ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.

 ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.స్ట్రాంగ్ రూములను ఆకస్మికంగా తనిఖీ చేసిన 


 జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు 


పుట్టపర్తి, మే 16 (ప్రజా అమరావతి): సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ,  20- హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఆయా స్ట్రాంగ్ రూములకు చేర్చి  మూడెంచెల భద్రతను పటిష్టం చేసినట్లు  జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. గురువారం మధ్యాహ్నం హిందూపురం పట్టణ సమీపంలో బిట్ కళాశాల మరియు లేపాక్షి చోళ సముద్రం వద్దనున్న డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని .స్ట్రాంగ్  రూముల వద్ద ప్రస్తుత పరిస్థితులను, భద్రత చర్యలను ,  విధులు నిర్వర్తిస్తున్న వారి పనితీరును  జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఈవీఎం కౌంటింగ్ ల ప్రక్రియను రెండు కేంద్రాల్లో చేపట్టినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ ల్లో ఈవీఎంలను ఉంచి మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్ డ్ రిజర్వు పోలీ సులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24 గం టల పాటు రక్షణగా ఉండేలా ఏర్పాటు చేశారు. వీరితో పాటు కంట్రోల్ యూనిట్లను నిరంతరం పర్య వేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చారు. భద్రత వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు.జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో డీఎస్పీ స్థాయి అధికారులు ఇతర పోలీస్ ఉద్యోగ సిబ్బంది ఆధ్వర్యంలో 24 గంటలు విధులు ఆ కౌంటింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అనంతరం స్ట్రాంగ్ రూములను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆర్ . ఓ. లకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలను ఎవరు కూడా అతిక్రమించరాదని కౌంటింగ్ సెంటర్ ల ప్రాంతాలలో  144 సెక్షన్ అమల్లో ఉందని నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా కౌంటింగ్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న వారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని,పోలీస్ శాఖ నేతృత్వం లో గట్టి బందోబస్తు చేపట్టాలని, చిన్నపాటి అవాంఛనీయ సంఘటనకు కూడా తావివ్వరాదన్నారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూముల తనిఖీలలో భాగంగా   ఈవీఎం గదులను పరిశీలించి సంబంధిత అధికారులకు సీసీ కెమెరాల పనితీరు, పోలీసు పహారా నిరంతర విద్యుత్ సరఫరా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరీశీలించిన తర్వాత విజిటర్స్ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం  అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖ, ధర్మవరం రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డి, మడకశిర రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్, హిందూపురం డి ఎస్ పి కంజక్షన్, సి ఐ ఈరన్న, పెనుకొండ తహసీల్దార్ ఉదయ శంకర్, చిలమత్తూర్ తహసీల్దార్ భాగ్య లత, మడకశిర తహసీల్దార్ వెంకటేష్ ఆర్ ఐ అమర్, ఎస్ ఐ గోపి, తాసిల్దారులు,వెంకటేష్,  తదితరులు పాల్గొన్నారు.


Comments