ప్రజల్లో మొదలైంది తిరుగుబాటే.. మార్పుకాదు.

 టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడి  విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ

అమరావతి (ప్రజా అమరావతి);

 జగన్ ది ధనబలం..రౌడీయిజం. మాది ప్రజాబలం ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ..వై.ఛీపీ అంటున్నారు. 4ఏళ్ల జగన్ పాలన విధ్వంసం.. అరాచకాల కలబోత.

• ఈఎన్నికల్లో టీడీపీగెలుపుకి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. 

• ప్రజలు తమఓట్లద్వారా టీడీపీపై వారికున్న నమ్మకం, విశ్వాసాన్ని చాటుకున్నారు.

• ఈ ఎన్నికల్లో టీడీపీకి పడిన ఓట్లవెనక ఒక నిరుద్యోగి ఆ వేదన, ఒకతల్లి తనబిడ్డల భవిష్యత్ కోసంచేసిన ఆలోచన, ఒకవిద్యావంతుడు రాష్ట్రంకోసం పడిన తపన, ఒకప్రభుత్వఉద్యోగి పైకిచెప్పుకోలేని వేదన, ఒకరైతుకష్టం, సాయం అందని బడుగుబలహీనవర్గాల బాధ, పెరిగినధరలలో బతుకు భారమైన సామాన్యుడికష్టం, అరాచక పాలనలో భయంగా బతుకుతున్న సగటుమనిషి ఆవేదన ఉన్నాయి.


• జగన్ ఎన్నికల్లో గెలుపుకోసం పార్టనర్స్ ఇన్ క్రైమ్ అనే థియరీని నమ్ముకున్నాడు. 

• ప్రజల్లో మొదలైంది తిరుగుబాటే.. మార్పుకాదు. 

• ఈ ఫలితాలతో టీడీపీనేతలు,కార్యకర్తలు మరింత పట్టుదలతో పనిచేయాలి. ప్రజల్లోకి వెళ్లి, వారికష్టసుఖాలు పంచుకుంటూ, రెట్టింపుఉత్సాహంతో పనిచేయాలి.  


“మూడుపట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఘనవిజయం సాధించిపెట్టారు. విజయంలో భాగస్వాములైన గ్రాడ్యుయేట్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలఫలితాలతో ప్రభుత్వంపై ఉన్నప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబ డింది. ఈ సందర్భంగా రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చెప్పినమాటల్ని గుర్తుచే స్తున్నాను. “నాజాతిప్రజలకు కత్తిచేతికి ఇవ్వలేదు, ఓటుహక్కుని ఆయుధంగా ఇచ్చాను, పోరాడి రాజులుఅవుతారో, అమ్ముకొని ఓడిపోయి బానిసలు అవుతారో మీచేతుల్లోనే ఉంది”  అన్న అంబేద్కర్ మహానీయుడి మాటల్ని ఎమ్మెల్సీఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ సద్వినియోగం చేశారు. మేం సాధించింది ప్రజావిజయం. ప్రజలు తమఓట్లద్వారా టీడీపీపై నమ్మకం, విశ్వా సాన్నికూడా చాటారు. ఈఎన్నికల విజయంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా పే దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

ఈఎన్నికల్లో చైతన్యంతో, బాధ్యతతో, ధైర్యంతో ఓట్లువేశారు. ఉగాది పంచాంగాన్ని రెండ్రోజుల ముందే ప్రజలు ఈ ఎన్నికలద్వారాచెప్పారు. ఈఎన్నికల్లో పడిన ఓట్లవెనుక ఒక నిరుద్యోగి ఆ వేదన, ఒకతల్లి తనబిడ్డల భవిష్యత్ కోసంచేసిన ఆలోచన, ఒకవిద్యావంతుడు రాష్ట్రంకోసం పడిన తపన, ఒకప్రభుత్వఉద్యోగి పైకిచెప్పుకోలేని వేదన, ఒకరైతుకష్టం, సాయం అందని బడుగుబలహీనవర్గాల బాధ, పెరిగినధరలలో బతుకు భారమైన సామాన్యుడికష్టం, అరాచక పాలనలో భయంగా బతుకుతున్న సగటుమనిషి ఆవేదన ఉన్నాయి. 4ఏళ్ల వైసీపీపాలన విధ్వంసమైన పాలన. చరిత్రలో మనం కొన్నిచదువుకున్నాం.. కొన్నిపండుగలు నరకాసుర వధ (దీపావళి), మహిషాసురసంహారం (విజయదశమి) వంటిఘట్టాల అనంతరం వచ్చాయి. చరిత్రలో ఎవరేంచేశారో, ఎంతగా ప్రజల్ని బాధించారో, వారుఎప్పటికీ మర్చిపోరు. ఎప్పటికైనా చెడుఓడిపోతుంది అనేది అందరిఅభిప్రాయం.

