తెలంగాణ సిఎం అభ్యర్థి ప్రవీణ్ కుమార్ మాయవతి ప్రకటన.సరూర్ నగర్,హైదరాబాద్ (ప్రజా అమరావతి);*మాయవతి సందేశం**తెలంగాణ సిఎం అభ్యర్థి ప్రవీణ్ కుమార్ మాయవతి ప్రకటన**రాజ్యాంగాన్ని తొలగించాలన్న ప్రభుత్వాన్ని ఓడించాలి. కెసిఆర్ ను ఓడించాలి.*ఉత్తరప్రదేశ్ వలే తెలంగాణలో బిఎస్పి ఆధ్వర్యాన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.


రాబోయే ఎన్నికల్లో గెలవాలి.

తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

తన విలువైన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాడుతున్నారని తెలిపారు.


తెలంగాణలో మన బహుజన రాజ్యం వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.తెలంగాణకు చెందిన జి.కృష్ణయ్య అనే ఐఏఎస్ చనిపోతే,ఆయన హత్యకు కారణమైన నిందితుడిని బీహార్ ప్రభుత్వం విడుదల చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో మొట్టమొదటి పార్టీ బిఎస్పి మద్దతు తెలిపింది.

యూపిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చాము.

భూమి లేని పేదలకు ఉచితంగా భూమి పంచాము.


కానీ

కెసిఆర్ ఇక్కడ మన బిఎస్పి చేసిన కార్యక్రమాలను కెసి ఆర్ కాపీ కొడుతున్నారు కానీ 


అమలు చేయడం లేదు.

కేవలం పేపర్ మీదనే పెట్టారు. 

ఇళ్లు కట్టివ్వడం లేదు.

భూమి పంచివ్వలేదు.


సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టి మరోసారి రాజకీయ స్వార్థం కోసం,ఓట్ల  కోసం చేస్తున్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు అన్యాయం చేసింది బిసిల రిజర్వేషన్ల కోసం కమీషన్ వేయాలని అంబేడ్కర్ అడిగితే కాంగ్రెస్ ఒప్పుకోలేదు.


అంబేడ్కర్ కు భారత రత్న కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు.


బిజెపి పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంది.


ఉత్తరప్రదేశ్ లో బిఎస్పి పార్టీ బలహీనంగా లేదన్నారు. ఇప్పటికిప్పుడు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగితే బిఎస్పి గెలుస్తుందని పేర్కొన్నారు.


ఈవిఎం పద్దతిలో ఎన్నికలు జరిగితే ఆధిపత్య పార్టీలకే న్యాయం జరుగుతుందని తెలిపారు. 


రాబోయే అసెంబ్లీ  ఎన్నికల్లో పోరాడి మన రాజ్యం తెచ్చుకోవాలి.


మన కాళ్లపై నిలబడి,మనమే అసెంబ్లీకి వెళ్లాలి.


విపి సింగ్ ప్రభుత్వంలో భారతరత్న ఇవ్వాలని మరియు బిపి మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేయాలని బి ఎస్పి డిమాండ్ చేసి సాధించిందని తెలిపారు.  


నాకు ఆనాటి విపి సింగ్  ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తామన్నా సరే బిసి లకు రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నానని తెలిపారు.బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 


సందేశం.*కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో*


ఈ ముఖ్యమంత్రి మనకు వద్దు.


నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వకుండా ఒక్కో ఉద్యోగాన్ని పది లక్షలకు అమ్ముకుని  మోసం చేసిన ముఖ్యమంత్రి అవసరమా? 


ఉద్యోగులకు మోసం చేస్తూ, వారిపై ఎస్మా ప్రయోగించే ముఖ్యమంత్రి అవసరమా?


రైతులు ధాన్యం తడిసి అల్లాడుతుంటే ప్రగతి భవన్ లో పడుకున్న ముఖ్యమంత్రి  అవసరమా? 


జీవోలను దాచిపెట్టే ముఖ్యమంత్రి మనకు అవసరమా? 


2 లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను కేవలం 7800 కోట్లకు లీజుకు ఇచ్చే ముఖ్యమంత్రి అవసరమా? 


డబ్బులన్ని దోచుకొని ప్రధాని కావడానికి ఖర్చు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి అవసరమా? 


దళిత బంధు పథకం కింద లంచం తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు ఏసిబికి ఇవ్వాలి.


వందల కోట్లతో ప్రచారాలు కాదు, ఉద్యోగుల సమస్యలు తీర్చాలి.


తెలంగాణ ప్రజల డబ్బుతో మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకొని 1.5 లక్షల జీతం ఎలా ఇస్తారు? 


రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి నేడు బిఎస్పిని చూసి భయపడుతున్నారు.


అందుకే అంబేడ్కర్ విగ్రహం,సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు.


పచ్చగా శాంతియుతంగా ఉన్న తెలంగాణలో మతకల్లోలాలలు పెట్టడానికి బిజెపి ప్రయత్నం చేస్తుంది.


అమిత్ షా ముస్లింల రిజర్వేషన్లు తొలగించాలని అంటున్నారు.


అమిత్ షా ఖబడ్దార్... రిజర్వేషన్లు మీ అయ్య జాగీర్ కాదు.

బండి సంజయ్ మసీదులు తవ్వుతామంటున్నారు.బిజెపి,బిఆర్ఎస్ ఒక్కటే...

రెండు పార్టీలు కలిసి తెలంగాణలో రసవత్తర డ్రామా చేస్తున్నాయి.


ప్రజలారా వారి మాయలో పడకండి.


మోడీ బిసి ప్రధాని అయితే బిసిల కులగణన ఎందుకు చేయడం లేదు? 

బిసిల రిజర్వేషన్లు కెసిఆర్ ఎందుకు పెంచడం లేదు.రాష్ట్రంలో పాల వ్యాపారాన్ని కూడా నాశనం చేసి గుజరాత్ కంపెనీకి ఆప్పజెప్పి, రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు.


నిజాలు చెప్పే పత్రికలను ప్రభుత్వం సచివాలయం లోపలికి రానివవ్వడం లేదు.


డోలు దెబ్బ,మోకు దెబ్బ,తుడుం దెబ్బ,దండోరా దెబ్బను ప్రభుత్వానికి రుచి చూపించాలి.


మనకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని గుంజి కొట్టాలి.


మాయవతి గారు మన మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చాలి.బిఎస్పి రాబోయే ఎన్నికల్లో బిసిలకు 60 నుండి 70 సీట్లు ఇస్తుంది.


నిరుపేదలకు కనీసం ఎకరం భూమి,పదిలక్షల ఉద్యోగాలు,అంతర్జాతీయ స్థాయి విద్య, ఉద్యోగం ఇచ్చే ఏకైక పార్టీ బిఎస్పి.

Comments