*వచ్చే ఏడాది కరోనా కు టీకా వస్తుంది: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌.* న్యూఢిల్లీ: దేశం లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగు తున్నాయి. ప్రతి రోజూ 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 400 కు పైగా జనం మరణిస్తున్నారు. ఈ నేపథ్యం లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచం తో పోలిస్తే భారత దేశం కరోనా తో మెరుగ్గా పోరాడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఆదివారం ఆయన ఓ జాతియా మీడియా సంస్థ తో మాట్లాడుతూ, కరోనా పరీక్షలను పెంచామని అదే విధంగా భారత్‌ లో మరణాల రేటు కుడా తక్కువ గానే ఉందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది నాటికి కరోనా కు టీకా కూడా వస్తుందన్నారు. కరోనా కూడా ఇతర వ్యాధుల మాదిరి దేనని, కానీ మన జీవన శైలి ని మార్చు కోవాల్సి వస్తుందని ఆయన సూచించారు.


Comments