ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది:- ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారు ప్రపంచ అవయవ దాన దినోత్సవం 2025ను 'ఆన్సరింగ్ ది కాల్' అనే థీమ్‌తో నిర్వహించారు, కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్య బృందం అవయవ దానం యొక్క ప్రాముఖ్యత మరియు సమాజంపై దాని ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు, అవయవ దానం ప్రాణదానంతో సమానమని, అవయ దానం చేయడం అనేది మరణించినా తిరిగి జీవించడం అని, అవయవ దానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇవ్వడం, మనకు పునఃజన్మ అని, ఒక వ్యక్తి అవయవ దానం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడ గలడు, అవయవాలను కేవలం దానం ద్వారా మాత్రమే సమకూర్చు కో గలమే కానీ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా అవయవాలను సృష్టించ లేమని, అవయవ దానానికి మించిన గొప్ప దానం మరొకటి లేదని, అవయవ దానానికి అప్పుడే పుట్టిన శిశువు నుండి 90 ఎళ్ళ వయస్సు వారు కూడా అవయవ దానం చేయవచ్చని, కావున సమాజంలో అవయవ దానం పై ఉన్న అపోహలను తొలగిస్తూ.. ప్రతీ ఒక్కరూ ఈ అవయవ దానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని, కిమ్స్ శిఖర హాస్పిటల్ నందు అవయవ మార్పిడి శస్త్రచికిత్స లు అందుబాటులో ఉన్నాయని, అవయవదానం చేయదలచిన వారు జీవన్ ధాన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్యుల బృందం తెలియజేశారు, అదేవిధంగా ప్రభుత్వం జీవన్‌దాన్ పోర్టల్ ద్వారా అవయవ కేటాయింపులు, నిరీక్షణ జాబితాలను నిర్వహించడం, మరియు ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా అవయవ మార్పిడిని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర అవయవ దానం మరియు మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రహీతలు మరియు దాతలు ఇద్దరికీ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవడం అవసరం అని, ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కార్యక్రమం లో కిమ్స్ శిఖర హాస్పిటల్ కూడా ఒక భాగమని చెప్పడానికి మేము గర్విస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్: సూర ప్రదీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిట్టెం లక్మణ్ రావు,
డాక్టర్ విష్ణు ప్రసాద్, డాక్టర్ ప్రతాప్ మౌళి, డాక్టర్ శరత్ చంద్ర లు పాల్గొని ప్రసంగించారు,
addComments
Post a Comment