నెల్లూరు (ప్రజా అమరావతి);
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మాన్యువల్ ను క్షుణ్ణంగా చదివి అర్థంచేసుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించాల
ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.
జిల్లాలో ఈ నెల 13వ తేదీన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని విఆర్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మరియు ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లకు సంబంధించిన పిఓలకు, ఏపీఓలకు నిర్వహిస్తున్న రెండవ విడత శిక్షణా తరగతులను, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ చక్రధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం వారు ఎన్నికల నియమావళి పై రూపొందించిన మాన్యువల్ ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలన్నారు. పిఓ లు, ఎపిఓ లు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 13 తేదీన పోలింగ్ ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు ఉంటుందని, పోలింగ్ కు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ మొదలుకొని బ్యాలెట్ బాక్సులు సీల్ చేసేంతవరకు జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. పిఓ లు,ఎపిఓ లు ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ నిర్వహణ పై అవగాహన కొరకు ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు మొదలు అయినప్పటి నుండి సాయంకాలం బ్యాలెట్ బాక్సులు సీల్ అయ్యేంతవరకు నిరంతరంగా వెబ్ కాస్టింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ ప్రక్రియ అనంతరం రిసెప్షన్ సెంటర్ కు బ్యాలెట్ బాక్స్ లను చేర్చాలన్నారు అదే విధంగా పిఓ డైరీ మరియు ఇతర ప్రొఫార్మాలను అందజేయాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో పోలింగ్ కు సంబంధించి అన్ని విషయాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని ఎన్నికల విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ వెంట కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోభిక, కావలి ఆత్మకూరు, ఆర్డిఓ లు శ్రీ శీనా నాయక్, శ్రీమతి కరుణకుమారి, నుడా వీసీ, నుడా విసి శ్రీ బాపిరెడ్డి, డిఆర్డిఏ, డ్వామా పిడి లు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ వెంకట్రావు, ఎన్నికల విధులకు హాజరయ్యే పిఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment