విజయవాడ (ప్రజా అమరావతి);
*• అమరావతి సభ విజయవంతమైనందుకు ప్రజలు సంతోషించారు*
*• గత పాలకులు అమరావతిని భ్రమరావతి అని ఎద్దేవ చేశారు*
*• ప్రధాన మంత్రే స్వయంగా ముఖ్యమంత్రి పనితనానికి కితాబిచ్చారు*
*• రాబోయే కాలంలో ఏఐ, ఐటీ, క్యాంటం కంప్యూంటింగ్ లకు కేరాఫ్ గా అమరావతి*
*• ప్రపంచంలో అమరావతి నెంబర్ వన్ సిటీగా అవతరించనుంది*
అమరావతి పునః ప్రారంభ సభ చాలా గొప్పగా విజయవంతం అయ్యిందని అందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషించారని సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ ల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బందరు రోడ్డులో గల మంత్రి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని దేవతల రాజధాని అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారన్నారు. దేవతలు సంచరించే చోట రాక్షసులు కూడా ఉండటం సహజమన్నారు. 5 కోట్ల మంది తెలుగువారు మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఉందని మంత్రి తెలిపారు. అమరావతిని భవిష్యత్తులో ఏఐ, ఐటీ, క్యంటం కంప్యూంటింగ్ లకు కేంద్రంగా వర్థిల్లే ముఖ్యమంత్రి చేస్తారన్నారు. రూ. 58,000 కోట్ల అభివృద్ధి పనులకు నిన్న ప్రధాన మంత్రి వేదిక నుంచి ప్రారంభించారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తమ అనుభవంతో గాడిలో పెట్టగలరని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్లపాటు రాజధాని ప్రజలను నానా రకాలు గా ఇబ్బంది పెట్టి, అమరావతి ప్రజలను భయపెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ను చూసి స్ఫూర్తి పొందానని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అనటం ముఖ్యమంత్రి గొప్ప పనితనానికి నిదర్శనమన్నారు. దేశాన్ని గాడిలో పెట్టిన ఏకైక ప్రధాని మోదీ అని అన్నారు. పహల్గామ్ ఉగ్రమూకల దాడి విషయంలో ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. అమరావతిని భ్రమరావతి అని గత పాలకులు విమర్శలు చేశారన్నారు. అమరావతి పునః ప్రారంభానికి ఆహ్వానించినా గత పాలకులు రాలేదన్నారు. గత పాలకులు అమరావతి ప్రాధాన్యతను అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలన్నారు. అమరావతి పునః. ప్రారంభ పనులు చాలా గొప్పగా మొదలయ్యాయన్నారు. అమరావతి పై విషం చిమ్మిన గత పాలకులు, స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలన్నారు. అలా చేస్తే తెలుగు ప్రజలు క్షమించక పోయినా దేవుడు అయినా వారిని క్షమిస్తాడేమోనన్నారు. పోలవరుం ప్రాజెక్టు పూర్తితోపాటు, పోలవరం బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టు కూడా సాధ్యమేనని ముఖ్యమంత్రి నిరూపించారన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తారన్నారు.
యువతకు 20 లక్షల ఉపాధి కల్పించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అమరావతి పునః ప్రారంభ సభకు వచ్చేందుకు వాహనాలు సరిపోక వేలాదిమంది ప్రజలు గ్రామాల్లో ఉండిపోయారన్నారు. సభలో మోడీ చంద్రబాబు పనితీరుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అబివృద్ధి పై ఆయనకు ఉన్న కమిట్ మెంట్ ను తెలియజేస్తుందన్నారు. అమరావతి శక్తిని సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించి కీర్తించారన్నారు. అమరావతి సభ సమయంలో అగ్ని ప్రమాదం వెనుక ఎవరైనా ఉంటే దానిపై పోలిసుల విచారణలో బయటపడుతుందన్నారు. ఇప్పటి వరకు అమరావతి రాజధాని పై ఉన్న అనుమానాలు పటాపంచలు అయిపోయాయని దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు అందరూ గుర్తించారన్నారు. అమరావతి అంటే గత ప్రభుత్వానికి కడుపు మంట అని ఎద్దేవ చేశారు. అమరావతికి చట్ట బద్దత కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
addComments
Post a Comment