శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ: దేవస్థానము నందు ఈరోజు అనగా ది.20-06-2020 న అమ్మవారి దర్శనమునకు భక్తులను ధర్మ దర్శనము మరియు ముఖమండప దర్శనములు టైం స్లాట్ పద్దతి ద్వారా అమ్మవారి దర్శనము చేసుకున్నారు. మరియు పరిమిత సంఖ్యలో చండీ హోమం, శాంతికల్యాణము, రుద్రహోమము, రాహు-కేతు పూజ మరియు లక్షకుంకుమార్చన సేవలు జరిపించుకోనుటకు భక్తులకు అవకాశము కల్పించబడినది. ప్రత్యక్షముగా పూజల యందు పాల్గొను అవకాశము లేనటువంటి భక్తుల సౌకర్యార్థము దేవస్థానము నందు జరుగు శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శాంతి కళ్యాణము, శ్రీచక్రనవావర్నార్చన, రాహు కేతు పూజలు పరోక్షముగా భక్తుల గోత్ర నామముల తో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినదని, కావున ఈ పరోక్ష సేవలు పరోక్షముగా జరిపించుకోనదలచిన భక్తులు టిక్కెట్లు online నందు www.kanakadurgamma.org – website ద్వారా పొందవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తెలిపియున్నారు. పరోక్ష సేవలు బుక్ చేసుకున్న భక్తులందరికీ అమ్మవారి ప్రసాదములు పోస్టు ద్వారా పంపబడును అని ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు తెలిపారు. దర్శనము మరియు సేవల, ప్రసాదము టికెట్లు కొరకు భక్తులు online నందు www.kanakadurgamma.org వెబ్ సైటు , kanakadurgamma అను ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, మీ సేవ సెంటర్లు, దేవస్థానము కౌంటర్లు నందు పొందవచ్చని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు తెలిపారు. దేవస్థానము ప్రాంగణముల నందు కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, సానిటైజర్లు ఏర్పాటు, ప్రతినిత్యము క్యూ లైన్లు పరిశుబ్రత , థర్మల్ సేన్సార్స్ ఏర్పాటు మరియు ఇతర పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. Øమాస్కు ధరించిన భక్తులను మాత్రమే శ్రీ అమ్మవారి దర్శనమునకు అనుమతించబడుచున్నదని తెలిపారు. Øఆలయ పరిసర ప్రాంతములు పరిశుభ్రముగా ఉంచుతూ ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లేరైడ్ తో శుభ్రపర్చుటకు తగిన చర్యలు తీసుకొనబడినదని తెలిపారు. Ø భక్తులు కాళ్ళు, చేతులు శుభ్రపర్చుకొని మహామండపము క్యూ లైను మార్గము ద్వారా దర్శనమునకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేయడమైనది. Ø భక్తుల సౌకర్యము కొరకు ఉదయం 7 గం. ల నుండి మధ్యాహ్నం 3 గం.ల వరకు పులిహోర/దద్దోజనము ప్రసాదము ను దర్శనము అనంతరము ప్యాకెట్ల రూపములో సిబ్బంది మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు ధరించి భక్తులకు పంచిపెట్టబడినది.
Popular posts
కష్టంలో అండగా...
• GUDIBANDI SUDHAKAR REDDY

వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలు అందించాలి.
• GUDIBANDI SUDHAKAR REDDY

కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ పథకం ద్వారా విస్తృత ప్రయోజనాలు: ప్రాంతీయ పి ఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్
• GUDIBANDI SUDHAKAR REDDY
101 MOUs Signed at International Reverse Buyer-Seller Meet in Tirupati, Opening Global Opportunities for AP MSMEs.
• GUDIBANDI SUDHAKAR REDDY

మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం వరం.
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment