ఏసిబి యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులు

 

డిజిపి కార్యాలయం, 

మంగళగిరి (ప్రజా అమరావతి);


 డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి  ఆదేశాల మేరకు ఏసిబి 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల
తో రెవెన్యూ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, మరియు పంచాయతీ రాజ్ కు చెందిన ఐదు గురు అధికార్లను 4 కేసుల్లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఇంచార్జీ అవినీతి నిరోధక శాఖ DG శ్రీ శంఖబ్రత భాగ్చి పర్యవేక్షిస్తున్నారు.*


*Case:1*


విశాఖపట్నం జిల్లా, బుచ్చిరాజు పాలెంకు చెందిన బాధితుడు శ్రీ కే. విశ్వేశ్వరరావు యొక్క నిషేధిత ఆస్తుల నుండి ఆస్తిని తొలగించడం కోసం అధికారిక సహాయం చేసేందుకుగాను 30,000/- రూపాయలను లంచంగా ఇస్తేనే నిషేధిత ఆస్తుల నుండి ఆస్తిని తొలగిస్తానని విశాఖపట్నం జిల్లా, *విశాఖపట్నం రూరల్ ఆఫీసు వి‌ఆర్‌ఓ శ్రీ జామి రాము* భాదితుడిని డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు ఈ రోజు బాధితుడి వద్ద నుండి వి‌ఆర్‌ఓ *శ్రీ జామి రాము 10,000  రూపాయలను లంచంగా* తీసుకుంటుండగా విశాఖపట్నం అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


*Case:2*


కృష్ణా జిల్లా, మోపిదేవి, పెదకల్లెపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు పి. లావణ్య ను అంగన్వాడీ ఆయగా నియమించినందుకు గాను, ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు రాయకుండ వుండుటకు మరియు విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ధృవీకరించడానికి గాను 10,000/- రూపాయలను లంచంగా ఇస్తేనే అవన్నియు చేస్తానని *కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం ICDS సూపర్వైజర్ గ్రేడ్-II  శ్రీమతి డొక్కు వెంకట పద్మావతి* బాధితురాలును డిమాండ్ చేయడంతో బాధితురాలు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు ఈ రోజు భాదితురాలు వద్ద నుండి ICDS సూపర్వైజర్ గ్రేడ్-II  శ్రీమతి డొక్కు వెంకట పద్మావతి 10,000  రూపాయలను లంచం గా తీసుకుంటుండగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


Case:3


SPSR నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలం, గుడ్లూరు గ్రామానికి చెందిన భాదితుడు  శ్రీ మాధవరెడ్డి కట్టించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వై‌ఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ ల బిల్లులను ప్రాసెస్ చేసేందుకుగాను 27,000/- రూపాయలను లంచంగా ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని *SPS నెల్లూరు జిల్లా, కావలి పంచాయతీ రాజ్ జూనియర్ అకౌంటెంట్ శ్రీ చిలకపాటి మనోజ్ కుమార్* భాదితుడిని డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆశ్రయించాడు. దీనిపై కేసు కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు ఈ రోజు బాధితుడి వద్ద నుండి పంచాయతీ రాజ్ జూనియర్ అకౌంటెంట్ శ్రీ చిలకపాటి మనోజ్ కుమార్ 27,000  రూపాయలను లంచంగా తీసుకుంటుండగా నెల్లూరు అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


Case:4


తిరుపతి జిల్లా, తడ మండలం, కడలూరు గ్రామానికి చెందిన బాధితుడు శ్రీ తొగూరు ప్రవీణ్ కుమార్ తన ఇంటి నిర్మాణం కోసం 20 చెట్లు నరికి తీసుకెళ్ళటానికి 10,000/- రూపాయలను లంచంగా ఇస్తేనే చెట్లు నరికి తీసుకెళ్ళటకు అనుకూల నివేదిక తహశీల్దార్‌కు సమర్పించడానికి తిరుపతి జిల్లా, తడ మండలం రి-సర్వే డిప్యూటీ తహశీల్దార్ శ్రీమతి నెల్లిపూరి అనిత భాదితుడిని డిమాండ్ చేయడంతో భాదితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆశ్రయించాడు. దీనిపై కేసు కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు ఈ రోజు భాదితుడి వద్ద నుండి *రి-సర్వే డిప్యూటీ తహశీల్దార్ శ్రీమతి నెల్లిపూరి అనిత, విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్ శ్రీ A. శంకర్ 10,000  రూపాయలను లంచంగా* తీసుకుంటుండగా తిరుపతి అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


మరి కాసేపటిలో నిందిత ఆధికార్లను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు. గౌరవ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి  గారి ఆదేశాల మేరకు ఇంచార్జీ అవినీతి నిరోధక శాఖ DG  శంఖబ్రత భాగ్చి పర్యవేక్షిస్తున్నారు.

Comments