టీడీపీ అధికారంలోకి వస్తేనే సర్పంచ్ లకు పూర్వ వైభవం. _శ్రీ నారా చంద్రబాబు నాయుడు .

 

విజయవాడ (ప్రజా అమరావతి);


 వైసిపి పాలనలో ఆ పార్టీకి చెందిన సర్పంచే చెప్పుతో కొట్టుకోవడం జగన్ చేతకాని పాలనకు నిదర్శనం.టీడీపీ అధికారంలోకి వస్తేనే సర్పంచ్ లకు పూర్వ వైభవం.

_శ్రీ నారా చంద్రబాబు నాయుడు .




 కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవడం దారుణం - ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధం  - ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్.


 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్  మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల ఆధ్వర్యంలో జరిగిన  పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన తెదేపా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు .


 ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల నిధులు, విధులు లాక్కుని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు  ద్వజమెత్తారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...... ఈ వైయస్సార్ ప్రభుత్వంలో  సర్పంచులకు , ఎంపీటీసీలకు  గౌరవం లేదని , చేసిన పనులకు బిల్లులు లేవు. వైసీపీ పాలన అంతమవ్వాలని వైసీపీ సర్పంచులే అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ సర్పంచి జగన్ ని గెలిపించి పెద్ద తప్పు చేశామని బహిరంగంగా మీడియా ముందు చెప్పుతో కోట్టుకున్నాడు. సర్పంచ్ లు తమ హక్కుల కోసం పోరాడాలి, లేదంటే ఆ పదవికి అన్యాయం చేసినవారవుతారు. టీడీపీ అధికారంలోకి వస్తే సర్పంచ్ లకు పూర్వ వైభవం తీసుకొస్తాం, నిధులు, విధులు ఇచ్చి మీ హక్కులు కాపాడుతాం. టీడీపీ హయాంలో  పంచాయితీరాజ్ కి నరేగా నిధులు అనుసంధానం చేసి గ్రామాల్లో పంట కుంటలు తవ్వి భూగర్బజలాలు పెంచాం. ఈ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్ధను ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలను చైతన్యం చేయాలి. సర్పంచ్ లకు అన్ని విధాల అండగా ఉంటాం, టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని పనులు చేయిస్తాం, పెండింగ్ బిల్లులు, నిధులు విడుదల చేస్తాం. వైసీపీ సర్పంచుల్ని కలుపుకుని ఛలో అమరావతి, ఛలో డిల్లీ, కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించండి.  జగన్ రెడ్డి పంచాయితీ వ్యవస్ధను దుర్వినియోగం తీరు ప్రజలకు వివరించవలసిన బాధ్యత మీపై ఉందని, వైసీపీ సర్పంచుల్లోనే కాదు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా జగన్ పట్ల తిరుగుబాటు ప్రారంభమైందని, సర్పంచులందరూ ఏకతాటిపై నిలబడి పోరాడవలసిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు  అన్నారు.


 వై.వి.బి. రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ   రాష్ట్రంలోని 12918 గ్రామపంచాయతీల  సర్పంచులు ఎవ్వరు పంచాయతీల కరెంట్ బిల్లులు కట్టవద్దని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా పంచాయతీలకి పంపించిన రూ,,8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి తన సొంత అవసరాలకు వాడివేసుకుందని, అదేమంటే ఆ డబ్బులు కరెంటు బకాయిల కింద జమ చేసుకున్నామని చెబుతూనే, మరలా కరెంట్ బిల్లులు కట్టమని సర్పంచ్ల పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, అయినా అసలు గత ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు ఉచిత విద్యుత్ని ఇచ్చారని, ఈ ప్రభుత్వం దానిని విస్మరిస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ పంచాయతీలకు కేంద్రం పంపిన నిధులు అన్నీ కూడా దారి మళ్లించి వేసిందని, ఆ నిధులను వెంటనే మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుంటే  రాష్ట్రంలోని సర్పంచులు అందరినీ కలుపుకొని రాజకీయాలకతీతంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజేంద్రప్రసాద్.


లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మా సర్పంచులను  పూర్తిగా నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు లాగా మార్చి వేసిందని, ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి మా డిమాండ్లను పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు.


 ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ముఖ్య నాయకులు, రాష్ట్ర సర్పంచుల సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Comments