 

*జగన్ ది ధనబలం..రౌడీయిజం. అతను అక్రమాలనే నమ్మాడు. 4ఏళ్లలో అన్నిఎన్నికల్ని సెలక్షన్స్ గా మార్చాడు. వైసీపీ గాలికొచ్చినపార్టీ..గాలికే పోతుంది.* * ఇప్పుడు జరిగిన పోరాటం జగన్ వర్సెస్ 5కోట్ల ఆంధ్రులు.*

 జగన్ పనిఅయిపోయింది. మరలా ఎన్నికల్లో జగన్ గెలిచేపరిస్థితిలేదు. దానికికారణం అతను చేసిన అరాచకం, అతనుచేసిన విధ్వంసం, రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం. వాటితో పాటు చెప్పలేనంత అవినీతి, దోపిడీ. కొన్నిపార్టీలు గాలికివచ్చి, గాలికే కొట్టుకుపోతాయి. అలాంటిదే జగన్ పార్టీ. సిధ్ధాంతం ఉంటే ప్రజలకోసం ఏదోచేయాలనే బాధ్యత ఉంటుంది. జగ న్మోహన్ రెడ్డి బాధ్యతలేని వ్యక్తి, మోసాలుచేయడంలో దిట్ట. నేనేంచెప్పినా ప్రజలునమ్ముతా రు అనే ధీమా, ప్రజలుమోసపోతారు అనే విశ్వాసం ఉన్నవ్యక్తి. జగన్ ది ధనబలం..రౌడీయి జం, ఎక్కడికక్కడ మ్యానిప్లేషన్స్. అతను అక్రమాలునమ్మాడు, వాటితోనే ముందుకు పోతు న్నాడు. 4ఏళ్లలో ఎక్కడాఎన్నికలు జరగలేదు. అన్నీఎన్నికలు సెలెక్షనే. ఓటరుజాబితా నుంచి ఓటువేసేవరకు ఎన్నిఅరాచకాలు, అవకతవకలు చేయాలో, ఎన్నివిధాల భయభ్రాం తుల్నిచేయాలో, అన్నీచేశాడు. చరిత్రలో నేనుఎన్నడూ చూడనిసన్నివేశాలు ఈ నాలుగేళ్లలో  చూశాను. చాలాదారుణమై వ్యక్తినిచూశాను. ఇప్పుడు జరిగిన ఎన్నికలు, పోరాటం జగన్ / 5కోట్ల తెలుగుప్రజలు, రాష్ట్రభవిష్యత్ కు సంబంధించినవి. ఒక్కపక్క జగన్ అరాచకం, మరో పక్క రాష్ట్రభవిష్యత్. ఈనాలుగేళ్లలోరాజకీయపార్టీలు పనిచేసే పరిస్థితిలేదు. ప్రజాస్వామ్య వ్య వస్థలు పనిచేయలేదు. జగన్ థియరీ ఏమిటంటే పార్టనర్స్ ఇన్ క్రైమ్. మామూలువ్యక్తితో ఒకచిన్న తప్పుచేయించి, దాన్నుంచి అతన్నికాపాడి, అతనితో మరోపెద్దనేరంచేయించి, అత ను జైలుకెళ్లాక కుటుంబాన్ని కాపాడతారు. ఒకఊరిలో రెండువర్గాలు తయారుచేస్తారు. పెద్ద వర్గాన్ని తనవైపుకు తిప్పుకుంటారు. తరువాత మెల్లిగా ఇంకోవర్గాన్నికూడా లొంగదీసుకుం టాడు. అలా తనప్రాంతాన్ని, ప్రజల్ని నేరాల్లో భాగస్వాముల్నిచేసి, ఎన్నికల్లో గెలుస్తూ వచ్చా డు. భారతదేశచరిత్రలో ఏనాయకుడుచేయని విధంగా పారిశ్రామికవేత్తల్ని, ఐఏఎస్ లను, నమ్మినవారిని జైలుకు తీసుకెళ్లాడు. ఇదే అతని సిద్ధాంతం. అతనికి మొహమాటాలు ఉండ వు. తానొక్కడేఉండాలి..రాష్ట్రం ఏమైపోయినా, ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం. జగన్  ఒకసైకో, ఎదుటివారు బాధపడుతుంటే, వారిఏడుపుచూసి తాను ఆనంద పడతాడు.

