పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదు… వారిని మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం
పాలేరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం 18 నెలల్లోనే 470 కోట్ల రూపాయలు కేటాయింపు.
నా నియోజకవర్గంలో ఎన్నికల్లో నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం నాకు గర్వంగా ఉంది.
పాలేరు. (ప్రజా అమరావతి);
ఈరోజు పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వాటిలో భాగంగా కూసుమంచి పాత జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ భవనాన్ని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విద్యార్థులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ తరగతి చదువుతున్న 76 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది.పేద పిల్లలకు ప్రయాణ సౌకర్యం లేక చదువులో వెనుకబడకూడదు. గతేడాది 8, 9, 10వ తరగతుల విద్యార్థినిలు అందరికీ సైకిళ్లు ఇచ్చాం. వచ్చే ఏడాది నుంచి జూనియర్ కళాశాలలో చేరుతున్న విద్యార్థినిలకు కూడా సైకిళ్లు అందిస్తాం.
ఈ సందర్భంగా హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశాను. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాలను కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా పేదల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.
ప్రభుత్వ సహాయంతో పాటు అవసరమైతే నేను కూడా వ్యక్తిగతంగా సాయం అందించేందుకు పేద విద్యార్థులకు అండగా ఉంటాను. స్కూల్ అభివృద్ధి కోసం అవసరమైతే స్వయంగా నిధులు సమకూరుస్తాను. ప్రతి విద్యార్థి మంచి చదువులు చదివేలా నా వంతు కృషి చేస్తాను.
గత ప్రభుత్వ పరిపాలన వల్లే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకుని, ప్రతి విద్యార్థిని సమాజంలో ఒక ఆభరణంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది.ఏటీసి(ఐటీఐ), స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కొత్త శకాన్ని తీసుకువస్తాయి.
ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతం తరుణీ హాట్ లో సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల నిర్మాణాల కోసం స్థలం పరిశీలించడం జరిగింది. నిర్మాణ డ్రాఫ్ట్ ప్లాన్ వివరాలను జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ అధికారుల ద్వారా తెలుసుకొని పలు సూచనలు చేయడం జరిగింది.
addComments
Post a Comment