మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.

     గుంటూరు (ప్రజా అమరావతి);


*మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటార



ని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు.*     

       అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇటీవల జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహిళా ఉద్యోగులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి జరిగిన బహుమతి ప్రధానోత్స సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు డాక్టర్ కూచిపూడి మోహన్ రావు అధ్యక్షత వహించారు. చైర్ పర్సన్ శ్రీమతి క్రిస్టినా  తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. సమాజంలో మహిళలు పాత్ర చాలా కీలకమైందని వెల్లడించారు ప్రతి రంగంలోనూ మహిళలు ఎదగటం తనకు ఆనందం కలిగిస్తుంది అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళలకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడని చెప్పారు.

       సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ మహిళలకు పార్లమెంటు శాసన సభలలో ఇంకా సీట్లు పెంచాలని కోరారు పంచాయతీరాజ్ జిల్లా కోఆర్డినేటర్ పద్మ రాణి మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో మహిళలు ముందుకు సాగాలని సూచించారు సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ఉండాలన్నారు.

       డిప్యూటీ సీఈఓ సిహెచ్ కృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా మార్పు రావాలని మహిళలను ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కృషి చేయాలి అన్నారు.      

        ఈ సందర్భంగా ఆటలు పోటీల్లో గెలుపొందిన మహిళలకు అతిథులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మహిళ ఉద్యోగిని ఉష దేవిని జడ్పీ చైర్మన్ అభినందించారు కార్యక్రమంలో పలువురు ఏవోలు ఉద్యోగులు ప్రసంగించారు.

Comments