సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి:


అమరావతి (ప్రజా అమరావతి);


*మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖలో వివిధ కార్యక్రమాల అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు.* 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


సంపూర్ణ పోషణ కార్యక్రమంపై సీఎం సమీక్ష.

సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి:


అంగన్ వాడీలలో సూపర్‌ వైజరీ వ్యవస్ధ ఎలా పనిచేస్తుందన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి :

బలమైన ఎస్‌ఓపీని రూపొందించాలి:

డ్రై రేషన్‌ పంపిణీ పైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి:

ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి:

రేషణ్‌ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదు :

ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశం :


ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తిస్తున్నారు:

వారందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలి :

మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుంది:

పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలి:

ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలి:

దీనివల్ల గ్రామస్థాయిలో పూర్తిస్థాయిలో రక్తహీనతను నివారించగలుగుతాం:

ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? రక్తహీనత సమస్య తగ్గుతుందా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి:


సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందిస్తున్న సమయంలోనే గర్భిణీలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశం.

ఒకవేళ టీకాలు మిస్‌ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

ఈ మేరకు సంబంధిత గ్రామానికి చెందిన ఏఎన్‌ఎంను ఆ సమయంలో అక్కడే ఉండేలా చూడాలన్న సీఎం. 

అలాగే పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేయాలన్న సీఎం.

ఎవరైనా పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్న సీఎం.

ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చూడాలన్న సీఎం.

రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించిన వెంటనే, ఆ వివరాలు తీసుకుని మహిళా శిశుసంక్షేమ ద్వారా వారికి పౌష్టికాహారం అందేలా చూడాలన్న సీఎం.

ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి. 


ప్రతినెలా కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయాలన్న సీఎం.

జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాలపై క్యాంపులు నిర్వహించేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం.

ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలన్న సీఎం.

Comments