ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు పంపించాలి....

 ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల  కమిషన్ కు పంపించాలి....*


జిల్లా ఎన్నికల అధికారి పి అరుణ్ బాబు
పుట్టపర్తి, మార్చి 30 (ప్రజా అమరావతి):


సార్వత్రిక ఎన్నికలు - 2024 కొరకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ నుంచి రోజువారి నివేదికలను  ఎప్పటికప్పుడు ఎన్నికల  కమిషన్ కు పంపించాలని  జిల్లా ఎన్నికల అధికారి పి. అరుణ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకటనలోని సారాంశం ప్రవర్తన నియమావళి అమలలో ఎన్నికల నివేదికల సమర్పణ సి. విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపైఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల  కమిషన్ కు పంపించాలి పై ప్రకటనలో తెలిపారు.


జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా.. 30-03-2024 శనివారం సాయంత్రం ఏడు గంటలకు  జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్.. ఫిర్యాదుల పరిష్కార నివేదికను విడుదల చేయడం జరిగింది. 


* ప్రింట్ మీడియా ద్వారా 78 ఫిర్యాదులు అందగా.. 78 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది.

* డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ద్వారా 1 ఫిర్యాదులు అందగా.. 1 పరిష్కరించడం జరిగింది


ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఉద్యోగులు, వాలంటీర్లు, కాంట్రాక్ట్ సిబ్బందిపై చర్యలు చేపట్టడం జరిగింది. ఈ తేదీ నాటికి 27 మంది వాలంటీర్లు, ముగ్గురు కాంట్రాక్ట్ సిబ్బంది, ఇద్దరు రెగ్యులర్ సిబ్బంది, ఒక రేషన్ డీలర్లను తొలగించడం జరిగిందని కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు.


  సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పుట్టపర్తి కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నెంబర్ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి

డిఆర్ఓ కొండయ్య


పుట్టపర్తి, మార్చి 30: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పుట్టపర్తి కలెక్టర్ లోని టోల్ ఫ్రీ నెంబర్  ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని డిఆర్ఓ కొండయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు

18004258795

18004258796

18004258787Comments