శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గౌ|| శ్రీ గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌

    తిరుమల,  న‌వంబ‌రు 16 (ప్రజా అమరావతి);


శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గౌ|| శ్రీ గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌



          కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గౌ|| శ్రీ గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.


          టిటిడి అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ సంద‌ర్భంగా శ్రీ గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్‌కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అంద‌జేశారు.


          ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి శ్రీ అంబటి రాంబాబు, ఎంపిలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ రెడ్డెప్ప, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ భానుప్ర‌కాష్‌రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Comments