ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పిస్తున్న రావి

 *- ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పిస్తున్న రావి


 *- ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనూహ్య స్పందన* 



గుడివాడ, ఫిబ్రవరి 4 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధతపై కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం స్థానిక 30వ వార్డు ధనియాలపేటలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వాసమాంబ రైస్ మిల్లు దగ్గర నుండి ఇంటింటికీ వెళ్ళి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యుడు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయన్నారు గత 20 ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొడాలి నాని చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిని సాగనంపకపోతే గుడివాడ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే టిడ్కో గృహాలను అర్హులైన పేదలకు కేటాయించామన్నారు. 95శాతం గృహాల నిర్మాణాలు కూడా పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్ళుగా మిగతా 5శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయారున్నారు. టిడ్కో గృహాల సముదాయం సమీపంలో సేకరించిన స్థలాలను మెరక చేసేందుకు రూ. కోట్లు దోచుకున్నారన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు అన్నివిధాలుగా నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తు కూడా ఉండదని హెచ్చరించారు. బాబాయ్ హత్య కేసు ఉచ్చు బిగుస్తోందని చెప్పారు. దీన్ని కప్పిపుచ్చేందుకు మళ్ళీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారన్నారు. 40ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన చంద్రబాబును 420 అంటూ పదేపదే కొడాలి నాని దుర్భాషలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన జగన్మోహనరెడ్డిని ఏమని పిలవాలో కూడా కొడాలి నాని చెప్పాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారన్నారు. ప్రజలంతా సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రావి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్యెల్యే నల్లగట్ల స్వామిదాస్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, కార్యదర్శి గొర్ల శ్రీలక్ష్మి, నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, ముళ్ళపూడి రమేష్ చౌదరి, కంచర్ల సుధాకర్, పండ్రాజు సాంబశివరావు, అసిలేటి నిర్మల, మాదాల సునీత, కొల్లి రమ్యశ్రీ, పోలాసి ఉమామహేశ్వరరావు, వసంతవాడ దుర్గారావు, శొంఠి రామకృష్ణ, అడుసుమిల్లి శ్రీనివాసరావు, షేక్ జానీ షరీఫ్, దేవరపల్లి కోటి తదితరులు పాల్గొన్నారు.

Comments