మన బడి నాడు నేడు రెండో విడత కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి జూన్, 12వ తేదీ నాటికి పూర్తీ చేయాలి.


 నెల్లూరు (ప్రజా అమరావతి);


జిల్లాలో  మన బడి నాడు నేడు రెండో విడత  కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి  జూన్, 12వ తేదీ నాటికి పూర్తీ చేయాల



ని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, ఎంపీడీవోలను, ఎంఈఓలను, ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  


సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని  తన ఛాంబర్  నుండి జిల్లా కలెక్టర్  యం. హరి నారాయణన్,   వీడియో కాన్ఫరెన్స్  ద్వారా  జిల్లా విద్యా శాఖాధికారులు,   ఎంపీడీవోలు, ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై  నాడు నేడు రెండో విడత పనుల పురోగతిపై  మండలాల వారీగా సమీక్షించారు. 


ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ,  జిల్లాలో నాడు నేడు రెండో విడత కింద చేపట్టిన  అభివృద్ధి పనులను   వేగవంతం చేసి ఈ  విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి  పూర్తి చేయాలని స్పష్టం చేసారు.  జిల్లాలో చేపడుతున్న రెండో విడత నాడు నేడు   పనుల పురోగతిపై  క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మైక్రో లెవెల్ లో  రోజువారీగా చేపట్టాల్సిన పనులపై   పాఠశాలల వారిగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకొని,  ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పనులు  త్వరితగతిన పూర్తి  అయ్యేలా  చర్యలు చేపట్టాలన్నారు.   ఎం.పి.డి.ఓ లు, ఎం.ఈ.ఓలు,  ఇంజనీరింగ్ అధికారులు  పనుల పురోగతిపై  రోజువారీగా  సమీక్షించుకొని   విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తీ అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని  స్పష్టం చేసారు. టాయిలెట్లు,  కిచెన్ షెడ్స్, మేజర్, మైనర్ రిపేర్లు,  విద్యుదీకరణ,  డ్రింకింగ్  వాటర్,  ఫర్నిచర్ తదితర  అభివృద్ధి పనులను నిర్ధేశించిన  గడువులోగా పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ప్రతిరోజు పని జరుగుతున్న పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ  పనులకు సరిపడ ఇసుక, కంకర, సిమెంట్, స్టీల్ ను అందుబాటులో వుంచుకోవడంతో పాటు అవసరమైన   మేస్త్రీలు, కూలీలను  ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకుని పనులను వేగవంతం చేయాలని జిల్ల కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  


కలెక్టరేట్లోని ఎస్.ఆర్  శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హల్    నుండి జిల్లా విద్య శాఖాధికారి  గంగా భవాని, సమగ్ర శిక్ష పిఓ  ఉషారాణి, ఐటిడిఏ  పిఓ మందా రాణి,  పంచాయతీ రాజ్,  ఆర్డబ్ల్యూఎస్. ఎస్ఈ లు  అశోక్ కుమార్,  రంగ వర ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు. 


Comments