టెక్కలి (ప్రజా అమరావతి);
* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు *
*దివంగత నేత నందమూరి తారక రామారావు టెక్కలిలో ఆసుపత్రిని నెలకొల్పారు*
*వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాల్సిందే*
*అన్ని వార్డులు తిరిగి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన మంత్రి*
*రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా స్పష్టమైన మార్పు రావాలి*
*ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంతి రోగులు వస్తున్నారు...రికార్డులో ఉన్న వివరాలు పరిశీలించిన మంత్రి*
*ఉదయం 8.30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న మంత్రి*
*ఆసుపత్రికి వచ్చిన రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం*
వైద్యులు సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 8.30 గంటలకు టెక్కలి కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి వర్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలనను స్వయంగా పరిశీలించారు. హాజరు పట్టికలో సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపి విభాగం, అత్యవసర విభాగం, జనరల్ వార్డ్, ఎముకల విభాగంతో పాటు అన్ని వార్డులను స్వయంగా పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అన్ని విభాగాల్లోని ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణను నిశితంగా గమనించారు. వైద్యుల పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని అన్నారు. అనంతరం వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బందితో ఆసుపత్రిలోని సమీవేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, లైట్లు, జనరేటర్ వినియోగంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల పట్ల ఆప్యాయత, మానవత్వంతో మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని ఆసుపత్రి సూపర్నెంట్ ను ఆదేశించారు. ఆసుపత్రిని ఆకస్మాత్తుగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యంతోపాటు ఆసుపత్రి పరిసరాలు పరిశ్రమంగా ఉండేటట్లు, పారిశుద్ధ్య నిర్వహణ జరిగే విధంగా ప్రతినిత్యం ఉదయం పర్యవేక్షణ చేపట్టాలని ఆసుపత్రి సూపరిండెంట్ సూర్యా రావు ను ఆదేశించారు. అలాగే రోగుల పడక బెడ్ షీట్లు, మరుగుదొడ్లు, ఆసుపత్రి నిర్వహణ అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆర్డీఓ ఎం.కృష్ణ మూర్తి ని సూచించారు. ప్రతీ రోజు చాలామంది రోగులు సుదూర ప్రాంతాల నుండి నమ్మకం, విశ్వాసంతో ఆసుపత్రికి వస్తున్నారని అటువంటి వారిపై వైద్యులు ఆప్యాయతతో కూడిన వైద్యాన్ని అందించాలని అన్నారు. స్టాఫ్ నర్స్ ల సిబ్బంది కొరత ఉందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడి స్టాఫ్ నర్సుల నియామకానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ధోబీ లు పడకల మీద బెడ్ షీట్లను ప్రతిరోజు మార్చే విధంగా వాషింగ్ మిషన్లను ఏర్పాటుకు అవసరమైన అంచనా విలువను నివేదికగా అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలనను పాటించి ఉదయం తొమ్మిది గంటలకు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ తో ఫోన్లో మాట్లాడి ఆసుపత్రి వద్ద నిత్యం భద్రత కల్పించే విధంగా ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో బయో మెడికల్ ట్రీట్మెంట్ ప్లాంట్, మార్చురీ భవన నిర్మాణాలను వచ్చే నెల 15 న వినియోగానికి సిద్ధం చేయాలని ఏపీఎంఐడిసి ఇంజనీరింగ్ అధికారి వెంకటేష్ ను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంతంలోని స్థలాన్ని సుందరంగా చదున చేసే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ఎమ్ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారి సత్య ప్రభాకర్ ఆదేశించారు. ఆసుపత్రి లో రోగులకు వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన సౌకర్యాలను, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తానని మంత్రి తెలిపారు. ఆస్పత్రి ప్రధాన రహదారి కి ఇరువైపులా విద్యుత్ దీపాలు, మొక్కలు నాటి ఆహ్లాద వాతావరణం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా, లక్ష్మణ రావు, డా, మహరాజ్, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
*అవసరమైన సిబ్బందిని నియమిస్తాం*
ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించడం జరుగుతందని అన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఎంత మంది ఉన్నారు, అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఎన్నిఇబ్బందులు వచ్చివ వాటని అధిగమించి ముందుకు వెల్లడం జరిగిందని అన్నారు. ఆక్సజన్ ప్లాంటులు కూడా ఏర్పాటు చేశామని వాటిని కూడా కొంతమంది అడ్డతగిలారని అన్నారు.
*దివంగత నేత నందమూరి తారక రామారావు టెక్కలిలో ఆసుపత్రిని నెలకొల్పారు*
దివంగత నేత నందమూరి తారకరామారావు హయాంలో టెక్కలిలో ఆసుపత్రిని నెలకొల్పారని గుర్తు చేశారు. పాలకొండకు తీసుకు వెళ్లేందుకు కొంతమంది ప్రయత్నాలు చేశారని, కానీ టెక్కలిలో జిల్లా ఆసుపత్రి
ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీనితో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు వైద్యం అందించడం జరుతుందని అన్నారు. 100 పడకల ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రి చేయడం జరిగిందని అన్నారు.గత ప్రభుత్వం వైద్యరంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
*బీసీ వసతి గృహల అధికారులతో సమావేశం*
బీసీ వసతి గృహాల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు , వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన వసతులు
కల్పించాలని, రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వసతి గృహాల వార్డెన్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment