సభీ కో రంజాన్ ఈద్ ముబారక్ : మంత్రి రోజాసభీ కో రంజాన్ ఈద్ ముబారక్ : మంత్రి రోజా రంజాన్ ఇఫ్తార్ శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ 


పుత్తూరు, ఏప్రిల్ 30 (ప్రజా అమరావతి): సభీ కో రంజాన్ ఈద్ ముబారక్ అని సంభోదించి, గౌ.ముఖ్యమంత్రికి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారికి  ముస్లిం సోదరులు అంటే ఏంతో ఇష్టం నూతన జిల్లాలో మొదటసారి జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు పుత్తూరులో జరపడానికి అంగీకరించిన ప్రజా ప్రతినిధులకు , అధికారులకు ధన్యవాదాలు అని టూరిజం శాఖ మంత్రి ఆర్ కె  రోజా అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్ జి ఓ కాలనీ ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి టూరిజం శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాగా, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి, డిఆర్ ఓ శ్రీనివాసరావు , అధికారులు మతపెద్దలు , ముస్లిం సోదరులు హాజరయ్యారు. 


మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అడగ్గానే పుత్తూరు షాదీమహల్ కు రూ 1.80 కోట్లు మంజూరు చేశారని నిర్మాణంలో వున్నా ఇక్కడే మనం ఇఫ్తార్ విందు జరుపు కుంటున్నామని అన్నారు.

రంజాన్ ఉపవాస దీక్షల వలన అందరూ  సమానత్వం అనే సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యమని అని అందుకే మనం నేడు ఇఫ్తార్ లో కలసి విందు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జిల్లా కేంద్రం తిరుపతి నూతన జిల్లాలో జరగాల్సిన ఇఫ్తార్ నేను కోరగానే తిరుపతి శాసన సభ్యులు భూమనకరుణాకర రెడ్డి , జిల్లాకలెక్టర్ వెంటనే అనుమతి ఇచ్చారని ధన్యవాదాలు అన్నారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముస్లిం సోదరులకు  రంజాన్ శుభాకాంక్షలు అని , గౌ మంత్రి పట్టుబట్టి నేడు పుత్తూరు లో జిల్లాస్థాయి ఇఫ్తార్ విందు ఇక్కడ ఏర్పాటు చేసారని సంతోషం అని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక  కలయిక రంజాన్ మాసం ప్రసిద్ధి అని ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనలో  ప్రేమ, సోదరభావం, మానవత్వన్ని పెంపొందిస్తాయని తెలిపారు.


ఇఫ్తార్ లో స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్సు డైరెక్టర్ లు మహీన్, ఇమ్రాన్ లు, మత పెద్ద లు షఫీ అహ్మద్ కాజరీ, ఎస్.జే ఖలీల్, ఎస్.ఏ ఇలియాజ్, యూసుఫ్ సాహెబ్, పటేల్, నజీరుల్లా, మత గురువులు షౌకత్ అలీ, స్థానిక ముస్లిం , హిందూ సోదరులు తహసీల్దార్ జయరాములు , డి ఎస్ పి యస్వంత్ , మునిసిపల్ ఛైర్మన్ హరి , కమిషనర్ వెంటరామి రెడ్డి , స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 


ఇఫ్తార్ విందు అనంతరం ముస్లిం సోదరులు మసీద్ పెద్దలు మంత్రి ని సన్మానించి  సెల్ఫీ ఫోటోలు దిగారు.