మంగళగిరిని దోచేస్తున్న రెడ్డి త్రయం.

 కృష్ణ నది తీరం వెంబడి భారీ అక్రమ ప్రైవేటు నిర్మాణం లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ డి.ఈ కృష్ణా రెడ్డీ, ఆసిస్టెంట్ కమిషనర్ హేమా మాలిని రెడ్డి లకు 4 కోట్ల ముడుపులు.

మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరిని దోచేస్తున్న రెడ్డి త్రయం.మంగళగిరిని దోచుకోవడానికి పూర్తిగా కంకణం కట్టుకున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి.


పేదల ఇళ్లు, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్, ప్రతిపక్ష నాయకుల ఆస్తుల మీదకు కరకట్ట కమలహాసన్ ఆదేశాలతో క్షణాల్లో వచ్చే  జగన్ జెసిబిలు కోట్లు ముట్టగానే రిపేర్ కు వచ్చాయా.


ఆర్కే నువ్వు చేస్తున్న అవినీతి అరాచకాలను సీరియల్ గా బయట పెడతాం.


48 గంటల సమయం ఇస్తున్నాం, ఈ అక్రమ భారీ నిర్మాణాల్ని కూల్చివేయాలి లేకుంటే ఆందోళనే.


  - పోతినేని శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి


తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయవాడ క్లబ్ రోడ్ లో కృష్ణ తీరం వెంబడి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం పై మంగళవారం ఉదయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయము డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు


ఈ మీడియా సమావేశంలో _గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.._


కృష్ణ నది తీరం వెంబడి భారీ ప్రైవేటు అక్రమ నిర్మాణం

రివర్ కన్జర్వేటివ్ జోన్,ఎన్జీటీ రూల్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నదీతీరంలో నిర్మాణాలు నిషేధం


కృష్ణ తీరం వెంబడి 80 షాపుల భారీ నిర్మాణం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కమిషనర్, డి.ఈ, కళ్ళు మూసుకున్నారు


కృష్ణ నది తీరం వెంబడి భారీ అక్రమ ప్రైవేటు నిర్మాణం లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ డి.ఈ కృష్ణా రెడ్డీ, ఆసిస్టెంట్ కమిషనర్ హేమా మాలిని రెడ్డి లకు 4 కోట్ల ముడుపులు అందాయి కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు 


సదరు నిర్మాణానికి అధికార పార్టీ వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా  జరుగుతుంది 


ప్రజాధనంతో కట్టిన ప్రజా వేదికను అక్రమ నిర్మాణమని కూల్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం,నేడు అదే జగన్ రెడ్డి నివాసానికి కూత వేట దూరంలో 80 షాపులతో కూడిన పక్కా నిర్మాణం కృష్ణ నది తీరం వెంబడి జరుగుతుంటే ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటో తెలుపాలి 


పేదల ఇళ్లు, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్, ప్రతిపక్ష నాయకుల ఆస్తుల మీదకు కరకట్ట కమలహాసన్ ఆదేశాలతో క్షణాల్లో వచ్చే  జగన్ జెసిబిలు కోట్లు ముట్టగానే రిపేర్ కు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నాం


మంగళగిరిలో తన అధ్యాయం ముగిసిందని ముందే తెలుసుకున్న స్థానిక శాసనసభ్యుడు ఆర్కే మంగళగిరిలో ప్రజాధనాన్ని దోచుకోవడం తోపాటు అక్రమ నిర్మాణాలకు అనుమతుల రూపంలో, నియోజకవర్గ పరిధిలో ఉన్న భారీ కట్టడాల వద్ద జే టాక్స్ వసూలు చేస్తూ అవినీతిపై పూర్తి దృష్టి సారించారు


త్రిమూర్తులు గా మారి మంగళగిరిని దోచేసుకుంటున్న రెడ్ల త్రయం


మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ పని చేయాలన్న టెండర్లు ముందుగానే ఫిక్స్ అయిపోతాయి, టెండర్లు పిలవకుండానే పనులు మొదలుపెట్టేస్తారు, డివైడర్లను మాయం చేస్తారు, కొండ మట్టిని తరలిస్తారు చివరికి రోడ్డు వైండింగ్ మట్టిని కూడా వదలలేదు


ఉండవల్లి కొండకు గుండు కొట్టి దోచేస్తున్నాడు మంగళగిరి కొండ మట్టి తరలించాడు డివైడర్లు కూడా దోచిన చరిత్ర ఆర్కేది


48 గంటల సమయం ఇస్తున్నాం . ఈ రెడ్ల త్రయం ఆ నిర్మాణాన్ని కూల్చి వేయలేకపోతే టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన చేసి వీరిని రోడ్డుకీడ్చడం ఖాయం


ఈ మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామర్ల రాజు, మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు,కూరపాటి మురళీ రాజు,పడవల మహేష్,గోవాడ దుర్గారావు,మల్లవరపు వెంకట్, గోసాల రాఘవ తదితరులు వున్నారు.

Comments