మంగళగిరిలో భారీగా మధ్యం స్వాధీనం చేసుకున్న ఎస్ ఈ బి అధికారులు.

 మంగళగిరిలో భారీగా మధ్యం స్వాధీనం చేసుకున్న ఎస్ ఈ బి అధికారులు.


మంగళగిరి (ప్రజా అమరావతి);

చట్టప్రకారం లేకుండా మధ్యం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఈ బి అదనపు ఎస్పీ సుప్రజా హెచ్చరిక.


భారీగా మధ్యం స్వాధీనం చేసుకున్న మంగళగిరి ఎస్ఈబి సిఐ మారయ్య బాబు బృందంను అభినందించిన అదనపు ఎస్పీ సుప్రజా.


ఇతర రాష్ట్రాలకు 1108 మధ్యం సీసాలను స్వాధీనం చేసుకున్న మంగళగిరి ఎస్ ఈ బి సిఐ మారయ్య బాబు మరియు సిబ్బంది. గోవా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన మధ్యం అమ్మకాలు చేస్తున్నారన్న సమాచారం తో రంగలోకి దిగిన ఎస్ ఈ బి సిఐ మారయ్య బాబు ఆధ్వర్యంలోని బృందం  ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 1108  మధ్యం బాటిల్స్ తను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున మధ్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి సిఐ, సిబ్బందిని సూపరింటెండెంట్ అన్నపూర్ణ, ఈ ఎస్ అభినందించారు. చట్టప్రకారం కాకుండా చట్టవిరుద్దంగా ప్రవర్తించే వారిపై నిఘా ఎప్పుడూ ఉంటుందని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సుప్రజా హెచ్చరిక జారిచేశారు.

Comments