శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు శ్రీఅమ్మవారి ఆలయము నకు విచ్చేయగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ , ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ మరియు అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ కేంద్రమంత్రి వర్యులు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు, ఆలయ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి గార్లు మరియు అధికారులు కేంద్ర మంత్రి వర్యులకు శ్రీ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
addComments
Post a Comment