 

*చీఫ్ సెక్రటరీ నుంచి ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్ లు అందరూ జగన్ నేరాల్లో భాగస్వాములవు తున్నారు. న్యాయస్థానాలు చీవాట్లుపెట్టినా సిగ్గురాలేదు.* *ఆంక్షలు, అరెస్టులతో ప్రతిపక్షాన్ని అడ్డుకుంటారా?* 

75సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని ఈమధ్యనేజరుపుకున్నాం. ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. వాటినిగమనిస్తే పాలకులు  చట్టాలు చేయడానికి ప్రజలు ఓట్లువేసి గెలిపిస్తారు. చట్టసభల్లో చేసే పాలసీలను అమలుచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ కు అప్పగిం చారు. అలాంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయే పరిస్థితి. రెండోది న్యాయవ్యవస్థ. న్యా యం జరగడం  ఆలస్యమైతేకావచ్చుకానీ, అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ప్రజాస్వా మ్యంలో మీడియావ్యవస్థ అత్యంత విలువైంది. రాష్ట్రంలో ప్రజజాస్వామ్య మూలస్థంభాలైన నాలుగువ్యవస్థలు పనిచేస్తున్నాయా? మాట్లాడితే సస్పెన్షన్లు, అక్రమకేసులు, అరెస్ట్ లు, వారి వ్యాపారాలుదెబ్బతీయడం, వారిఆస్తుల్ని లాక్కోవడం చేస్తున్నారు. అసెంబ్లీని, కౌన్సిల్ ని ప్రహాసనంగా మార్చారు. మండలిఛైర్మన్ గా ఉన్నవ్యక్తిని బూతులుతిట్టారు. ఇంకోపక్క కోర్టుల్ని, న్యాయమూర్తుల్ని బ్లాక్ మెయిల్ చేసేస్థితికివచ్చారు. కోర్టులే సుమోటోగా కేసులువిచారించి సీబీఐ విచారణకు ఆదేశించేపరిస్థితి వచ్చింది. అధికారుల్ని హైకోర్టు పిలిచి ఎన్నిసార్లు చీవాట్లుపెట్టిందో చూశాం. చీఫ్ సెక్రటరీ నుంచి ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్ లు కోర్టులో చేతులుకట్టుకొని నిలబడ్డారు. అందుకే అన్నాను పార్టనర్స్ ఇన్ క్రైమ్ అని.  ఒకసారి కోర్టుకు వెళ్లినప్పుడు బాధపడ్డారు, రెండోసారికి అలవాటైంది...చివరికి సిగ్గువదిలేశారు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 

ఆంక్షలన్నీఅయ్యాక జీవోనెం-1 తీసుకొచ్చారు.  ఎవరూ రాష్ట్రంలో పనిచేయకూడదు..పర్యటిం చకూడదు. ఎవరూ ప్రజలతరుపున ప్రశ్నించకూడదు... వాస్తవాలు చెప్పకూడదు..నిరసన వ్యక్తంచేయకూడదనే పరిస్థితి తీసుకొచ్చారు. పాదయాత్రచేస్తే ఆంక్షలు, రోడ్ షోలకు ఆంక్షలు, మాట్లాడటానికి ఆంక్షలు. నాజీవితంలో ఎప్పుడూచూడని విధంగా సభకు అనుమ తి ఇచ్చి, తరువాతరద్దుచేశారు. నేను7కిలోమీటర్లునడిచి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ని కాపాడుకున్నాను. ఇవన్నీ ఒకఎత్తు అయితే, నిన్నజరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకెత్తు. 


