వరుసగా ఐదో ఏడాది...వైఎస్సార్‌ మత్స్య కార భరోసా.


అమరావతి (ప్రజా అమరావతి);


*మంచి జరిగిస్తూ.. సరైన సమయానికే ఆ మంచి జరిగిస్తూ.. లంచాలకు, వివక్షకు తావు లేకుండా... అర్హులైన అందరికీ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా సాయం..*


*వరుసగా ఐదో ఏడాది...వైఎస్సార్‌ మత్స్య కార భరోసా*


*రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15– జూన్‌ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం...*


*దీనితో పాటు ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌ లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ. 108 కోట్లతో కలిపి...మొత్తం రూ. 231 కోట్లను నేడు (16.05.2023) బాపట్ల జిల్లా నిజాంపట్నంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*నేడు అందిస్తున్న సాయంతో కలిపి శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి. వచ్చిననాటి నుండి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం క్రింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ. 538 కోట్లు, ఏటా రూ. 10 వేల చొప్పున ఈ ఒక్క పథకం ద్వారానే ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 50 వేల లబ్ధి*.సముద్రంపై వేటకు వెళ్లే మత్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం. చుట్టిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. మత్య్య ఎగుమతులకు మరింత ఊతమిస్తూ ఈ 4 ఏళ్ళలోనే సుమారు రూ. 16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం.. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు....


అర్హత, నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేసేందుకు తద్వారా మన వాళ్ళకు మెరుగైన ఫిషింగ్‌ చేసుకునే పరిజ్ఞానం పెరిగేలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీష్‌ విశ్వవిద్యాలయం, ఆర్బీకేలలో ఫిషరీస్‌ అసిస్టెంట్స్‌ నియామకం.. మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్‌ ఫుట్స్‌ కూడా ఆర్‌ బీకేల ద్వారా సరఫరా... మత్స్య సాగుబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు విస్తరణ సేవలు, పంట సలహాలు..


ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50 లకే సబ్సిడి పై విద్యుత్‌ సరఫరా. ఆక్వా కల్చర్‌ వ్యాపార కార్యకలాపాల పర్వవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కలర్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ 2020. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్‌ ్ట2020 అమలు... ఇన్‌ పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందించడానికి తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటు


*వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించిన భృతి*


*గత ప్రభుత్వం*


2014–15 సంవత్సరంలో లబ్ధిదారులు 12,178, లబ్ధి (రూ. కోట్లలో) 2.43

2015–16 సంవత్సరంలో లబ్ధిదారులు 66,941, లబ్ధి (రూ. కోట్లలో) 13.39

2016–17 సంవత్సరంలో లబ్ధిదారులు 68,957, లబ్ధి (రూ. కోట్లలో) 27.59

2017–18 సంవత్సరంలో లబ్ధిదారులు 73,017, లబ్ధి (రూ. కోట్లలో) 29.21

2018–19 సంవత్సరంలో లబ్ధిదారులు 80,000, లబ్ధి (రూ. కోట్లలో) 32.00

మొత్తం రూ. 104.62 కోట్లు


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో*


2019–20 సంవత్సరంలో లబ్ధిదారులు 1.02,478, లబ్ధి (రూ. కోట్లలో) 102.48

2020–21 సంవత్సరంలో లబ్ధిదారులు 1,09,231, లబ్ధి (రూ. కోట్లలో) 109.23

2021–22 సంవత్సరంలో లబ్ధిదారులు 97,619, లబ్ధి (రూ. కోట్లలో) 97.62

2022–23 సంవత్సరంలో లబ్ధిదారులు 1,05,161, లబ్ధి (రూ. కోట్లలో) 105.16

2023–24 సంవత్సరంలో లబ్ధిదారులు 1,23,519, లబ్ధి (రూ. కోట్లలో) 123.52

మొత్తం రూ. 538.01 కోట్లు


జూన్‌ 2019 నుండి నేటి వరకు మత్స్యకారుల సంక్షేమం కోసం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన లబ్ధి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,43,649 లబ్ధి రూ. కోట్లలో 3,835.89.


*గత ప్రభుత్వం*


వేట నిషేధ భృతి మొదటి రెండేళ్ళలో ఇచ్చింది కేవలం రూ. 2 వేలు మాత్రమే... ఆ తర్వాత ఇచ్చింది కూడా కేవలం రూ. 4 వేలే.. మర, యాంత్రిక పడవలకే పరిమితం


అదీ కొందరికే లబ్ధి. సగటున 50వేల మందికి కూడా ఇవ్వని దుస్థితి. ఏటా సగటువ ఇచ్చింది కేవలం రూ. 21 కోట్లు మాత్రమే, అది కూడా పెండింగులు పెట్టి..


