*మహిళలు తలెత్తుకునేలా పరిపాలన*
*నిజమైన మహిళా సాధికారత దిశగా ఏపీ*
*జగనన్న మహిళా పక్షపాతి*
*ఎన్నో పథకాల ద్వారా చరిత్ర సృష్టించాం*
*మహిళలకు లబ్ధి చేకూర్చేలా నవరత్నాలు*
*జగనన్న పాలనలో ఇళ్లల్లో స్త్రీలకు గౌరవం పెరిగింది*
*మా ప్రభుత్వ విధానాల వల్ల మహిళలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ*
*మహిళలు ఎదిగే క్రమంలో ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కోవాలి*
*భయపడకుండా ముందుకు సాగాలి*
*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పిలుపు*
*ది హిందూ ఇంగ్లీషు దినపత్రి ఆధ్వర్యంలో మహిళా కాన్‌క్లేవ్*
విజయవాడ (ప్రజా అమరావతి);
మహిళా సాధికారత విషయంలో మన రాష్ట్రం గతంలో ఎన్నడూ లేనంతగా దూసుకెళుతోందని, ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్లే సాధ్యమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ది హిందూ ఇంగ్లీషు దినపత్రిక మహిళా సమావేశాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న మంచి మనసు, ఆదర్శవంతమైన ఆలోచనల వల్లే ఒక సాధారణ మహిళ అయిన తనకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గా గుర్తింపు లభించిందన్నారు.
ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలుంటారనే నానుడి ఉందని, అందుకనుగుణంగా ఏపీలో పరిపాలన కొనసాగుతోందన్నారు. అనాదిగా మహిళలకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి మనదన్నారు. రాధామాధవులు, సీతారాములు, పార్వతీపరమేశ్వరులు , ఇలా ఏ పిలుపు చూసినా మహిళే ముందు ఉంటుందన్నారు. మహిళలకు ఆలోచనా శక్తి, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయన్నారు. మహిళల సాధికారత, మహిళా సమానత్వం అనే విషయాలను మనం కోరుకోకుండానే, మనం అడక్కుండానే మనకు వస్తే ఎలా ఉంటుంది.. అనే దానికి ఏపీ ప్రభుత్వం ఒక గొప్ప నిదర్శనమన్నారు.
*నవరత్నాలతో ఎంతో మేలు*
ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ముఖ్యంగా మహిళల కష్టాలు విన్న జగనన్న వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. పాదయాత్రలో నుంచి పుట్టుకొచ్చిన నవరత్నాలు పథకాలు మొత్తం మహిళలకు మేలు చేసేలానే రూపొందించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అందించడంలో, పదవులు కట్టబెట్టడంలో మహిళలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యతను జగనన్న ఇస్తున్నారన్నారు. ప్రతి మహిళ చదువుకుంటేనే కుటుంబాల తలరాతలు మారతాయని నమ్మిన వ్యక్తి జగనన్న అని తెలిపారు. అందుకే అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన.. లాంటి పథకాలను విద్యా రంగంలో ప్రవేశపెట్టి మహిళల విద్యాభివృద్ధికి జగనన్న పాటుపడుతున్నారని కొనియాడారు. మహిళలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం అండగా ఉంటోందని గుర్తుచేశారు.
*ఆర్థిక పరిపుష్టి దిశగా..*
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం లాంటి పథకాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. మహిళలు పుట్టిన నాటి నుంచి గిట్టే వరకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందేలా చొరవచూపుతున్న ప్రభుత్వం తమదని చెప్పారు. ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జెడ్పీటీసీలు, మున్సిపల్, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, సచివాలయ ఉద్యోగులు.. ఇలా అన్ని పదవుల్లోనూ 50 శాతానికిపైగా మహిళలకే కట్టబెట్టిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగనన్న అని కొనియాడారు.
*ఏకంగా నలుగురు మంత్రులు*
నాగాలాండ్ రాష్ట్ర చరిత్రలో ఇటీవలే తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలు కాగలిగారు అని మంత్రి చెప్పారు. అదే మన రాష్ట్రాన్ని తీసుకుంటే ఏకంగా నలుగురు మహిళలు మంత్రులుగా ఉన్నారని, మన రాష్ట్రంలో మహిళా సాధికారతకు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులకు ఈ ఉదాహరణే నిలువెత్తు నిదర్శనమన్నారు. తమది మహిళా పక్షపాతి ప్రభుత్వమని, తమ నాయకుడు జగనన్న మహిళా పక్షపాతి అని తెలిపారు. మహిళలంతా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని, భయపడి వెనక్కి తగ్గకూడదని పిలుపునిచ్చారు. సానుకూల దృక్పథానికి తోడు కొంత శ్రమ తోడైతే ఏ మహిళ అయినా విజయం సాధిస్తుందని చెప్పారు. జగనన్న చేపట్టిన పథకాల ద్వారా ఇప్పటికే మహిళలకు ఇళ్లలో గౌరవం పెరిగిందని తెలిపారు. ఇంటి స్థలం, ఇళ్లు హక్కు పత్రాల దగ్గరి నుంచి రేషన్ కార్డుల వరకు అన్నీ మహిళల పేరుతోనే జగనన్న ఇస్తున్నారని గుర్తు చేశారు. దిశ యాప్‌లాంటి వాటి ద్వారా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ కూడా తమ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment