దేశంలోనే నెంబర్ 1 హజ్ హస్ విజయవాడలో నిర్మిస్తాం:- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.*దేశంలోనే నెంబర్ 1 హజ్ హస్ విజయవాడలో నిర్మిస్తాం:- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు


*


*నంబూరులో హజ్ యాత్రికులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత*


అమరావతి (ప్రజా అమరావతి):-రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లాలోని నంబూరు లోని హజ్ క్యాంప్ కు వెళ్లిన చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులతో ముచ్చటించారు. వారికి మిఠాయిలు, యాత్రలో ఉపయోగపడే పలు వస్తువులతో కూడిన కిట్ ను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారి అయినా మక్కాకు వెళ్లాలి అనుకుంటారు. పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత. నాడు హైదరాబాద్ లో హజ్ హౌస్ నిర్మాణం చేశాం. అంతకు ముందు హజ్ యాత్రకు వెళ్లాలి అనుకునే వారు ముంబై వెళ్లాల్సి వచ్చేది. హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టిన తరువాత యాత్రికులకు సౌకర్యం లభించింది. రాష్ట్ర విభజన తరువాత విజయవాడలో 10 ఎకరాల్లో హజ్ హౌస్, ఇతర నిర్మాణాలు కట్టాలని శంకుస్థాపన చేశాం. కానీ నేడు ఆ పనులు నిలిచిపోయాయి. తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోనే నెంబర్ 1 గా ఉండే హజ్ హౌస్ ను విజయవాడలో నిర్మిస్తామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముస్లిం నేతలు వహీద్ హస్సేన్, షుబ్లిలు సమకూర్చిన యాత్రికుల కిట్ లను అందరూ స్వీకరించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్, మాజీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ధూళిపాళ్ల నరేంద్ర, అత్తర్ చాంద్ బాషా, శ్రవణ్ కుమార్, పార్టీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్, పార్టీ అధికార ప్రతినిధి రఫీ తదితర నేతలు పాల్గొన్నారు.

Comments