డీజిల్‌ సబ్సిడీ లీటర్‌ కు కేవలం రూ. 6 మాత్రమే.. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు... అరకొరగా పారదర్శకత లేకుండా.. కేవలం 1,100 బోట్లకు మాత్రమే పరిమితం...ఏటా సగటున చేసిన ఖర్చు కేవలం రూ. 12 కోట్లు మాత్రమే..


ఆక్వా రైతులకు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు యూనిట్‌ విద్యుత్‌ రూ.3.80 పైసలు.. ఎన్నికల నేపథ్యంలో సబ్సిడీపై రూ. 2లకే యూనిట్‌ విద్యుత్‌ ఇస్తామని చెప్పి రూ. 309 కోట్లు ఎగ్గొట్టిన దుస్థితి...


వేట చేస్తూ మరణించిన మత్య్సకార కుటుంబాలకు ఇస్తామన్న ఎక్స్‌ గ్రేషియా కేవలం రూ. 5 లక్షలు, అందించింది అరకొరగా పెండింగ్‌లతో అదీ కొందరికే


వలసలు నివారించేందుకు చర్యలు శూన్యం. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో జైళ్ళలో చిక్కుకుని నానా అగచాట్లు.. పట్టించుకోకుండా వారి మానాన వారిని వదిలేసిన వైనం


దేశీయ వినియోగం పెంచి మత్స్యకారులను ఆదుకోవాలనే ఆలోచనే లేదు..


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో...*


అధికారంలోకి వచ్చిన నాటి నుండి వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి రూ. 10,000 లకు అంటే రెండున్నర రెట్లు పెంపు మర, యాంత్రిక పడవలతో పాటు సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలను కూడా చేర్చి చెల్లిస్తోంది...అర్హులైన అందరికీ లబ్ధి.. ఏటా సగటున ఇస్తున్నది రూ. 110 కోట్లు.. గతంతో పోలిస్తే దాదాపు 6 రెట్లు అధికం. చెప్పిన మాట ప్రకారం సరైన సమయానికి, వేట విషధ కాలంలోనే భృతి చెల్లింపుడీజీల్‌ సబ్సిడి లీటర్‌ కు రూ.3కు పెంచడమే గాక మత్స్యకారులకు స్మార్ట్‌ కార్డులు ఇచ్చి, పారదర్శకంగా ఆయిల్‌ పోయించుకునేటప్పుడే సబ్సిడీ తగ్గించి వారికి ఇచ్చేలా ఏర్పాటు... దాదాపు 20 వేల బోట్లకు ప్రయోజనం చేకూరుస్తూ ఏటా సగటును ఇచ్చింది రూ. 25 కోట్లు.. అంటే రెండు రెట్లు అధికం


ఇచ్చిన మాట ప్రకారం ఆక్వా రైతులకు సబ్సిడీపై యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ. 1.50కే ఇస్తూ గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు రూ. 309 కోట్లతో కలిపి ఇప్పటికే రూ. 2,792.88 కోట్ల విద్యుత్‌ సబ్సిడి చెల్లింపు


వేట చేస్తూ మరణించిన మత్యకారుల కుటుంబాలకు అండగా ఉండాలని ఎక్స్‌ గ్రేషియా రెండు రెట్లు పెంచి రూ. 10 లక్షలు ఇస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ప్రభుత్వం. పారదర్శకంగా, ఆర్హులందరికి..


వలసల నివారణపై ప్రత్యేక దృష్టితో కొత్తగా 10 ఫిషింగ్‌ హార్డర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, 4 పోర్టుల నిర్మాణం.. 2018లో పాకిస్తాన్‌ భద్రతా దళాలకు పట్టుబడి 13 నెలలు కరాచీ జైలులో గడిపిన 23 మంది మత్యకారులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, విదేశాంగ శాఖతో పలుమార్లు మంతనాలు జరిపి వారిని పాకిస్థాన్‌ చెర నుండి విడుదల చేయించడంలో సఫలీకృతమైన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం...


ఫిష్‌ ఆంధ్ర బ్రాండ్‌ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకొచ్చి దేశీయ వినియోగం పెంచడంతోపాటు ఆక్వా రైతులకు, మత్స్యకారులకు మెరుగైన రేట్లు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్‌ దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు.. ఇప్పటికే 2,184 రిటైల్‌ దుకాణాల ఏర్పాటు..మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా వెబ్‌ అప్లికేషన్‌ ఈ– మత్స్యకార్‌ ప్రారంభం, సహాయం కొరకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 155251.

Comments