పేదల ఉన్నతికే సంక్షేమ పథకాల అమలు.

 మంగళగిరి (ప్రజా అమరావతి);


 *నేను లోకల్ , మీ ఇంటి ఆడపడుచుని మురుగుడు లావణ్య*


*మురుగుడు లావణ్య పై తమ అభిమానాన్ని చాటుకుంటున్న టీడ్కో కాలనీ ప్రజానీకం*


*-వాలంటీర్లవ్యవస్థను చిన్నాభిన్నం చేయాలన్నదే చంద్రబాబు లోకేష్ లక్ష్యం...*


*-ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో టిడిపి కూటమి ...*


*-ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలి....*


*అందరినీ,పలుకరిస్తూ...ఆదరించమని అభ్యర్థిస్తూన్న వైసిపి అభ్యర్థిని లావణ్య*


 *అడుగడుగున మురుగుడు లావణ్య జననీరాజనాలు* 


*పేదల ఉన్నతికే సంక్షేమ పథకాల అమలు


*


 *విద్య, వైద్య రంగాలకు ఊపిరి పోసిన నాయకుడు జగనన్న*


 *సచివాలయాలు, ఆర్బీకేలతో గ్రామ స్వరాజ్య స్థాపన*


 *ఆయన సంస్కరణలే మళ్లీ జగనన్నను విజయపథంలో నడిపిస్తాయి*


 *జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం.*


 *నారా లోకేష్ ను ఓడించడమే ఎన్నికల ప్రచారం మురుగుడు లావణ్య...*


 *మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య  మేము ఇద్దరం మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మమ్మల్ని గెలిపించండి మేము లోకల్...*


*మురుగుడు లావణ్య కు అడుగడుగున హారతులు పట్టి తమ మద్దతును తెలియజేసిన టిడ్కో కాలనీ మహిళలు..*


*పేద వాడి ఇంటి కల నెరవేర్చిన జగనన్న*


శనివారం మధ్యానం 2.00 గంటలకు మంగళగిరి జగనన్న కాలనీ (టీడ్కో హౌస్ )నందు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థినీ మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రారంభం...ప్రచారంలో ప్రజలను ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న మురుగుడు  లావణ్యకు అడుగడుగునా జననీరాజనం పడుతూ మురుగుడు లావణ్య కు తమ మద్దతు తెలియజేసిన టిడ్కో కాలనీవాసులు,సార్వత్రిక ఎన్నికల్లోపేదల ప్రతినిధులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీ బరిలో ఉన్న తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మురుగుడు లావణ్య మురుగుడు సత్యం జగనన్న కాలనీవాసులని అభ్యర్థించారు జగనన్న కాలనీలో వైఎస్ఆర్సిపి  పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యల్ని ప్రజల నుంచి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా మురుగుడు లావణ్య ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా జగనన్న కాలనీలో  ప్రజలకు కలిగిన సంక్షేమ, అభివృద్ధి లబ్ది వివరాలను తెలియజేశారు. గత టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో  హామీలను ఇచ్చిన నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడం, చేసేదే చెప్పే నిజాయితీగల నాయకుడు జగనన్న అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పారదర్శక పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఇదే విధంగా సంక్షేమ పథకాలు తిరిగి *కొనసాగించాలంటే జగనన్నకు మనమందరం మద్దతిచ్చి సీఎంనీ* చేయాలన్నారు...మే.13-2024,న జరగనున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి ఓటువేయాలని కోరారు. ఎంపీగా ఎమ్మెల్యేగా మీ అమూల్యమైన రెండు ఓట్లు  ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.  ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అనేది ఆయుధం అని ఓటు వేసి ప్రజలకు మంచి చేసే వారిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య  మురుగుడు సత్యం వైఎస్ఆర్సిపి నాయకులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 


Comments