రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్రికోటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే & కలెక్టర్

 రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్రికోటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే & కలెక్టర్ 



పల్నాడు జిల్లా, 18ఫిబ్రవరి, (ప్రజా అమరావతి) : పల్నాడు జిల్లా లో కోటప్ప కొండ (మహా శివరాత్రి) వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున నరసారావు పేట నియోజక వర్గ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి లు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేడుకల్లో  జీల్లా ఎస్పి రవిశంకర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ప్రభుత్వ అతిథులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులకు స్వామి వారి శేష వస్త్రాలను సమర్పించి ఆశీర్వచనాలు పొందారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు, నరసారావు పేట నియోజక వర్గం శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్.పి. రవిశంకర్ రెడ్డి, ఆలయ పాలక మండలి చైర్ మెన్ కొండల రావు బహుదూర్ దంపతులకు ఆలయ ఈవో వేమూరి గోపి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి సత్కరించి, స్వామి వారి శేష వస్త్రాలతో ఆశిర్వాడించి,కృతజ్ఞతలు తెలిపారు.కోటప్ప కొండ తిరునాళ్ళ కు లక్షలాదిగా తరలి వచ్చిన భకుతులతో త్రికొటేశ్వర స్వామి పుణ్య క్షేత్రం పులకించి పోయింది. ప్రభల వద్ద విద్యుత్తు కాంతులతో ప్రకాశిస్తూ భక్తులను ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి. సాయంత్ర సమయం లో స్వామివారిని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరి శంకర్రావు దంపతులు, శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.         



Comments