ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.నెల్లూరు, జూలై 17 (ప్రజా అమరావతి): ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంద


ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్ అన్నారు. 


సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో

 ఆంధ్ర ప్రదేశ్ నూతన మరియు పునరుద్దరణ ఇంధన వనరుల అభివద్ధి సంస్థ (నెడ్క్యాప్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్  ప్రారంభించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రోజురోజుకీ పెరుగుతున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నెడ్క్యాప్ ఆధ్వర్యంలో సులభతర వాయిదా పద్ధతుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వాహనాల అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సాధారణ ప్రజలకు కూడా వాయిదా పద్ధతుల్లో ఈ వాహనాలను అనేక కంపెనీలు అందిస్తున్నాయని చెప్పారు.  ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. 


ఈ కార్యక్రమంలో నెడ్క్యాప్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ రామలింగయ్య, ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments