ఉగాది నాటికి 5 లక్షల గృహాలు

 


*ఉగాది నాటికి 5 లక్షల గృహాలు


*


పార్వతీపురం, ఫిబ్రవరి 23 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఉగాది నాటికి 5 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీశా అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు విచ్చేసిన మేనేజింగ్ డైరెక్టర్ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.82 లక్షల గృహాల నిర్మాణం పూర్తి అయ్యాయని చెప్పారు. రూఫ్ స్థాయి, రూఫ్ పూర్తి స్థాయిలో 3 లక్షల గృహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభం కాని గృహాల నిర్మాణం వెంటనే ప్రారంభించుటకు చర్యలు తీసుకుంతున్నామని ఆయన చెప్పారు. ఏడాది చివరి నాటికి 10 లక్షల గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13,790 గృహాలు ఉగాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటికీ 8 వేల గృహాలు పూర్తి అయ్యాయని చెప్పారు. 60 శాతం మేర పూర్తి అయ్యాయని, మిగిలిన గృహాలు వివిధ దశలలో ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లాకు మొత్తం 24,580 గృహాలు మంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు గృహాలు కల్పించాలని నిధులు మంజూరు చేస్తున్నాయని అన్నారు. అన్ని కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. 


ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు పాల్గొన్నారు.

Comments