ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల అభినందన కార్యక్రమ మచిలీపట్నం, మే 18 (ప్రజా అమరావతి);


జిల్లాలో  పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల అభినందన కార్యక్రమా


న్ని ఈనెల 25,  27 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు.


గురువారం మధ్యాహ్నం విజయవాడ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర  విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ ప్రకాష్ తదితర  ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో  పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల అభినందన కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్ నుండి పాల్గొని మాట్లాడుతూ

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించే కార్యక్రమాన్ని సమర్ధులైన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు,వివిధ  ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు  గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా  చేపట్టడం ఎంతో ఉదాత్తమమైనదన్నారు.

ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతిభగల విద్యార్థులకు ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు లేదని అటువంటిది నేడు వారిని గుర్తించి  అభినందించడం గొప్ప విషయం అన్నారు.

ఇప్పటివరకు ఇలాంటి వేదిక ఉండేది కాదన్నారు.


 ప్రైవేట్ విద్యా సంస్థలు వారి గురించి ఎంతగానో ప్రచారం చేసుకుంటున్న ఈ తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించే కార్యక్రమం చేపట్టడం విద్యార్థుల్లో ఎంతగానో స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని నింపుతుందన్నారు


పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణాజిల్లా 75 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత సంవత్సరం 10వ తరగతిలో 65 శాతం ఫలితాలు వచ్చాయని, ఈ సంవత్సరం 10 శాతం అధికంగా 75 శాతం ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. రాబోవు సంవత్సరంలో  పరీక్ష ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు.


జిల్లాలో ఏడు రకాల ప్రభుత్వ యాజమాన్యాల విద్యాసంస్థలు ఉన్నాయని వాటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితా పక్కాగా సిద్ధం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.

శాసనసభ్యులతో సంప్రదించి

ఈనెల 25వ తేదీన నియోజకవర్గాల స్థాయిలో, 27వ తేదీన జిల్లాస్థాయిలో అభినందన కార్యక్రమాన్ని మంత్రివర్యుల సూచనల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో ఉత్తమ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను,  విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లను ప్రభుత్వం తరఫున పతకాలు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సత్కరిస్తామన్నారు.


అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ సంయుక్త కలెక్టర్ ను ఈ కార్యక్రమాల కన్వీనర్ గా నియమిస్తున్నామని వారి ఆధ్వర్యంలో అన్ని పనులు సజావుగా నిర్వహించాలని డీఈవో తహేరా సుల్తాన్ కు సూచించారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్  ఛాంబర్ నుండి డీఈవో తహేర సుల్తానా,  డివిఈవో ప్రసాద్, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ రాజు, ఉప విద్యాధికారి సుబ్బారావు, డిసిఇబి కార్యదర్శి మోమిన్ తదితర అధికారులు పాల్గొన్నారు.Comments