అమరావతి (ప్రజా అమరావతి);
డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు.
* 100 శాతం ల్యాండ్ పార్సిల్ - భూకమతాలను పంట సాగు ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా సర్వేలో నమోదు చెయ్యాలి .
* డౌన్ లోడ్ చేసుకున్న వెబ్లాండ్ డేటాను పాలనా పరంగా ,సాంకేతికంగా పెండింగ్ లో ఉన్న గ్రామస్థాయి రైతు సేవా కేంద్ర సిబ్బందికి త్వరగా కేటాయించి అనుసంధానించాలి .
* అన్ని రకాల సాగుపంటలకు నీటి నిర్వహణ పద్ధతి మరియు నీటి సరఫరా పద్ధతులను నమోదు చేయాలి
* ఈ -కేవైసి ద్వారా వేలి ముద్రలు ప్రస్తుతం తప్పనిసరి కాదు .
ఈరోజు 11/08/2025 సోమవారం నాడు రాష్ట్రములోని అన్ని జిల్లాల లోని గ్రామ స్థాయి రైతు సేవా కేంద్రాల సహాయకుల వరకు ఉన్న వ్యవసాయ అధికారులు,ఉద్యాన అధికారులు ,పట్టు శాఖ అధికారులతో *ఈ పంట మరియు వ్యవసాయ డిజిటల్ అప్లికేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .
ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రాష్ట్రములోని వెబ్లాండ్ లో ఉన్న భూ కమతాల మొత్తం (దేవాలయ భూముల వివరాలు) కాకుండా మిగిలిన సమాచారం అంతా డౌన్ లోడ్ చేసుకోవటం జరిగిందని తెలిపారు.*డిజిటల్ పంటల సర్వే ఈ - పంట* లో నమోదు అయ్యే పంటల సాగు సమాచారం ,నీటి నిర్వహణ ,భూ కమతాల సాగు పరిస్థితి స్థాయి తదితర విషయాలు అత్యంత కీలకం అని తెలిపారు. రైతుకు ప్రత్యక్షముగా ,పరోక్షంగా పలువిధాల మేలు చేసే రాష్ట్ర ,కేంద్ర వ్యవసాయ ప్రభుత్వ పథకాలకు *ఈ పంట* డేటా సమాచారం అతి ముఖ్యమైన అంశము కాబట్టి క్షేత్ర స్థాయి సిబ్బంది అత్యంత అప్రమత్తతో నాణ్యమైన రైతుల సమాచార డేటాను సేకరించి ప్రభుత్వానికి అందించాలని తెలిపారు .
* బహువార్షిక ఉద్యాన పంటలను తప్పనిసరిగా ఈ సంవత్సరము నమోదు చెయ్యాలని , ఉద్యాన పంటలలో అంతర పంటలను నమోదు చేసినప్పుడు భూ విస్తీర్ణం తిరిగి నమోదు అవ్వకుండా జాగ్రత్త వహించాలని కోరారు .గట్ల మీద,చేనులో ఉన్న పండ్ల మొక్కలను కూడా నమోదు చెయ్యాలని తెలిపారు .
* ఉద్యాన పంటల నమోదు విషయములో ఆ పంటల రకాలను కూడా నమోదు చేయాలని డైరెక్టర్ ఉద్యాన శాఖ శ్రీనివాసులు ఐఏయస్ తెలిపారు .చిత్తూరు జిల్లాలో మామిడి తోతాపురి రకము విక్రయం లో సరైన సమాచారం లేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు .
* డిల్లీ రావు మాట్లాడుతూ అన్ని రకాల సాగుపంటలకు ఇప్పటివరకు 165843 రైతులతో 441627 ఎకరాల విస్తీర్ణంలో *ఈ పంట* నమోదు చేయడం జరిగింది అని, వీటిని వేగవంతం చేయాలని ఆదేశించారు.
* ఈ పంట సాగు వివరాల నమోదులో దిగువున ఉన్న జిల్లాలను ,డివిజన్ లను ,మండలాలను ,రైతు సేవా కేంద్రం స్థాయి వరకు సమీక్ష జరిపారు .
* ఎ పి ఎయిమ్స్ అందిస్తున్న వివిధ డిజిటల్ అప్లికేషన్ల పై సూష్మ స్థాయి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పురుగుల నిఘాయాప్ ను ప్రస్తావిస్తూ జిల్లాలలోని అన్ని తరగతుల వ్యవసాయ అధికారులు వారం లో ఒకరోజు తప్పనిసరిగా పురుగుల/తెగుళ్ల ఉదృతి ఎక్కువ వున్న ప్రాంతాలలో పర్యటించి ,వాటి పూర్తి వివరాలను సంబంధిత యాప్ లో నమోదు చెయ్యాలని తెలిపారు.
* ఈ కార్యక్రమంలో అదనపువ్యవసాయ సంచాలకులు శ్రీమతి విజయ లక్ష్మి,ఉద్యాన అదనపు సంచాలకులు వెంకటేశ్వర రావు,హరనాథ్ రెడ్డి ,సూపరిండెంట్ ఇంజనీర్ బాలసుబ్రమణ్యం, నిక్ అధికారిని శ్రీమతి స్వాతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు .
addComments
Post a Comment