విజయవాడ (ప్రజా అమరావతి);
కార్మికుల భద్రత, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
• పరిశ్రమల్లో భద్రతకు పెద్దపీట వేస్తున్నాము.
• కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టాము.
• ఈఎస్ఐ వైద్యశాలల్లో 500 ఖాళీల భర్తీకి అనుమతి
• ఈఎస్ఐ వైద్యశాలల్లో వైద్య పరికరాల కొనుగోలుకు అనుమతులు
• ప్యాక్టరీల్లో జీరో ప్రమాదాల పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
• రాష్ట్రంలో త్వరలో 7వైద్యశాలలు, 96 డిస్పెన్షరీలు ఏర్పాటు చేయనున్నాము.
• ఈఎస్ఐ వైద్యశాలకు ఎస్ బి ఐ సహకారంతో రెండు అంబులెన్స్ లు
శ్రీ. వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ అండ్ వైద్య భీమా సేవల శాఖామాత్యులు
కార్మికుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కార్మికుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ అండ్ వైద్య భీమా సేవల శాఖామాత్యులు శ్రీ. వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈఎస్ఐ వైద్యశాల ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో సీఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన 2 అంబులెన్స్ లను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఈఎస్ఐ వైద్యశాలల్లో 500 ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అలాగే వైద్యశాలల్లో వైద్య పరికరాల కోనుగోలుకు అనుమతులు వచ్చాయన్నారు.
ప్యాక్టరీల్లో జీరో ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే గతేడాది కర్మాగారాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, వాటి నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికుల ఆరోగ్య భద్రపై దృష్టి సారించామని వారికి అవసరమైన సేవలను 24 గంటలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సేవలను మరింత విస్తృత పరచడంలో భాగంగా ఎస్ బి ఐ సహకారంతో సీఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. కొద్ద రోజుల క్రితం యూనియన్ బ్యాంక్ సహకారంతో రూ. 43 లక్షల విలువైన అంబులెన్స్ ను ఈఎస్ఐ వైద్యశాలకు అందించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్ ల్లో వెంటిలేటర్, ఈసీజీ తదితర రోగికి అత్యవసర స్థితిని నుంచి రక్షించడానికి అవసరమైన అన్ని పరికరాలు ఏర్పాటు చేయడమైనదన్నారు. కార్మికుల కోసం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా రాష్ట్రంలో వైద్యశాలలు, 96 డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రమాదకరమైన రసాయన కర్మాగారాల్లో రికార్డుల మూల్యాంకనం చేయడానికి పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లు కల్పించడానికి, ప్యాక్టరీల్లో భద్రకు సంబంధించి విశ్వవిద్యాలయాల నుంచి సాంకేతిక సహకారం తీసుకునేందుకు జెఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ నెల 4 న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయూ-అనంతపురం, ఏపీ ప్రొడక్టవిటీ కౌన్సిల్ తో కూడా ఓప్పందాలు చేసుకున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. ఈ ఒప్పందాల్లో భాగంగా పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్నషిప్ కు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా కర్మాగారాల కార్మికులకు అవగాహన కల్పించనున్నామన్నారు. ప్రమాదం జరిగితే రూట్ కాజ్ ఎనాలసిస్ ద్వారా విశ్లేషించి, భవిష్యత్తులో మరో సారి ప్రమాదం జరగకుండ తీసుకోవాల్సిన చర్యలను యూనివర్సిటీ బృందాలు సూచిస్తాయన్నారు.
అనంతరం ఎస్ బి ఐ అందించిన రెండు అంబులెన్స్ లను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు, డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ మోహనరావు, జెన్టీయూ-కాకినాడ రిజిస్ట్రార్ ఆర్. శ్రీనివాసరావు, ఎస్ బి ఐ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి. సీతాక్ష్షి సింగ్, ఈఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment