అవినీతికి ఆస్కారం లేకుండా సుస్థిరమైన ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరే విధంగా ఏసిబి నిరంతరం కృషి చేయాలి.



అవినీతి నిరోధక శాఖ రేంజ్ కార్యాలయం,

విశాఖపట్నం (ప్రజా అమరావతి);


ఈ రోజు విశాఖపట్నం అవినీతి నిరోధక శాఖ రేంజ్ (విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామ రాజు జిల్లా) కు చెందిన అధికారులతో గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి  సమీక్ష సమావేశం నిర్వహించారు. 


పెండింగ్ కేసుల లో దర్యాప్తు త్వరిత  గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించేందుకు ప్రభుత్వం నుండి ప్రజలకు అందాల్సిన సేవలలో అవినీతికి ఆస్కారం లేకుండా సుస్థిరమైన ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరే విధంగా ఏసిబి నిరంతరం కృషి చేయాల


ని, అందుకు అనుగుణంగా ఏసిబి 14400 కాల్ సెంటర్, ఏసిబి కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులపైన సకాలంలో స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.  ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా నిరంతర నిఘాలో భాగంగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అధికారులను గుర్తించడం, నిరంతర తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ప్రజల నుండి వస్తున్న ఆరోపణల పైన విచారణ చేపట్టడం, సంభందిత అధికారుల ను గుర్తించడం వంటి చర్యలను చేపడుతూ ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వ సేవలు అందేలా చూడాలని సూచించారు. అదే విధంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన నిందితుల నేరాన్ని న్యాయస్థానంలో పూర్తి సాక్షాదారాలతో నిరూపించి సకాలం లో నిందితులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు.

Comments