ప్రభుత్వంపై నమ్మకం మరింత మెరుగుపడాలి.

 *ప్రభుత్వంపై నమ్మకం మరింత మెరుగుపడాలి*


*: జగనన్నను చెబుదాం కార్యక్రమం కింద ప్రతి ఒక్క గ్రీవెన్స్ ని సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలి*


*: క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి*


*: సచివాలయాలను విధిగా తనిఖీలు నిర్వహించాలి*


*: అధికారులంతా సమష్టిగా పనిచేయాలి*


*: 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను జిల్లా, డివిజన్, మండల కేంద్రాలు, అన్ని ప్రాంతాల్లో ప్రజలకు కనిపించేలా, తెలిసేలా ప్రచారం చేయాలి*


*: జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు, ఐఏఎస్ (ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్)*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 10 (ప్రజా అమరావతి):


జగనన్నను చెబుదాం కార్యక్రమం కింద ప్రభుత్వంపై నమ్మకం మరింత మెరుగుపడేలా ప్రతి ఒక్క గ్రీవెన్స్ ని సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు, ఐఏఎస్ (ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్) ఆదేశించారు.


బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో స్పందనపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డితో కలిసి జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు, ఐఏఎస్ (ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్) సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయి ఫిర్యాదులకు మరింత మెరుగైన, సంతృప్తికర పరిష్కారం లభించేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రవేశ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎంవో కార్యాలయం మానిటర్ చేస్తోందని, ఈ కార్యక్రమానికి సంబంధించి స్పెషల్ అధికారులుగా ఒక్కో జిల్లాకు ఒక్కో అధికారిని నియమించడం జరిగిందన్నారు. నెలకు కనీసం రెండుసార్లు జిల్లాను విజిట్ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ఎలా అమలవుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, అధికారులందరికీ ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాన్ని అందించడం, ప్రభుత్వానికి, అధికారులకు మధ్య సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమం అమలుకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే తెలియజేయాలని వాటి పరిష్కారానికి సమిష్టిగా పని చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదు నమోదయిన తర్వాత అర్జీదారునికి న్యాయం చేయాలి అనేది మన లక్ష్యం కావాలన్నారు. మా సమస్య విన్నారు, పూర్తిగా పరిశీలించారు, చివరికి పరిష్కరించబడిందని అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేయాలన్నారు. సచివాలయాల్లో 250 సర్వీసులకు పైగా అందిస్తున్నారని, ప్రజలకు సర్వీసులపై అవగాహన వచ్చిందని, సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే వెంటనే పరిష్కరిస్తారు, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు అని ప్రజలకు నమ్మకం ఉందని, దీన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కిందస్థాయి అధికారులు, సిబ్బంది ఎఫెక్టివ్ గా పని చేయడం, జవాబుదారీతనం ప్రతి స్టేజ్ లోను ఉండడం, ఎక్కడ ఆలస్యం లేకుండా గ్రీవెన్స్ పరిష్కరిస్తూ రీఓపెన్ రాకుండా చూసుకోవడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. మళ్లీ రీఓపెన్ కావడం, మళ్ళీ పెండెన్సీ లేకుండా ఫిర్యాదులు పరిష్కరించే పరిస్థితి రావాలని, హెచ్ఓడి స్థాయిలోనే గడువులోపు సమస్య పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ పరిష్కారంలో అదనంగా ఫైనాన్షియల్ సమస్యలున్నా, ఏమైనా శాంక్షన్స్ కావాలన్నా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకురావాలని, రాష్ట్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టి అర్జీదారుల సంతృప్తి తీసుకురావాలన్నారు. జిల్లా అధికారులు అంతా జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. ప్రతి శాఖ పరిధిలోని సర్వీసుల పరిష్కారం ఎలా ఉంది, సచివాలయాల్లో ఆయా శాఖలకు సంబంధించి సర్వీసుల పరిష్కారం చేస్తున్నారా లేదా చూడాలన్నారు. అన్ని శాఖల పరిధిలో రెగ్యులర్ గా చేసే పనులను మరింత మెరుగ్గా చేస్తే గ్రీవెన్స్ రావడం తగ్గుతుందన్నారు. జిల్లాలోని ప్రతి సచివాలయంలోనూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు గ్రీవెన్స్ తీసుకోవడాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది అంతా అందుబాటులో ఉండేలా చూడాలని, గ్రామస్థాయిలో సమస్య పరిష్కారం జరిగినప్పుడు జిల్లా స్థాయి వరకు సమస్యలు రావన్నారు.


జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, తహసిల్దార్, ఇతర అధికారులు సచివాలయాలను విధిగా తనిఖీలు ఖచ్చితంగా చేపట్టాలన్నారు. జిల్లా అధికారులు సచివాలయాలను తనిఖీలు చేయాలని, వచ్చిన ప్రతిసారి గ్రీవెన్స్ పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్ని గ్రీవెన్స్ వస్తున్నాయి, నాణ్యతగా పరిష్కరించారా లేదా అనేది చూడాలని, దీంతో గ్రీవెన్స్ పరిష్కారం మరింత బాగా జరుగుతుందన్నారు. ప్రతి పిటిషన్ కి కాల్ బ్యాక్ ఆప్షన్ ఇచ్చారని, అర్జీదారుడుకి సిఎంఓ కార్యాలయం నుంచి మళ్లీ ఫోన్ వెళుతుందని, మీరు ఫిర్యాదు చేశారు సమస్య పరిష్కారం నాణ్యతగా జరిగిందా లేదా, సంతృప్తిగా పరిష్కారం అందించారా లేదా అనేది అడుగుతారన్నారు. జిల్లాలో కూడా ఆడిట్ టీం, పిఎంయూ ఉందని, ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా మానిటరింగ్ చేయబడుతుందన్నారు. సాధారణంగా పరిష్కారం అయ్యిందని గ్రీవెన్స్ క్లోజ్ చేస్తే సరిపోదని, ఖచ్చితంగా పరిశీలన చేసి పరిష్కరించాలన్నారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి అంటే ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా పరిపూర్ణంగా పరిష్కరించాలని సూచించారు. ఎవరు సరిగా పని చేయలేదనే ముద్ర రాకూడదన్నారు. ప్రభుత్వంపై నమ్మకం మరింత మెరుగుపడాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్క గ్రీవెన్స్ ని పరిష్కరించడంలో సీరియస్ గా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అర్హత ఉన్న లబ్ధి ఇవ్వలేకపోతున్నాము అనేది ఉండరాదని, పెన్షన్స్, రేషన్ కార్డు, ఇంటి పట్టా, ఇళ్ల మంజూరు, తదితర పథకాల కింద అర్హుల ఎంపిక మరింత మెరుగ్గా ఉండాలన్నారు. సచివాలయాల వారీగా అర్హత ఉన్న వారికి రావాల్సిన పథకాలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలించాలని, ప్రజా ప్రతినిధులు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కింద క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిలో అర్హత ఉన్న వారికి పథకాలు అందుతున్నాయా లేదా అనేది చూడాలన్నారు. సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసి సచివాలయాల్లో ప్రదర్శిస్తే సగం సమస్యలు పరిష్కరింపబడతాయన్నారు. ప్రభుత్వ పథకం కింద లబ్ధి కలిగితే వారికి సక్రమ రీతిలో లబ్ధి పంపిణీ చేయాలని, ఇందులో ఎలాంటి ఆలస్యం ఉండరాదన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు వ్యక్తిగతంగా బాధ్యతలు తీసుకొని క్షేత్రస్థాయిలో ప్రతిరోజు మానిటర్ చేయాలని, గ్రీవెన్స్ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు సేవలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. ప్రతి శాఖ వారి పరిధిలోని సీజన్ సమయంలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ప్రతినెలా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని, వారి శాఖ పరిధిలో సమీక్ష చేసుకోవాలన్నారు. ప్రతి శాఖ పరిధిలోను సీజనల్ సమయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులందరూ సమష్టిగా పనిచేసి ప్రతి గ్రీవెన్స్ నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆయా శాఖల పరిధిలో శాంక్షన్ రాలేదు, పంపిణీ జరగలేదు, మరి ఏదైనా సమస్య ఉందో అలాంటి వాటి పని గ్రీవెన్స్ వస్తుంటాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి శాఖ పరిధిలోను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జీరో పెండెన్సీ పాలసీ అమలు చేయాలని, ఇందుకోసం అదనంగా శ్రద్ధ పెట్టాలన్నారు. ఎవరు వేలెత్తి చూపకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నారు. ప్రతి పిటిషన్ ని సిఎంఓ కార్యాలయం అడిగే పరిస్థితి ఉంటుందని, సిఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తే అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేసేలా గ్రీవెన్స్కు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. నవరత్నాలు, ద్వైవార్షిక నగదు పంపిణీ, పథకాలను సీరియస్గా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, సచివాలయాల భవనాలు, నాడు -నేడు పనులు, ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి గ్రామానికి అన్ని రకాల సదుపాయాలను కల్పించాం అని చెప్పగలగాలని, ఇందుకోసం అందరూ కలిసి పనిచేయాలని, జిల్లాను ముందుకు తీసుకెళ్లాలన్నారు. గ్రీవెన్స్ కి సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏలు పెండింగ్ ఉండరాదని, పెండింగ్ పై ప్రతిరోజు మానిటర్ ఉండాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని, గ్రామస్థాయి అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.


జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద 1902 టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలందరికీ తెలిసి ఉండాలన్నారు. 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను జిల్లా, డివిజన్, మండల కేంద్రాలు, అన్ని ప్రాంతాల్లో ప్రజలకు కనిపించేలా, తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, సచివాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. ప్రజలందరికీ 1902 టోల్ ఫ్రీ నెంబర్ చేరువయ్యలా చూడాలన్నారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా శాఖల ఉద్యోగులుగా ఉన్నతాధికారులు చూడాలని, సచివాలయ ఉద్యోగులకు అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్ అందించాలన్నారు. ప్రతి ఒకటి రెండు నెలలకు ఒకసారి వారికి ఆయా శాఖల పరిధిలో సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. గత ఏడాది కాలంగా 1,130 రీ ఓపెన్ గ్రీవెన్స్ వచ్చాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయిలో రీఓపెన్ పై మానిటర్ చేయాలని ఆదేశించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ పై నిత్యం ఫాలోఅప్ చేస్తున్నామన్నారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి జిల్లా, డివిజన్, మండల అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి గ్రీవెన్స్ సకాలంలో పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏ లోకి ఒక్కటి కూడా గ్రీవెన్స్ వెళ్లకుండా నో బియాండ్ ఎస్ఎల్ఏ కాన్సెప్ట్ అమలు చేస్తున్నామన్నారు. గ్రీవెన్స్ ఇచ్చిన అర్జీదారుడుతో సంబంధిత తహసిల్దార్, ఆర్డీవో, ఇతర అధికారులు మాట్లాడి అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేసేలా పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నామని, గ్రీవెన్స్ నాణ్యతగా పరిష్కరించారా లేదా అనేది పరిశీలన ఖచ్చితంగా చేస్తున్నామన్నారు. గ్రీవెన్స్ లను నాణ్యతగా గడువులోపు పరిష్కరించేలా కృషి చేస్తున్నామని, రీ ఓపెన్ కేసులు ఎక్కువగా రాకుండా చూసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 32 మండలాలకు 32 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని, వారు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి గ్రీవెన్స్ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో స్పందన పిటిషన్లు ఎన్ని వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, రీఓపెన్ గ్రీవెన్స్ వివరాలు, తదితర అంశాలపై తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ లో వచ్చిన గ్రీవెన్స్ వివరాలు, ఇతర అంశాలను వివరించారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, సిపిఓ విజయ్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోసెస్, ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, డ్వామా పిడి రామాంజనేయులు, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, బీసీ వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డిఎస్ఓ వంశీకృష్ణ, డిఎఫ్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, జిల్లా వాటర్ సప్లయి ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, డిటిడబ్ల్యూఓ మోహన్ రామ్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ దేశే నాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమా మనోహర్ రాజు, హిందూపురం ఆపరేషన్ ఈఈ సంజప్ప, ఇంచార్జి డిఈఓ రంగస్వామి, సివిల్ సప్లై డిఎం అశ్వర్థ నారాయణ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments