ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల.

 ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ , మంగళగిరి (ప్రజా అమరావతి);

ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల


  ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2024 - 25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి శ్రీ ఆర్. నరసింహా రావు గారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం (మే 14న) విడుదల చేశారు. 

విద్యార్థులను ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ మరియు అభ్యర్థి నమోదుచేసిన పాఠశాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా  ఎంపిక చేయడమైనది.

సంస్థచే నిర్వహించబడుచున్న 38 సాధారణ పాఠశాలల్లో 5 వ తరగతి సీట్లు మరియు 12 మైనారిటీ పాఠశాలలలో గల  యస్.సి & యస్.టి క్యాటగిరీలకు గల  సీట్లు, 6 వ తరగతి నుండి 8 వ తరగతులలో  మిగిలిన సీట్లు మరియు  ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుచేసుకొన్న అభ్యర్థుల సంఖ్య  మరియు హాజరైన  అభ్యర్థుల సంఖ్య మొదలైన వివరా లు ఈ క్రింది విధంగా వున్నాయి:  

క్ర. 

సం.

తరగతి

సీట్ల సంఖ్య

దరఖాస్తు చేసుకున్న  వారి  సంఖ్య

పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య

పరీక్షలలో మొదటి  స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలు

మొత్తం 100 మార్కులకు 


1

5

3195 

21056

17312

యం. కీర్తి – 

విశాఖపట్నం జిల్లా

99 మార్కులు 


2

6

257

5936

3969

పి. సోమేశ్వర రావు – 

విజయనగరం జిల్లా 

87 మార్కులు


3

7

146

2577

1750

కె. ఖగేంద్ర – 

శ్రీకాకుళం జిల్లా 

88 మార్కులు


4

8

172

3097

2185

వై. మేఘ శ్యామ్ – 

విజయనగరం జిల్లా 

83 మార్కులు


మొత్తము :-

3770

32666

25216

-సంస్థచే నిర్వహిస్తున్న 7 సాధారణ జూనియర్ కళాశాలల్లో అన్ని కేటగిరీలకు, 3 మైనారిటీ జూనియర్ కళాశాలల్లో గల  యస్.సి & యస్.టి కేటగిరీలకు గల  సీట్లు,  ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుచేసుకొన్న అభ్యర్థుల సంఖ్య  మరియు ప్రవేశ పరీక్షకు హాజరైన  అభ్యర్థుల సంఖ్య మొదలైన వివరా లు ఈ కింది విధంగా వున్నాయి:  

క్ర. సం.

గ్రూపు

సీట్ల సంఖ్య

దరఖాస్తు చేసుకున్న  వారి  సంఖ్య

పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య

పరీక్షలలో మొదటి  స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలు

మొత్తం 150 మార్కులకు


1

ఎం.పి .సి / ఇ.ఇ.టి


474

40730

35872

జ. యశ్వంత్ సాయి -

తూర్పు గోదావరి జిల్లా -

142 మార్కులు


2

బై.పి.సి / సి.జి.టి


334

13215

11031

యం. మహిత –

కర్నూల్ జిల్లా -

137 మార్కులు


3

ఎం.ఇ.సి / సి.ఇ.సి


341

3004

2405

ఎల్. సత్య రామ్ మోహన్ –

తూర్పు గోదావరి జిల్లా-

140 మార్కులు


మొత్తము:-

1149

56949

49308
సంస్థచే   నాగార్జునసాగర్ లో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలలో వివరాలు ఈ కింది విధంగా వున్నాయి

క్ర. సం

గ్రూపు

సీట్ల సంఖ్య

దరఖాస్తు చేసుకున్న  వారి  సంఖ్య

పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య

పరీక్షల్లో మొదటి  స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలు

మొత్తం 150 మార్కులకు


1

బి.ఏ


40

188

150

యం. రవీంద్ర వర ప్రసాద్- ఏలూరు జిల్లా

113 మార్కులు


2

బి. కాం


40

496

394

టి. గణేష్ –

అన్నమయ్య జిల్లా –

112 మార్కులు


3

బి.ఎస్.సి

(ఎం.పి .సి)


36

396

312

బి. సాయి కృపారెడ్డి  –

శ్రీకాకుళం జిల్లా –

118 మార్కులు


4

బి.ఎస్.సి( ఎం.ఎస్.సి.ఎస్)

36

129

107

బి. రాజశేఖర్ –

వై ఎస్ ఆర్ కడప జిల్లా 

103 మార్కులు


మొత్తము:- 

152

1209

963
ఎంపిక జాబితాలను  https://aprs.apcfss.in/ వెబ్ సైటులో పొందుపరచడమైనది. సంబంధిత పాఠశాలల jnbnivas లాగిన్స్ కు పంపబడును. ఎంపికైన విద్యార్థులకు SMS ద్వారా సమాచారం 15/05/2024  సాయంత్రం లోపు పంపబడును. 

విద్యార్థులు తమ ఫలితాలను విద్యార్థి ఐ.డి /హాల్ టికెట్ ద్వారా https://aprs.apcfss.in/ వెబ్ సైటు నుండి తెలుసుకోవచ్చు. 

ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాలు సంబంధిత పాఠశాలల్లో 16/05/2024 నుండి 1:1 నిష్పత్తి ప్రకారం ప్రతిభ, రిజర్వేషన్ & పాఠశాల ప్రాధాన్యతా క్రమంలో కల్పిస్తారు. 

జూనియర్ కళాశాలలు 1:5 నిష్పత్తి ప్రకారం ప్రతిభ, రిజర్వేషన్ క్రమంలో  20/05/2024 నుండి 22/05/2024 తేదీ వరకు ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో విడివిడిగా కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులను సంబంధిత కళాశాలలకు కేటాయించబడును.

డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులను 1:10 నిష్పత్తి ప్రకారం, ప్రతిభ, రిజర్వేషన్ క్రమంలో 23/05/2024 తేదీన గుంటూరు నందు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కలిపించబడును. 

సంస్థచే నిర్వహిస్తున్న 12 మైనారిటీ పాఠశాలల్లో మరియు 3 మైనారిటీ కళాశాలల్లో మైనారిటీలకు ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పించబడుచున్నవి.

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారితో పాటు ఏపీఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి శ్రీ ఆర్. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి & ఏపీఆర్జేసీ సెట్ కన్వీనర్ శ్రీ హెచ్. ఎండీ ఉబేదుల్లా,  లైజన్ ఆఫీసర్ డా. పి.వి.మల్లేశ్వర్ పాల్గొన్నారు. 

Comments