ఎన్నికల కమిషన్ ఆదేశాలనుకూడా అధికారులు లెక్కచేయరా? జగన్మోహన్ రెడ్డిని ప్లీచ్ చేయాలనే ఉద్దేశంతో అరాచకాలుచేస్తారా? డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా రాత్రంతా హైడ్రామాలు ఆడతారా? అధికారులు పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ లో భాగస్వాములుకావాలి..పార్టనర్స్ ఇన్ క్రైమ్ లోకాదు. జగన్ గెలిచింది కేవలం పులివెందుల ఓట్లతోనే.. టీడీపీఅభ్యర్థి మూడుజిల్లాలఓట్లతో గెలిచాడు.*

రాష్ట్రంలోని 108 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలుజరిగాయి. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలు తప్ప అన్నిజిల్లాల్లో జరిగాయి. ఒక్కోనియోజకవర్గంలో 5వేల నుం చి 25వేల ఓట్లువేశారు. ఎన్నికల్లో గెలవడంకోసం ఓటుకి రూ.10వేలుపంచారు. వెండి ఆభర ణాలుపంచారు. 5వ తరగతి చదివినవారిని కూడా పట్టభద్రులుగా చేర్చించారు. ఫేక్ గ్రాడ్యు యేషన్ సర్టిఫికెట్స్ తయారుచేయించి, వారికి ఓటుహక్కుకల్పించి, వారితో ఓటు వేయించా రు. టీడీపీప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఈవ్యవహారంపై రాష్ట్రఎన్నికల కమి షనర్ కు అనేకమార్లు ఫిర్యాదుచేశాం. స్థానికసంస్థలఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అన్నీ కేంద్రఎన్నికలసంఘమే నిర్వహిస్తుంది. దాన్నికూడా ప్రక్షాళనచేయాలని సుప్రీంకోర్టు ఇటీవ లే తీర్పుఇచ్చింది. దేశప్రధాని, సుప్రీంకోర్టు సీజేఐ, ప్రతిపక్షనేత కలిసి ఎన్నికల ప్రధానాధికారి ని ఎంపికచేయాలని తీర్పుఇచ్చారు. ఎన్నికలనిర్వహణకోసం దేశస్థాయిలో ఇంతకసరత్తు జరుగుతుంటే, రాష్ట్రంలో టీడీపీ ఎన్నికలు నిర్వహించడానికే పోరాడాల్సిన పరిస్థితివచ్చింది. పశ్చిమరాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 3రోజులు జరిగింది.  ఫలితం వారికి అనుకూలంగా లేదని పులివెందులనుంచి మనుషుల్ని పంపారు. ఒకరు అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రంలోని వెళతాడు. అతన్నిఅడ్డుకోరు. అక్కడిఎస్పీ ప్రభుత్వసేవలో తరించారు. .