*మోదీ దయ వల్ల దేశంలో అద్భుతం జరిగింది : సుంకర పద్మశ్రీ* విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దయ వల్ల దేశ చరిత్రలోనే ఒక అద్భుతం జరిగిందని...దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా నాభుతో నా భవిష్యత్ అన్న రీతిలో మొదటిసారి పెట్రోల్ కన్నా డీజిల్ రేటు ఎక్కువ ఉందని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది దేశ చరిత్రలోనే ఒక ప్రధాని మోదీ పాలనకు గీటు రాయని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదలపైన బాదుడే బాదుడని పద్మశ్రీ మండిపడ్డారు. ప్రజల సొమ్మును బ్యాంకుల ద్వారా దోచుకున్న బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం రుణమాఫీలు, రాయితీలు... సామాన్యులకు మాత్రం వీపు పగిలేలా పన్నుల భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిందని.. ఇక్కడే గందరగోళం మొదలయ్యిందన్నారు. ఆ రూ.20 లక్షల కోట్లు ప్రజలకు ఇవ్వడానికా లేకా ప్రజల నుండి దోచుకోవటానికా ? అని ప్రశ్నించారు. ఈ గందరగోళంపై బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.


Comments