వైసిపి నాయకులకు చట్టం వర్తించదా? *వైసిపి నాయకులకు చట్టం వర్తించదా? *రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిలేదు* 


 *డీజీపీకి ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కి లేఖ రాసి ఎన్నికల నిర్వహణ నుంచి తప్పుకోవాలి* 


 *డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తొత్తుల్లా పోలీసులు పని చేయమనటం సరికాదు* 


 *వర్ల రామయ్య* 

అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. సీనియర్ న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ మెంబర్ పోసాని వెంకటేశ్వర్లుతో కలిసి వర్ల రామయ్య  సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ....కుప్పం రిటర్నిoగ్ అధికారి అధికార పార్టీ అభ్యర్థుల పట్ల ఒకలా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారు.కుప్పం నియోజకవర్గంలో సోమవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ వేసే ప్రక్రియలో ఆయన భార్య వాహనాన్ని నేరుగా  లోపలికి ఎలా అనుమతిస్తారు? వైసిపి నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలతో సరాసరి లోపలికి ఎలా వస్తారు? దీనిపై విచారణ జరిపి ఎన్నికల నియమావలని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిలేదని ప్రతిపక్ష పార్టీలను హింసించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేత  జంగా కృష్ణమూర్తి లింగాల అనే గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ  శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి  జంగా కృష్ణమూర్తిని కలసి మద్దతు తెలిపాడన్న కారణంతో వైసీపీ కార్యకర్తలు అతని వరిగడ్డితో ఉన్న ట్రాక్టర్ ని తగులబెట్టారు. ఇది హేయమైన చర్య ఈ ఘటన లో ఉదాసీనంగా వ్యహరిచిoన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

మరో వైపు సీఎం సొంత జిల్లాలో శాంతి భద్రతలు సరిగా లేవు. పులివెందులలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామన్న పాపానికి వృద్ధ దంపతులపై వైసిపి గుండాలు దాడి చేశారని వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని వర్ల రామయ్య పోలీసుల తీరుపై ఆగ్రహించారు. ఎంత మంది సీనియర్ అధికారులున్నా వారందరిని కాదని ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీగా  రాజేంద్రనాధ్ రెడ్డి నియమించారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిపై స్వామి భక్తి ప్రదర్శిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తూన్నారు. ఈయనపై  ఇప్పటికే పలు మార్లు ఈసీకి పిర్యాదు చేశాం. కానీ చర్యలు తీసుకోవడానికి ఈసీ మీనమేశాలు లెక్కేస్తోంది. జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లినా అక్కడి ఎస్పీలు, కమిషనర్లు జగన్ వచ్చే సమయానికి ఆ బస్సు డోర్ దగ్గర ఉండాలని సర్కులర్ ఇవ్వడం సిగ్గుచేటు. ఇది సరికాదు.

దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.రాజేంద్రనాథ్ రెడ్డి కంటే సీనియర్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నే డీజీపీగా నియమించడంతోనే రాజేంద్రనాథ్ రెడ్డి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారన్నారు.  డిజిపి  లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే శక్తి లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి కేంద్ర బలగాలకు ఎన్నికల నిర్వహణ విధులు అప్పగించాలన్నారు. కడప జిల్లాలో శాంతి భద్రతలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వివేకా హత్యపై మాటాడొద్దు అంటూ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు.వైయస్ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిపై  మరో వేటు పడకుండా వారికి భద్రత కల్పించాలని వర్ల రామయ్య ఎన్నికల కమిషన్ ను కోరారు.విద్యాశాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల సమయంలో విద్యార్దుల తల్లితండ్రులతో మీటింగ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని అడ్డుకుంది. మళ్లీ ఈ నెల 23న విద్యార్దుల తల్లితండ్రులతో సమావేశం నిర్వహిస్తారంట.  ఈ సమయంలో విద్యార్దుల తల్లితండ్రులతో మీటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి? విద్యార్దుల తల్లితండ్రులకు వైసీపీకి ఓటేయమని ప్రవీణ్ ప్రకాశ్  చెబుతారా?  మరి లేకుంటే సమావేశం దేనికి నిర్వహిస్తున్నారు? జగన్ కి అనుకూలంగా పని చేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఈసిని కోరారు.

Comments