ఇలా అన్నిఅడ్డంకులు అధిగమించి టీడీపీఅభ్యర్థిఎన్నికల్లో గెలిస్తే, అతనికి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వరా? ఎన్నికల కమిషన్ ఆదేశాలకుకూడా అడ్డంపడే శక్తి జగన్ కు ఉందా? ఎన్నికల వి ధుల్లో పాల్గొన్న అధికారులు ఫలితాలు ప్రకటించాక, గెలుపుని ధృవీకరించాక, ఎవరైనా ఇలా చేస్తారా? ఎన్నికల్లో గెలిచిన రామ్ గోపాల్ రెడ్డిని ఈడ్చుకెళ్లి, పశువుకంటే హీనంగా అరెస్ట్ చేస్తారా?  ఎప్పుడురీకౌంటింగ్ అడగాలో కూడా వీళ్లకుతెలియదు. ఓడిపోయానని ఇంటి కెళ్లిన అభ్యర్థిని వెనక్కుపిలిపించి రీకౌంటింగ్ అడిగిస్తారు. రీకౌంటింగ్ కు అవకాశం లేనిచోట రీకౌంటింగ్ అడిగి, స్థానికఎస్పీ, కలెక్టర్లపై ఒత్తిడిపెట్టి, ఎన్నికలకమిషన్ ఆదేశాలనుకూడా తుంగలో తొక్కుతారు. అధికారులుకూడా జగన్ రెడ్డి ఆదేశాలే పాటిస్తారు. ఎవరు ఆకలెక్టర్.. ఎస్పీలు. ప్రజలుఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత వారికిలేదా? ఎన్నిక అయ్యి ఫలా నా అభ్యర్థి గెలిచాడని ప్రకటించాక తిరిగి, ఆఎన్నికను సమీక్షించే అధికారం ఆర్వోకు లేదు. డిక్లరేషన్ ఇవ్వడంతప్ప. డిక్లరేషన్ ఇవ్వకుండా, రాత్రంతా హైడ్రామాలు ఆడి, జగన్మోహన్ రెడ్డిని ప్లీచ్ చేయాలనే ఉద్దేశంతో అరాచకాలుచేస్తారా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేస్తారా? ఎన్నికలకమిషన్ ఆదేశాలను నిర్వీర్యంచేస్తారా? అధికారులంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామ ని గుర్తుంచుకోండి. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తుందని నిన్నటిఎన్నికల ఫలితాలే సూచన. అధికారయంత్రాంగం పార్టనర్స్ ఇన్ ప్రోగెస్ లో భాగస్వాములు కావాలి...పార్టనర్స్ ఇన్ క్రైమ్ లో కాదు. క్రైమ్ లో భాగస్వాములై, నేరాల్లో, నేరస్తులతో జతకట్టవద్దని హెచ్చరిస్తు న్నా. ఇంకాసంవత్సరం కూడా లేదు.. అతన్నినమ్మితే మీకూ అతనిగతే పడుతుంది. అతని చరిత్ర ఏమిటో, ఎలా మొదలైందో గమనించండి. జైలుకువెళ్లడం.. తరువాత కుటుంబాలు బాధపడటం, ప్రజల్లోచులకనకావడం ఎవరికీమంచిదికాదు. నేను అధికారంలోలేకపోతే, తెలు గుదేశం వస్తే మీపైనే పడుతుందని జగన్ అధికారుల్ని భయపెట్టిపనిచేయిస్తున్నాడు. అధికారులు అందరూ ఒకలాకాదు. కొందరి పనితీరునే తప్పుపడుతున్నాం. 

