ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనది మరియు విలువైనది - ఎమ్మెల్యే ఆర్కే.

 *ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనది మరియు విలువైనది - ఎమ్మెల్యే ఆర్కే*


 మంగళగిరి (ప్రజా అమరావతి);

*ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం నందు తాడేపల్లి పట్టణ BLA (బూత్ లెవెల్ అసిస్టెంట్) లతో జరిగిన సమావేశం.* 


ఈ సమావేశ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనది మరియు విలువైనదని...


గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర ప్రముఖమైనదని...


వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు...


2014, 2019 ఎన్నికలలో తాడేపల్లి ప్రాంతం అండగా నిలిచిందని, పార్టీ విజయం కోసం తాడేపల్లి ప్రాంత నాయకులు, ఏజెంట్లు చేసిన కృషి మరువలేనిదని 2014, 2019 అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ 2019 లో నారా లోకేష్ ఎన్నికలలో పోటీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుండి ఇతర జిల్లాల నుండి వచ్చిన కార్మికుల ఓట్లను సుమారు 45 వేల దొంగ ఓట్లను చేర్చారని అయినా ప్రజా బలంతో విజయం సాధించామని, అదే రీతిలో 2024లో పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ బూత్  ఏజెంట్లు అందరూ కృషి చేయాలని అన్నారు. 


రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైందని....


ప్రతి ఒక్క బూత్ లెవెల్ అసిస్టెంట్ తన పరిధిలో ఉన్న ఓటర్లు గుర్తింపులో కీలకపాత్ర పోషించాలని... దొంగవాట్లను తొలగించడానికి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని.


ఎన్నికలు జరిగేవరకు ఇది నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగిన ఓట్లను కాపాడుకోవాలని అన్నారు.


ఈ సమావేశం నందు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల్ రెడ్డి స్వామి, తాడేపల్లి పట్టణ JCS కన్వీనర్ ఈదులమూడి డేవిడ్ రాజు పాల్గొన్నారు..

Comments