బటన నొక్కి అలిసిపోయిన జగనకు సెలవిద్దాం

 బటన నొక్కి అలిసిపోయిన జగనకు సెలవిద్దాంనందిగామ, మే 11(అనాసాగరం) (ప్రజా అమరావతి): బటన నొక్కి నొక్కి అలిసిపోయిన సీఎం జగన్మోహనరెడ్డికి ఇక సెలవు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో శనివారం ఆయన పర్యటించారు. నందిగామ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్డీయే కూటమి నేతలతో కలిసి వంగవీటి రాధా నందిగామ పట్టణంలో రైతుపేట పార్టీ కార్యాలయం నుండి రైతుపేట, సీఎం రోడ్డు, గాంధీ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా అనాసాగరం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రజలను కులాలు, మతాలవారీగా విడ గొట్టిందని ఆరోపించారు. కాపులందరూ కలిసికట్టుగా ఉన్నామని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుందన్నారు. నందిగామ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను గెలిపించాలని కోరారు. ఇప్పటికే కూటమి అభ్యర్థుల విజయం పక్కా అన్నారు. చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమన్నారు.

Comments