                                                                                                                                                                                                        ప్రజల్లో ఇప్పుడు మొదలైంది తిరుగుబాటే.. మార్పుకాదు.* *అధికారపార్టీ బెదిరింపులు, ప్రలోభాలు వేటినీ ప్రజలుఖాతరుచేయలేదు. మునిగిపోయేనావను నమ్ముకున్న అధికారు లుకూడా మునిగిపోతారు.

మనంచేస్తున్న పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేపోరాటమని, 5కోట్ల మంది భవిష్యత్ కు సంబంధించిన పోరాటమని, ప్రజలుభాగస్వాములైతేతప్ప తెలుగుదేశం సాధించలేదని నేను గతంలోనేచెప్పాను. అందుకే ఈఎన్నికల్లో ప్రజలు తిరగబడ్డారు. మంత్రులు, అధికారు లు బెదిరించారు..కానీ బెదరలేదు. బయటకు తిరుగుబాటు రాకపోయినా, ఈ ప్రభుత్వంపై , ముఖ్యమంత్రిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మార్పుకాదు..తిరుగుబాటే. ఒకవ్యక్తిని బాధపెడితే, వేధిస్తే, అతనిఆవేశంనుంచి వచ్చేది తిరుగుబాటు. అధికారులుకూడా తిరుగుబా టుకు సిద్ధంకావాల్సిన సమయంవచ్చింది. మునిగిపోయే నావను నమ్ముకుంటే వారుకూడా మునిగిపోతారు. మూడుఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వదుర్మార్గాలను ఎదుర్కోవడానికి చాలా చాలా చూశాను. పశ్చిమరాయలసీమ ఎమ్మెల్సీఅభ్యర్థిగా రామ్ గోపాల్ రెడ్డి గెలిస్తే, దాన్నిజగన్  అంగీకరించడా? జగన్ పులివెందులలో మాత్రమే గెలిచాడు..కానీ ఆయన్ని మూడు జిల్లాలప్రజలు గెలిపించారు. అలాంటివ్యక్తిని కుక్కకంటే హీనంగా లాక్కెళతారా? అం త అహంకారమా? ఆ అహంకారమే మీపతనానికి నాంది అని గుర్తుంచుకోండి. వైసీపీఎమ్మె ల్యేలు, మంత్రులు, జగన్ తో కలిసి రాష్ట్రనాశనంలో భాగస్వాములుకావద్దని హెచ్చరిస్తున్నా. 

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు మనపై మరింత బాధ్యతమోపింది. ప్రజలనమ్మకాన్ని నిజంచే యాలంటే మనంఇంకా మెరుగ్గా ప్రజల్లోకివెళ్లి, వారికిధైర్యంచెప్పాలి. ప్రతికార్యకర్త, నాయకుడు ఇంకా..ఇంకా కష్టపడాలి. ప్రజలవిశ్వాసం చూరగొనాలి. టీడీపీకార్యకర్తల 4ఏళ్లపోరాటపటిమ, నాయకుల కృషిని మనస్ఫూర్తగా అభినందిస్తున్నాను. 


విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా..చంద్రబాబుగారి స్పందన.  ప్రజలుకర్రుకాల్చి వాతపెట్టినా పద్ధతి మార్చుకోము అంటే అది మూర్ఖత్వం..అజ్ఞానమే అవుతుంది.


ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వై..ఛీ.పో అంటున్నారు. ఇంకాఇంకా అంటారు. నా జీవితం లో నేనెప్పడూ వల్గారిటికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రజలువాళ్లను ఛీకొట్టినా వారికి సిగ్గురాలే దు. 108 నియోజకవర్గాల్లో 10లక్షలకుపైగాఓటర్లు ఛీకొట్టినా, 70శాతం పోలింగ్ నమోదైనా, ఓటర్లని అవమానించేలా బుద్ధి, జ్ఞానంలేకుండా సజ్జల మాట్లాడాడు. ఒకసెక్షనే ఓట్లువేశారు.. వాళ్లకు ఏమీచేయలేదని అయినా ఒప్పుకున్నారు. మీరుచేశామంటున్న సెక్షన్ జనంకూడా ఫ్యాన్ పని అయిపోయిందనే అంటున్నారు. జంగారెడ్డిగూడెంలో పిల్లలు ఫ్యాన్లు పీకేసి స్క్రాప్ కిపడేస్తే, వారినికొట్టి, పోలీసులు ఖైదీలతో కలిపి సెల్లోవేస్తారా? ఫ్యాన్ సరిగా పనిచేయడం లేదని చెప్పడమే పిల్లలుచేసిన నేరమా? తల్లిదండ్రులే పిల్లల్నికొట్టకూడదు.. కానీ పోలీసుల కు ఆ అధికారం ఎవడిచ్చాడు? పిల్లలతో బాత్రూమ్ లు కడిగించే ప్రయత్నంచేస్తారా? చిన్నపి ల్లల్ని కూడా భయభ్రాంతులకుగురిచేస్తారా? చిన్నపిల్లలపైనా జగన్ రెడ్డి ప్రతాపం? పిల్లల్ని వేధించిన హెడ్మాస్టర్, పోలీసుల్ని ఉద్యోగాలనుంచి డిస్మి స్ చేయాలి. జరిగిన ఘటనపై ఛైల్డ్ ప్రొటెక్షన్ సెల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించి గట్టిచర్యలు తీసుకోవాలని కోరు తున్నాం. 

