ఉద్యోగుల ఆరోగ్య పధకంపై సిఎస్ డా.కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
అమరావతి,15 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):ఉద్యోగుల ఆరోగ్య పధకం(ఇహెచ్ఎస్)పై బుధవారం అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పధకం,మెడికల్ రీ ఇంబర్సుమెంట్ అంశాలతో పాటు డా.వైయస్సార్ ఆరోగ్యశ్రీ పధకం అమలుపైన చర్చించారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య పధకం(ఇహెచ్ఎస్)లో మరిన్ని ప్రొసీజర్లు చేర్చే అంశం,ఉద్యోగుల ఆరోగ్య పధకంలో ప్రస్తుతం ఉన్న కొన్ని ఫ్యాకేజీలు ధరల పెంపు,ఉద్యోగుల నెలవారీ కంట్రీబ్యూషన్ పెంపు,మెడికల్ రీ ఇంబర్సుమెంట్ పరిమితి పెంచాల్సిన ఆవశ్యకత,కేన్సర్ వంటి రోగాలకు పరిమితి లేకుండా సహాయం అందించే అంశం,40 యేళ్ళు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఒన్ టైం మాస్టర్ హెల్తు చెకప్ అంశాలకు సంబంధించి సిఎస్.డా.జవహర్ రెడ్డి సమీక్షించారు.ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేస్తే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులకు చెప్పారు.
ఈసమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు,ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్ ఆర్)చిరంజీవి చౌదరి,సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ప్రత్యేక కార్యదర్శి (సియంఆర్ఎఫ్)డా.హరికృష్ణ,ఆరోగ్యశ్రీ సిఇఒ హరీంద్ర ప్రసాద్,ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి టిఎస్ఆర్ మూర్తి,ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment