బహిరంగ సభకు వచ్చే లబ్ధిదారులకు, సబికులకు ఎలాంటి సౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు


కావలి: మే.10 (ప్రజా అమరావతి);

 రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా బహిరంగ సభకు వచ్చే లబ్ధిదారులకు, సబికులకు ఎలాంటి సౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు


చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. హరి నారాయణన్ తెలిపారు. బుధవారం సభా వేదిక వద్ద గ్యాలరీ ఇన్చార్జ్ అధికారులతో సమీక్ష చేశారు. వేలాదిమంది ప్రజలు ముఖ్యమంత్రి సభకు వస్తున్నందున 40 గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని ,ఒక్కో గ్యాలరీకి ఒక మండల స్థాయి అధికారితో  పాటు పదిమంది సిబ్బందిని నియమించామన్నారు . ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారందరికీ త్రాగునీరు, స్నాక్స్ అందించి కావలసిన సౌకర్యాలు కల్పించడం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు . గ్యాలరీకి ఓవరాల్ ఇన్చార్జులుగా జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవి, పిడి డి డబ్ల్యూ ఎం ఏ వెంకటరావు ను నియమించామన్నారు. జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్, జడ్పీ సీఈవో, పిడి డి డబ్ల్యు ఎం ఏ తది తర అధికారులు పాల్గొన్నారు.

Comments