటింగ్ రోజు).  ప్రతి ఒక్కరూ సరైన నాయకున్ని ఎన్నుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది.. సమర్థవంతమైన నాయకుడు మన రాష్ట్రానికి అవసరం.. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయి.. వైసీపీ పాలనలో అన్ని వర్గాలపై దాడులు జరిగాయి.. కొత్తగా ల్యాండ్ టైటిల్ ఆక్ట్ తో మీ భూములు దర్జాగా దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నాడు.. మీ భూములు మీ సొంతం అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి.  మే 13న సోమవారం మీ ఓటు సైకిల్ గుర్తుపై వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి..


ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా

 శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ కాణిపాకం దర్శించుకున్నారు. నారా  రోహిత్ తో పాటు కమెడియన్ రఘు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు, తాడికొండ సాయి కృష్ణ, సంతోష్ కాణిపాకం టెంపుల్ ను దర్శించారు.

Comments