గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


 *- పామర్రు పోలీస్ స్టేషన్ కు తరలింపు*గుడివాడ, ఫిబ్రవరి 6 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావితోపాటు టిడిపి నేతలు వేణుబాబు తదితరులను పామర్రు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మచిలీపట్నంలో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసిపి కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఉదయం కొల్లు రవీంద్ర, కొనకళ్ళ బుల్లయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసిపి కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపే ప్రయత్నం చేసిన కొల్లు రవీంద్ర, కొనకళ్ళ బుల్లయ్యను అదుపులోకి తీసుకొని గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.  వీరిని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు పరామర్శించారు. కాగా మచిలీపట్నంలో అరెస్ట్ చేసిన కొల్లు రవీంద్ర, కొనకళ్ల బుల్లయ్యలను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి, వేణుబాబు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Comments