దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Popular posts
పశుపోషకులకు 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం ...
• GUDIBANDI SUDHAKAR REDDY

NISE’s New PV Lab to Set Global Benchmarks in Solar Testing Capabilities: Union Minister Shri Pralhad Joshi
• GUDIBANDI SUDHAKAR REDDY

NEW INDIA IS "LAND OF OPPORTUNITIES" WITH RAPID REFORMS: LOK SABHA SPEAKER.
• GUDIBANDI SUDHAKAR REDDY
Today India Opens New Frontiers in Himalayan Climate Research, Says Dr. Jitendra Singh.
• GUDIBANDI SUDHAKAR REDDY
కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు.
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment