మాతో కలిసి అడుగు వేయండి రాష్ట్ర భవిష్యత్ మార్చి చూపిద్దాం.


*మాతో కలిసి అడుగు వేయండి రాష్ట్ర భవిష్యత్ మార్చి చూపిద్దాం**ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ సిద్ధం*


*తొలి రోజు మూడు సమావేశాలు సూపర్ హిట్. రాబోయే రోజుల్లో ఎన్డీఏ అన్ స్టాపబుల్*


*రూ.200 వచ్చే కరెంటు బిల్లు రూ.800 ఎందుకైందో ఆలోచించి ఓటేయండి*


*మే 13న ఓటు వేసే ముందు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండి* 


*మద్య నిషేధమని ఓట్లేయించుకుని మద్యంపై అప్పులు తెచ్చిన వ్యక్తికి విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కుందా?*


*నీళ్ళు వస్తే రాయలసీమకు అభివృద్ధి చెందుతుందనే కక్ష గట్టి ప్రాజెక్టుల్నినాశనం చేస్తున్నాడు*


*మైనారిటీలకు ఎవరేం చేశారో చర్చించేందుకు జగన్ రెడ్డి సిద్ధమా?*


*చెల్లి పుట్టుక గురించి ప్రశ్నించి తల్లిని అవమానించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడేనా ?*


చిత్తూరు జిల్లా, మదనపల్లె  (ప్రజా అమరావతి);


ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం జెండా తీసుకువచ్చి తమ్ముళ్ళు, చెల్లెమ్మలు హోరెత్తిస్తున్నారు. 

రాష్ట్రం దశా దిశా మార్చేందుకు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ఈ ప్రజాగళం సభలు.

మదనపల్లికి చాలా సార్లు వచ్చాను కానీ ఇంత పెద్ద స్పందన నేను ఎన్నడూ చూడలేదు. 

ఈ ప్రభుత్వం పై మీకున్న కోపం కసిగా మరుతోంది. ఎప్పుడు ఎన్నికల వచ్చినా చిత్తు చిత్తుగా జగన్ రెడ్డిని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీ ఉత్సాహం చూసాక నాకు అర్థమైంది. 

2019లో ఒక్క ఛాన్స్ అన్నాడు.. ముద్దులు పెట్టాడు. తల నిమిరాడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడే బాదుడు... గుద్దుడే గుద్దుడు. ఎవర్ని వదిలిపెట్టలేదు. ఆ బాధను మీ అందరిలో చూస్తున్నాను. 

తొలి రోజు నా మూడు సమావేశాలు సూపర్ హిట్. రాబోయే రోజుల్లో ఎన్డీఏ అన్ స్టాపబుల్. 

ఎక్కడికెళ్ళినా సాగు నీటి కోసం రైతులు, ఉద్యోగాల కోసం యువత ఆవేదన చెందుతూ కనిపిస్తున్నారు. నమ్మించి గొంతు కోసే ప్రభుత్వం ఏదో.. మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించుకోండి. 

మాతో కలిసి అడుగు వేయండి. రాష్ట్రాన్ని మార్చుదాం. ఇది రాష్ట్రానికి కీలక సమయం. ఐదు సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ డౌన్ పెట్టే సమయం ఇది. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే.

ఈ ఐదేళ్ళలో ఇక్కుడున్న ఏ ఒక్కరైనా బాగుపడ్డారా? మీ జీవితాలు మెరుగుపడ్డాయా? ముస్లీం సోదరుల జీవితాలు మెరుగుపడలేదు.

సమయం లేదు మిత్రమా.. 47 రోజులే, 7 వారాలే. ప్రతి రోజు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్. మే 13న ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు మనఃసాక్షిగా ఆలోచించుకోవాలి.  

బటన్ నొక్కానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా చెప్పుకుంటున్నాడు. ఉత్తుతి బటన్ నొక్కుతున్నాడు. 

47 రోజులు మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఈ ఎన్నికలు మీ భవిష్యత్తు యొక్క దశ దిశ మర్చబోతున్నాయి. 

మరలా మంచి రోజులు కావాలా? రావణాసురుడి పాలన కవాలో ఆలోచించుకునే సమయం ఆశన్నమైంది.

ఒకప్పుడు రూ.200 వచ్చే కరెంటు బిల్లు నేడు రూ.800 వస్తోంది. రూ.100 ఇచ్చి నెలకు ఒక్క కరెంట్ ఛార్జీల నుంచి రూ.వెయ్యి లాగేసే జలగ కావాలా? మన కాళ్లపై మనం నిలబడేలా చేసే మంచి ప్రభుత్వం కావాలా? పోలింగ్ రోజు బూత్ కు వెళ్ళే ముందు ఆలోచించండి. 

ఐదు సంవత్సరాల్లో ఒక్క కరెంటు ఛార్జీలు వలనే ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకొని ఓటు వేయండి. 

పెరిగిన ఆర్టీసీ రేట్లు, చెత్తపన్ను, ఇంటిపన్ను, పెట్రోల్, డీజిల్ ధరలను గుర్తుచేసుకోండి. 

పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లు గుర్తు చేసుకోండి. 

నిత్యవసర ధరలు, బియ్యం, పప్పులు, వంట నూనె ధరలు ఎందుకు ఇంతలా పెరిగాయో ఆలోచించండి. పొరుగు రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలోనే ఎందుకు ధరలు పెరిగాయో ఆలోచించండి. 

యువత ఆవేశంగా ఉన్నారు. ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డీఎస్సీ లేదు, ఒక్క పరిశ్రమల లేదు, మరి ఎందుకు యువత వైసీపీకి ఓటు వేయాలి. 

వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి యువత నడుం బిగించాలి.. రోడ్డు మీదకు రావాలి.. యువ శక్తి ఏంటో నిరూపించాలి.. మీరు వేసే ఓటే మీ జివాతాన్ని మారుస్తుందని మొదటి సారి ఓటు వేసే పిల్లలు గుర్తు పెట్టుకోవాలి. 

తెలుగుదేశం, మిత్రపక్షాలు పనిచేసేది కేవలం మీ పిల్లల భవిష్యత్తు కోసమే. జగన్ రెడ్డి మీకు చేసిన ద్రోహానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. జగన్ రెడ్డి దిమ్మ తిరిగిపోవాలి.

రోజంతా కష్టపడి ఒక క్వార్టర్ వేస్తే శారిరక బాధలు తొలుగుతాయని అనుకునే మందుబాబుల బలహీనతను జగన్ రెడ్డి అవకాశంగా తీసుకున్నాడు. రూ.60 ఉన్న క్వార్టర్‌ను రూ.200 చేసి బాదుడే బాదుడు బాదుతున్నాడు. 

మద్యం షాపులో పేటిఎం, గూగుల్ పే, అన్ లైన్ పేమెంట్లు ఏం పని చేయవు. చిదంబర రహస్యం ప్రజలకు అర్థమవుతోంది. 

పేద వాడి రక్తం తాగే జలగ ఈ జగన్ రెడ్డి. మరలా ఎన్నికల్లో క్వార్టర్ తాగిస్తాడు. అవసరమైతే హాఫ్ తాగించి మిమ్మల్ని మత్తులో పెట్టి ఓటు వేయకుండా చేస్తాడు. ఓటుతో బుద్ధి చెప్పేందుకు ముందుకు రండి. 

తెలుగుదేశం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యమే ఉంటుంది. కల్తీ మద్యం ఉండదు. జగన్ రెడ్డిలా కల్లబొల్లి మాటలు నేను చెప్పను. మద్యం నిషేధం అని చెప్పి దాని మీద ఇష్టానుసారంగా దోచుకొని, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన విశ్వసనీయత లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 

మీ రక్తం తాగిన జలగని, ఆడబిడ్డల తాళిబొట్టును తెంచిన దుర్మార్గుడిన ఓడించేందకు కంకణం కట్టుకోండి.

ప్రభుత్వ ఉద్యోగులు మదనపల్లిలో ఎక్కువగా ఉన్నారు. వారి బాధ, ఆవేదన నాకు అర్థమైంది. 47 రోజులు చట్ట ప్రకారం పని చేయండి, నిబంధనలను అమలు చేయండి. ఐదేళ్ళు మిమ్మల్ని బానిసలుగా చూసిన వారి అంతు తెల్చే రోజు మీకు వచ్చింది. 

జీతాలు అడిగితే కేసులు పెట్టారు. ఉద్యోగులు సేవ్ చేసుకున్న డబ్బుల నుంచి పీఎఫ్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. 

మరలా ఉద్యోగస్తుల గౌరవాన్ని పెంచి, గౌరవ వేతనమిస్తాం, పీఆర్సీ ఉంటుందని ఉద్యోగులకు తెలుపుతున్నా. మీరు చేయాల్సిందల్లా జగన్ రెడ్డికి దిమ్మ తిరిగేలా రేపు బటన్ నొక్కండి. 

జే బ్రండ్ నాశిరకం మద్యం వల్ల, ఖర్చు ఎక్కువ కావడంతో గంజాయికి అలవాటు పడ్డారు. రాష్ట్రంలో గంజాయి వాణిజ్య పంటగా తయారైంది. ఇది చాలదన్నట్లు డ్రగ్స్‌ ను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. 

మొత్తం రాష్ట్రంలోని యువత జీవితాలను నాశనం చేయగలిగేంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ను మొన్న విశాఖలో 25 వేల కిలోల డ్రగ్స్ ను పట్టుకున్నారు. మీ పిల్లల భవిష్యత్తు మీ చెతిల్లోనే ఉంది. 

ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా గంజాయిపై సమీక్ష జరపలేదు. అందుకే తల్లిదండ్రలు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. నా పదవి కోసం నేను తాపత్రయపడటం లేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను.

ఒక వర్గం కాదు, ఒక వ్యక్తి కాదు అందరి జీవితాలు, అవకాశాలు నాశనం చేశాడు. ఇప్పుడు జాతిని నాశనం చేయాలని చూస్తున్నాడు. 

ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రిని నా జీవితంలో నేనెప్పుడు చూడలేదు. 

ఇక్కడి అభ్యర్ధి సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు. కానీ ఇంత దుర్మార్గ పాలన మేము చూడలేదు. 

ఎన్నికలంటే రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ ఈ సారి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? మాకు ఎప్పుడు విముక్తి వస్తుందా? జలగలాంటి జగన్ పార్టీని ఓడించి ఎప్పుడు భూస్థాపితం చేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 

నేను రాయలసీమ, చిత్తూరులో పుట్టినవాడిని. రాయలసీమ సమస్యలు తెలిసిన వాడిని.

రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమగా ఉండేది. ఇప్పుడు నీళ్ళు లేక కరువు సీమ, రాళ్ళ సీమలా మారిపోయింది. 

మహా నాయకుడు ఎన్టీఆర్. కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలని హంద్రీ-నీవా, నగిరి-గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. 

నేను రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాను. 

గత ఐదేళ్ల పాలనలో ఏకంగా రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టాను. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టుకే రూ.5,800 కోట్లు ఖర్చుపెట్టాను.

మదనపల్లెకి వచ్చి ఇక్కడ చెరువు దగ్గర నిద్రపోయిన రాత్రి నాకు ఇంకా గుర్తుంది. 

త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని నేను పోరాటం చేశాను. చెరువులకు నీరు అందించాం. వి.కోట వరకు నేను నీళ్ళు తీసుకొచ్చాను. 

నేడు చిత్తూరు జిల్లాకు ఒక్క టిఎంసీ నీళ్ళు విడుదల చేయలేదు. ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 

జగన్ రెడ్డి రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే. 

సాక్షి పేపర్‌లో ప్రకటనలకు చేసిన ఖర్చులో సగం కూడా రాయలసీమ ప్రాజెక్టులపై పెట్టలేదు. 

సాగునీరు వస్తే బంగారు పంటలు పండుతాయి. పెట్టుబడులు వస్తాయి. త్రాగు నీరు సమస్య పరిష్కారమవుతుంది. అభివృద్ధి అవుతుంది. సంపద సృష్టించవచ్చు. 

ఐదేళ్ళలో హంద్రీ-నీవా పైనా, అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయూర్ ను పూర్తి చేసి కియా పరిశ్రమలను తీసుకువచ్చాను. తద్వారా 12 లక్షల కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచమంతటా నడుస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు ఇప్పించా. ఆదాయం పెరిగింది. 

రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. ఎన్టీఆర్ గారు కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువస్తే.. పోలవరంను పూర్తి చేసి గోదావరి జలాలను రాయలసీమకు తీసుకురావాలనేది నా సంకల్పం. 

నీళ్ళు వస్తే రాయలసీమకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. కానీ జగన్ రెడ్డి ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే 25 ప్రాజెక్టులను రద్దు చేశారు. 

మరలా రాయలసీమకు నీళ్ళు కావాలన్నా, రాయలసీమ బాగుపడాలన్నా, యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావలంటే జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి.

మదనపల్లెలో మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో, వైసీపీ ఏం చేసిందో చర్చించడానికి నేను సద్ధంగా ఉన్నా. జగన్ రెడ్డి చర్చకు వస్తావా అని సవాల్ చేశారు. 

సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 

హైదరాబాద్‌లో హజ్ హౌస్ కట్టాం. మైనారిటీ సోదరుల కోసం దుకాణ్ అవుర్ మకాన్ కింద ఆర్థిక సాయం చేశాం. రూ.3 లక్షల ఆర్థిక సాయంలో రూ.లక్ష సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 

మీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశ విద్యా విధానం కింద దాదాపు రూ.160 కోట్లు ఖర్చు పెట్టి వారిని చదివించాం. రంజాన్ తోఫా ఇచ్చాం. 

హైదరాబాద్‌లో ఒకప్పుడు మత విద్వేషాలు ఉండేవి. వాటిని పూర్తిగా నివారించాం. 

సమైఖ్య ఏపీలో హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, తర్వాత కర్నూలులో పెట్టాం. కడప, విజయవాడలో హజ్ హౌజ్ లు కట్టాం. కడపలో 90శాతం నిర్మాణం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం పనులను జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. 

ఇక్కడే నేను మొదలుపెట్టిన షాదీఖానాను కూడా జగన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. 

కేంద్రంలో పాస్ చేసిన బిల్లులన్నిటికీ వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇక్కడున్న ఎంపీ కూడా సమర్ధించి ఇప్పుడు నాటకాలు, దొంగాటలు ఆడుతున్నాడు. 

ఈ విషయాన్ని మైనారిటీలు అర్థం చేసుకోండి. మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరికీ అన్యాయం జరగదు. 

మీ హక్కులు కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. దుల్హాన్ పథకం కింద రూ.163 కోట్లు ఖర్చు పెట్టి 33 వేల పేద ఆడబిడ్డలకు పెళ్లి చేపించాం. 

ఎక్కడిక్కడ మైనారిటీలకు అన్యాయం చేసి కల్లబొల్లి మాట్లాడుతూ తెలగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. వక్ఫ్ బోర్డ ఆస్తులు అన్యక్రాంతమైపోతున్నాయి. 

ఇవి అన్నీ కాపాడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప సాధ్యం కాదు. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మవద్దు. మీకు అండగా నేనుంటా. గతంలో నేను చేసినదానికంటే రెట్టింపు చేసే బాధ్యత నాది. షాజహాన్ భాషాను గెలిపించుకోండి. మీకు ఏం కావాలో నేను చేస్తాను.

జగన్ రెడ్డి సిద్ధంగా ఉండూ... నిన్ను, నీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 

నీ అహంకారం కూలిపోతుంది. నీ అక్రమాలకు ముగింపు పలుకుతారు. 

సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం. ఓడిపోవడానికి సిద్ధామా? మొన్న సిద్ధమని మీటింగులు పెట్టి బలవంతంగా ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారు. స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 

ఆడబిడ్డలను అవమానమర్చడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. రాయకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకనే అనుమానించే వారిని ఏమనాలో తెలయదు. 

ఆడబిడ్డలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారు అనే సంస్కారం తెలుగుదేశంలో ఉంది. 

మేము సిద్ధం అంటూ నేరుగా ఇడుపులపాయకు వెళ్ళి బయటకు వచ్చాడు. బాబాయిని గొడ్డలితో చంపేసిన వ్యక్తితో బయటకి వచ్చాడు అంటే అందర్ని గొడ్డలితో చంపేయాడినికి వస్తున్నాడు. 

బాబాయ్ ని చంపిందెవరు అని మీ చెల్లి అడుగుతోంది. జగన్ రెడ్డికి ఓటు వేయోద్దని అడుగుతోంది. ధైర్యముంటే ప్రజలకు సమాధానం చెప్పి ఓటు అడగడానికి రావాలి. జగన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం మేము భరిస్తున్నాం.

దుర్మార్గాలు, నేరాలు, దోపిడీలు చేసే వారిని శాశ్వతంగా నాశనం చేసే రోజు దగ్గర పడింది. 

మీకు భరోసా ఇస్తున్నా. సంపదను సృష్టించే పార్టీలు ఎన్డీఏ పార్టీలు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. 

ఇప్పటికే సూపర్ సిక్స్‌ ను ప్రకటించాం. ఆంక్షలు లేకుండా ఆడబిడ్డ నిధి కింద ఒక్క బిడ్డకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి పిల్లవాడి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాం. దీపం పథకం కింద 3 వంట గ్యాస్ సిలిండర్‌లను ఉచితంగా ఇస్తాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. అన్నదాత పథకం కింద సంవత్సరానికి రూ.20 వేల సాయం,  సబ్సిడీలు, 90 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. యువగళం ద్వారా నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 

జాబ్ రావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే మీరు సైకిల్ కు ఓటు వేయాలి. 

ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయి. మదనపల్లెలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునేలా చేస్తాం. 

యువతను ప్రోత్సాహిస్తాం. ఉద్యోగం వచ్చేంతరవకు నిరుద్యోగికి రూ.3 వేలు నెలకు ఇస్తాం. 

ప్రతి ఇంటికి మంచి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పేదరిక నిర్మాలన చేస్తాం. 

మైనారిటీ డిక్లరేషన్ ఇస్తాం. ఆంక్షలు లేకుండా ఇంటి వద్దకే రూ.4 వేలు పింఛను ఇస్తాం. ఒక నెల మిస్ అయినా ఆ డబ్బును మూడు నెలల్లో తీసుకునేలా ఏర్పాటు చేస్తాం. బీసీలకు 50 ఏళ్ళుకే పింఛను ఇస్తాం. 

విద్యుత్ ఛార్జీలు పెంచబోమని కాలర్ ఎగరేసి చెబుతున్నా. 

అన్నా క్యాంటీన్‌లు తిరిగి ప్రారంభిస్తాం. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి ధరలు నియంత్రణ చేస్తాం. 

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్‌లకు నిధులు ఇస్తాం. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ పథకాలను పునరుద్ధిరిస్తాం. 

మాల, మాదిగలకు అండగా ఉంటి ఏ, బి, సి, డి క్యాటిగిరైజేషన్ తీసుకువచ్చి జిల్లాల వారిగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. 

ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపించడానికి ముందుకు వచ్చిన మాదిగ దండోరాకు నా అభినందనలు.

పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం మానేశాడు. ఉదయం అల్పాహారం ఇసుక, మధ్యాహ్న భోజనం మైన్స్, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 

కొడుకు ఎంపీ, పెద్దిరెడ్డి మంత్రి, అబ్బసొమ్మైనట్టలు తుంబళ్ళపల్లెలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. 

అన్నమయ్య జిల్లాలో సమర్థులు ఉన్నారు. వారు బయటకి రావాలంటే బయటకి రానివ్వరు. 

అన్ని కాంట్రాక్టులు, ఇసుక అక్రమాలు అన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికే. 

హంద్రీ నీవా పూర్తి చేయకుండా గండికోట నుంచి ఇంకో కెనాల్‌కు రూ.6 వేల కోట్లు మంజూరు చేయించుకున్నాడు. పుంగునూరులో పర్మిషన్ లేకుండా భూములు లాక్కోడానికి ప్రయత్నించగా రూ.100 కోట్లు ఫూన్ ను ఎన్జీటీ ప్రభుత్వానికి వేసింది. 

దౌర్జన్యాన్ని ఎండగడుతున్నానని అంగళ్లులో నా మీద కేసు పెట్టారు. నేను తలుచుకుంటే వీళ్ళు బయట తిరిగేవారు కాదు.

భద్రాచలం తెలంగాణకు పోయిందని ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశాను. అక్కడున్న సుబ్బారావు అనే చేనేత కుటుంబం ఆత్మాహత్య చేసుకుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో అతనకున్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ వైసీపీ నేతలు చేసుకున్నారు.

నంద్యాలలో అబ్దుల్ సలీం కుటుంబం వేధింపులు తాలలేక ఆత్మహత్య చేసుకున్నారు. 

తూ.గో జిల్లాలో పూజారిపై వైకాపా నాయకుడు దాడి చేశాడు. ఎవరికి రక్షణ లేకుండా పోయింది.

మదనపల్లెని జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది. లీటర్ పాలులో కూడా రూ.20 కొట్టేశాడు. 

ఆవులపల్లి రిజర్వాయుర్‌ను అనుమతులు లేకుండా రూ.600 కోట్లు కొట్టేశాడు. 

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పూర్తి చేస్తాం. హంద్రీ-నీవా పూర్తి చేస్తాం. దేవాలయాలను పరిరక్షిస్తాం. మదనపల్లెలో స్కూల్స్, కాలేజీలు తీసుకువస్తాం. యువతకు ఉద్యోగాలు ఇస్తాం. టౌన్‌లో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేస్తాం. వరద నీరు పోవడానికి హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం. రోడ్లు, కాలవలు పూర్తి చేస్తాం. ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. వైసీపీ నాయకులు కొట్టేసిన విద్యుత్ కార్మికు భూములు తిరిగిస్తాం. కాపు, బలిజ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేస్తాం.

పవన్ కళ్యాన్ ఎప్పుడూ ఒకటి చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ విముక్తి రాష్ట్రంగా మార్చాలని.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనవ్వకూడదని అనేక సార్లు పవన్ చెప్పారు. 

రూ.12 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు ఉంది. ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు. దాడులు పెరిగాయి. ప్రత్యేక హోదాను గాలికి వదిలిపెట్టాడు. 

ఎంతసేపు కేసుల నుంచి రక్షించుకోవాలని తాపత్రయపడ్డాడు తప్ప కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. 

రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఏకైక ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసాయి. రాష్ట్రాభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరం. 

మూడు పార్టీల జెండాలు వేరైనా, అజెండా మాత్రం ఒకటే. అదే రాష్ట్రాభివృద్ధి. ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నం. మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు అండగా ఈ జిల్లాలో పుట్టినవాడిగా నేను ఉంటాను. 

గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతా. దుర్మార్గ, అహంకార, దోపిడి పాలనకు ఇక స్వస్త పలకాలి. 

రాష్ట్రంలో బాగుపడిన ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం గెలవాలి. దాని కోసం అందరూ ముందుకు రావాలి. 

ప్రతి ఒక్కరు ఆలోచించి ఎన్డీఏ అభ్యర్ధికి మీ అమూల్యమైన ఓటు వేయాలని కోరుకుంటున్నాను.

Comments