 ఇంకా సమర్థించుకుంటూ పైశాచిక ఆనందం పొందితే ఏంచేయలేం. ఇప్పటికైనా బుద్ధితెచ్చు కొని పద్ధతిమార్చుకుంటే మంచిది. పేపర్లో రాస్తే జైల్లోపెడతారా? జగన్ కు సంస్కారంలేదు. గౌరవంగా బతికేవారినికూడా రోడ్డుకీడ్చాడు. మీడియా, మేథావులు, ప్రజలు, ప్రజాసంఘాలు అందరూ ఆయనకు ఊడిగంచేయాలా? ప్రజలకు విశ్వాసంగా ఉన్న ఏవ్యవస్థ అయినా నిలదొ క్కుకుంటుంది. ఏ పేపర్ కు ఎన్ని అడ్వర్టైజ్ మెంట్లు వచ్చాయో, ఏపేపర్ కి దోచిపెట్టారో అన్నీ తేలుస్తాం.  ఈ ఎన్నికలు సెమీఫైనల్స్, విశాఖపట్నం రాజధానికి  రిఫరెండం అనిచెప్పారు. ఎన్నిచెప్పినా నమ్మలేదు కాబట్టే ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు. యువగళం యాత్ర చేస్తున్న లోకేశ్ తాను ఎక్కడికీ వెళ్లనన్నా అక్కడ ఉండకూడదని చెప్పి బలవంతంగా పంపిం చారు. 9జిల్లాల్లో ఎక్కడా ఉండకూడదని పోలీసులు నానాయాగీచేశారు. వై.వీ.సుబ్బారెడ్డి విశాఖపట్నం ఎందుకెళ్లాడు? గుడ్డిప్రభుత్వం..గుడ్డిఎస్పీకి అతనుకనిపించలేదా? అతను బూ త్ లలో తిరిగి ప్రచారంచేస్తుంటే ఏంచేశారు? రాజధాని విషయం సుప్రీంకోర్టులో ఉంటే, రేపు విశాఖవెళ్తాం..ఎల్లుండి వెళ్తామని చెబుతారా? అదికోర్టు ధిక్కరణకాదా?  ప్రజలు అందరికంటే తెలివైనవారు.. అన్నివిషయాల్లో చైతన్యవంతులు. సరైనసమయంలో సరైన నిర్ణయం తీసు కొని వైసీపీవాళ్లను ఎక్కడపెట్టాలో అక్కడపెడతారు. ఉపాధ్యాయుల్ని ఈ ప్రభుత్వంపెట్టినంత బాధ ఎవరూపెట్టలేదు. ఉపాధ్యాయుల్ని మాప్రభుత్వం చాలాగౌరవప్రదంగా చూసింది. ఈ ప్ర భుత్వం ఉపాధ్యాయుల్ని ఎంతగా వేధించాలో అంతాచేసింది. అయినాకూడా ఉపాధ్యాయఎ మ్మెల్సీఎన్నికల్లో వైసీపీనే గెలిపించారు. డబ్బులప్రభావం పనిచేసిందా..లేక బెదిరింపులు పనిచేశాయా..ప్రలోభాలకు లోనయ్యారా అనేది ఆలోచించాలి. ఇలాంటి ప్రమాదకరమైన ప్రభు త్వాన్ని ఉపేక్షిస్తే, అది అందరికీ ప్రమాదమే అని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఉపా ధ్యాయులకు 1వతేదీన జీతాలారావడంలేదు. కరోనాసమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు నా  నాఅవస్థలుపడ్డారు. మేం పీ.డీ.ఎఫ్. ఇతరరాజకీయపార్టీలతో మాట్లాడి, ఒక అవగాహన చే సుకున్నాక, రెండోప్రాధాన్యత ఓటులో పరస్పరం సహకరించుకున్నాం. సీ.పీ.ఎం..సీ.పీ.ఐల ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.”       


*విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావులకేశవ్, టీడీపీఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, మాజీమంత్రి కన్నాలక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.*

Comments